Natural Farming and Organic Farming: ప్రస్తుతం వ్యవసాయరంగంలో భిన్నమైన ఆలోచనా పద్ధతులు పోటీ పడు తున్నాయి. వ్యవసాయ భూములకు ఏ రకమైన ఉత్పత్తి సాధకాలను బయట నుంచి సరఫరా చేయాల్సిన అవసరం లేదని వాదించే ప్రకృతి లేదా సహజ వ్యవసాయ సిద్ధాంతకర్తలు ప్రముఖంగా ప్రాచుర్యంలోకి వస్తున్నారు.
సహజ వ్యవసాయం:ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో చాలా మంది ఈ సహజ వ్యవసాయ పద్ద తుల్ని ఆచరించి అద్భుత ఫలితాలను సాధిస్తున్నామని తమ అనుభవాలను పంచుకుంటున్నారు. వీరి వాదం ప్రకారం భూమిలో అన్నిరకాల పోషకాలు నిక్షిప్తమై ఉన్నాయనీ, వాటిని ఉపయోగపడేలా చేయగలిగితే బయటనుంచి రసాయనిక లేదా సేంద్రియ ఎరువుల్ని వేయాల్సిన అవసరం లేదని వారి అభి ప్రాయం. గోమూత్రం వంటి కొన్ని పదార్థాలను వాడటం ద్వారా అచేతనంగా ఉన్న పోషకాలు అందుబాటులోకి వస్తాయని వారి విశ్వాసం. ఎరువులు, పురుగు మందులు, శిలీంద్రనాశకాలు వాడకుండానే మంచి దిగుబడులను సాధించవచ్చని వారు వాదిస్తున్నారు. అజీమ్ ప్రేమ్జీ ఫిలాంత్రఫిక్ ఇనీషియే టివ్స్ ఫౌండేషన్ ఈ సహజ వ్యవసాయ పద్ధతులను ఆంధ్రప్రదేశ్లో విస్తృత ప్రచారంలోకి తీసుకురావటానికి సాయపడుతుంది. కొన్ని సంస్థలు రైతులకు సహజ వ్యవసాయ పద్ధతుల్లో శిక్షణనిస్తున్నాయి.
సహజ వ్యవసాయ పద్ధతుల ద్వారా పంటల్ని సాగుచేయాలంటే తక్కువ ఖర్చవుతుంది. దిగుబడులు కొద్దిగా తగ్గినా, ఒక క్వింటాలు ఉత్పత్తి ఖర్చు బాగా తగ్గుతుంది. ఈ వ్యవసాయ ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యానికి మేలు చేస్తాయనే భావన కూడా ఉండటం వల్ల వాటికి మార్కెట్లో మంచి ధర కూడా పలుకుతుంది. రసాయనాలను ఎక్కువగా వాడటం వల్ల ఖర్చులు పెరిగిపో తున్నాయని, భారీగా ఎరువుల్ని, పురుగు మందుల్ని వాడటం వల్ల వాతావ రణ కాలుష్యం పెరిగిపోతుందని, వినియోగదారుల ఆరోగ్యాలు చెడిపోతున్నా యని పర్యావరణవేత్తలు, డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య లన్నింటికీ సహజ వ్యవసాయం చక్కటి పరిష్కారమనీ రైతుల్ని లాభాల బాట పట్టిస్తుందనీ, వ్యవసాయ ఉత్పత్తులు తగ్గకుండా, పర్యావరణ హితమైన పద్ద తుల వాడకం వల్ల రైతులు ఎంతో లాభిస్తారని సహజ వ్యవసాయ ప్రచారకులు చెబుతున్నారు. భవిష్యత్లో ఏమి జరగనుందో రైతులు ఏమేరకు ఈ సహజ వ్యవసాయాన్ని ఆదరిస్తారో మనకిప్పుడు తెలియదు. కాని ప్రస్తుతా నికి ఒక శాతం రైతులు కూడా సహజ వ్యవసాయాన్ని పాటించడం లేదు. కొందరు రైతులు మంచి ఫలితాలను సాధిస్తే క్రమేపీ మరికొందరు రైతులు ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆదరించవచ్చు.
సేంద్రియ వ్యవసాయం:సహజ వ్యవసాయానికి, రసాయనిక పద్ధతులపై నారపడే సాంద్రవ్యవసా యానికి మధ్యస్థంగా సేంద్రియ వ్యవసాయం కూడా ఒక ప్రత్యామ్నాయంగా ముందుకొచ్చింది. బయటనుంచి పదార్థాలను తెచ్చి భూమిలో వేయాల్సిన అవసరంలేదని చెప్పే సహజ వ్యవసాయ ప్రయోక్తలతో సేంద్రియ వ్యవ సాయ ప్రచారకులు విభేదిస్తారు. పశువుల పేడతో కలిసిన వ్యవసాయ వ్యర్థా లను, ఆకు, అలములతో కూడిన ప్రకృతి సిద్ధ వ్యర్థాలనుంచి తయారయ్యే హరిత ఎరువులను పట్టణ వ్యర్థాలతో తయారుచేసే కంపోస్టు ఎరువులను, నూనె తీసిన తవుడు, నువ్వులు, పల్లీలు వంటి పదార్థాలను సేంద్రియ వ్యవ సాయంలో వాడతారు. వాన పాములను విరివిగా పెంచుతూ, అవి సారవంతం చేసిన వర్మికంపోస్టుని ఎక్కువగా వినియోగిస్తారు.
వీటితో పాటు ఆవుల మల, మూత్రాలను నిల్వచేసి, వాటిని వివిధ రూపాల్లో చిలుకుతారు. అయితే రసాయనిక ఎరువులను కీటక, శిలీంద్ర నాశక పదార్థాలను వాడరు. జీవన ఎరువులను, కీటకాలను, శిలీంద్రాలను పారద్రోలే వేపనూనె, ట్రైకోడెర్మా వంటి పదార్థాలను విరివిగా వాడతారు. అత్యవసర పరిస్థితుల్లోనే రసాయ నిక ఎరువుల్ని కీటక, శిలీంద్ర నాశకాలను వినియోగిస్తారు. సేంద్రియ పద్ద తుల్లో పండించే ఉత్పత్తుల ఉత్పత్తికి 95 శాతం పైగా సేంద్రియ పదార్ధాలనే వాడాలి. రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఐదు శాతానికి లోబడే వాడాలి అలాంటి పరిస్థితుల్లో ఉత్పత్తయిన వాటికే సేంద్రియ ఉత్పత్తుల ధృవీకరణ పత్రాలను పొందగలుగుతారు. కొండప్రాంతాల్లో రసాయనాల వాడకం చాలా పరిమితంగా ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో రైతులు సేంద్రియ పద్ధతులను పాటించి, ధృవీకరణ పత్రాలను పొందటం సులభం.
Also Watch: