ఉద్యానశోభతెలంగాణవార్తలుసేంద్రియ వ్యవసాయం

మిద్దె తోటల పెంపకదారులకు తగిన సహకారం అందిస్తాం… వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

0
ప్రజల ఆరోగ్యాన్ని రక్షించే మిద్దె తోటల పెంపకం ద్వారా CTG (సిటీ అఫ్ టెర్రస్ గార్డెనింగ్) గ్రూప్ వారు సమాజానికి అవసరమయ్యే సేంద్రియ పద్ధతిలో మిద్దె తోటల పెనపకంపై అవగాహనా కార్యక్రమాలు చేపట్టారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మెచ్చుకొన్నారు. 70 వేల మంది సభ్యులుగా ఉన్న CTG గ్రూప్ లు 70 లక్షలు అవ్వాలని అయన అభిలషించారు. ఖమ్మంలో బాలాపేటలోని మానుకొండ జ్యోతి, రాధాకిషోర్ గార్ల మామిడి తోట ఫామ్ హౌస్ లోఆదివారం (నవంబర్ 24 న) జరిగిన CTG ఖమ్మం జిల్లా వన సమారాదన కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, CTG కో ఫౌండర్ సరోజా, అడ్మిన్స్ మానుకొండ జ్యోతి, డా. సరోజినీ, డా నిర్మల,  కైసర్ బేగం, నివాస్ కొణిదెన, సభ్యులు హాజరయ్యారు. మిద్దె తోటల పెంపకం సూచనలు సలహాలు, క్విజ్ లు, కోలాటం, ఆటపాటలతో వివిద రకాల బహుమతులతో సందడిగా జరిగింది. సరోజా తెచ్చిన గ్రీన్ చేమంతితో పాటు ఇంకా రెండు రంగుల చామంతి నారు, తెల్ల బంతి మొక్కలు, రెండు రకాల వంగ నారు, బ్రకోలి, ఎర్ర కాలిఫ్లవర్, ఆకుపచ్చ కాలిఫ్లవర్, కాప్సికం, పసుపు మిరప మొక్కలు ఇచ్చి అవి పెంచడంలో మెలకువలు వివరించారు. ఖమ్మంలో మిద్దె తోటల పోటీలు ప్రకటించి కొన్ని ఎంపిక చేసి, CTG తరపున సర్టిఫికెట్స్, బహుమతి ప్రదానం చేశారు. CTG  కో ఫౌండర్ సరోజ మాట్లాడుతూ తమ సభ్యులకు మాత్రమే కాకుండా, భావి తరాలకి సేంద్రియ పద్దతిలో మిద్దె తోటలు పెంచడం గురించి స్కూల్స్, కాలేజీ విద్యార్థులకి అవగాహనా కార్యక్రమాలు, టెర్రస్ గార్డెన్స్ విజిట్స్ ఫామ్ ఫీల్డ్ ట్రిప్స్ లాంటివి గత మూడేళ్ళ నుంచి చేపట్టామని తెలిపారు. మిద్దెతోటలకు ప్రభుత్వం పరంగా ఉద్యానశాఖ నుంచి సబ్సిడీ ధరల్లో సేంద్రియ ఎరువులు మొదలైనవి  అందించాలని సరోజ కోరారు. తగిన సహాకారం అందించట్టానికి ఎర్పాటు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు హమీ ఇచ్చారు.
Leave Your Comments

యాసంగి వరి నారుమళ్లు పోసేందుకు ఇది సరైన సమయం

Previous article

You may also like