Plant Growth Hormones: మనుషులు, జంతువులలో మాదిరిగానే మొక్కలలో హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి మొక్కలలో కొన్ని భాగాల్లో సూక్ష్మ పరిమాణంలో తయారై ఇతర భాగాలకు ప్రయాణం చేసి మొక్క పెరుగుదల, అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి. విత్తనం మొలకెత్తటం దగ్గర నుండి చెట్టు పుష్పించి, పిందె, కాయ అభివృద్ధి వరకు ఈ హార్మోన్ల ప్రభావం ఉంటుంది. విత్తనం తయారీ వరకు హార్మోన్లలు ఎక్కువ ప్రభావంగా ఉపయోగపడ్తాయి.
మొక్కలలో తయారయ్యే సహజ హార్మోన్లు 5 రకాలు:
1. ఆక్సిన్లు
2. జిబ్బరిన్లు
3. సైటోకైనిన్లు
4. పెరుగుదల నియంత్రించేవి
5. ఇథలీన్
1. ఆక్సిన్లు : ఇవి ముఖ్యంగా కొత్తగా విభజన చెందిన కణాల పరిమాణం పెరగడానికి ఉపయోగపడ్తాయి. మొక్కలలో సహజంగా తయారయ్యేది ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం. విత్తనాలు మొలకెత్తడంలోను, చెట్టు పెరుగుదలకు, పూలు, కాయలు రాలిపోకుండా, వేర్లు పెరగడానికి తోడ్పడుతాయి.
Also Read: Agri Youth Summit -2023: పీజేటీఎస్ఏయూ లో ఘనంగా ముగిసిన అగ్రి యూత్ సమ్మిట్ -2023
ఆక్సిన్ల 3 రకాలు:
i) ఇండోలు గ్రూపు: ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం, ఇండోల్ బ్యుటెరిక్ ఆమ్లం
ii) నాఫ్తలీన్ గ్రూపు : నాఫ్తలీన్ ఎసిటిక్ ఆమ్లం, బీటానేఫ్లాక్సీ ఎసిటిక్ ఆమ్లం, మిథైల్ ఎస్టర్ ఆఫ్ ఎన్.ఎ.ఎ.
iii) ఫినాక్సీ గ్రూపు : 2,4 డైక్లోరో ఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లం, 2,4,5 – ట్రెక్లోరో ఫినాక్సీ.
2. జిబ్బరిలెన్లు : మొక్క కణాలు బాగా పొడవుగా పెరగడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మొక్కలలో దాదాపు 50 రకాల జిబ్బరిన్లు తయారు అవుతాయి. ఇందులో ముఖ్యమైనది జి.ఎ-3 ఉంటుంది. మొక్కలు పొడవుగా ఎదగటానికి, విత్తనం మొలకెత్తటానికి, గింజలు లేకుండా కాయల అభివృద్ధి వీటిని వాడుతారు.
3. సైటోకైనిన్లు: ఇవి కణ విభజనకు అవసరం అవుతుంది. జియాటిన్ అనబడే సహజమైన సైటోకైనిన్ మొదటిసారిగా మొక్కజొన్న గింజలలో కనుగొన్నారు.
4. పెరుగుదల నియంత్రించే హార్మోన్లు : ఇవి ఆక్సిన్లకు వ్యతిరేకంగా పని చేస్తాయి. మొక్క పెరుగుదలను తగ్గించి త్వరగా పూత రావటానికి వాడుతారు. మొక్కల్లో సహజంగా తయారయ్యే ఇఓటరు ఆబ్సిసిక్ , మాలిక్ హైడ్రజైడ్ , ట్రై-అయిదో బెంజాయిక్ ఆమ్లం. ఆలుగడ్డ, ఉల్లిపాయలు నిలువలో మొలకెత్తకుండా చేయడానికి, గింజలు మొలకెత్తకుండాను, మొక్కల ఎత్తును తగ్గించి, గుబురుగా పెరగడానికి, త్వరగా పూత రావటానికి వాడుతారు.
5. ఇథలీన్: ఇది గాలి రూపంలో పని చేస్తుంది. కాయలు త్వరగా పండటానికి, మంచి రంగు రావడానికి తోడ్పడుతుంది. మామిడి, అనాస మొక్కలలో పూత రావటానికి తోడ్పడుతుంది.
Also Read: Soil Fertilizer Mixture: మొక్కలు పెరగడంలో మట్టి ఎరువుల మిశ్రమం ఎలా తయారు చేసుకోవాలి..