Water Hyacinth Plant: గుర్రపు డెక్క నీటిలో పెరిగే కలుపు మొక్క ఇటీవల కాలంలో ఈ కలుపు మొక్క చాలా వరకు చెరువులు , పంట కాలువలు మరియు వేగంగా ప్రవహించని నీటిలో ఎక్కువ కనిపిస్తుంది. దక్షిణ అమెరికా ప్రాంతానికి చెందిన ఈ మొక్కను 1896 వ సంవత్సరంలో రాయల్ బోటానికల్ గార్డెన్ కలకత్తాకు అలంకార మొక్కగా దిగుమతి చేయడం జరిగింది. ఆ తరువాత ఈ మొక్క దేశం అంతటా విస్తరించింది . ఈ కలుపు మొక్క వలన చేపల వేట కష్టంగా మారడం. కాలువల్లో పడవల రాకపోకలకు ఆటంకం కలగడం, నీటి నష్టం, దోమలు, ఇతర క్రిమి కిటకాలు వృద్ధి చెందడం వలన జబ్బుల వ్యాప్తి, జీవ వైవిధ్యానికి నష్టం, నీటి నష్టం, నాణ్యత దెబ్బతినడం జరుగుతుంది.
ఈ కలుపు మొక్క నీటిపైన తేలియాడుతూ నీటిలోని పోషకాలను పీల్చుకుంటుంది . వేరు భాగంలో ఉండే తేలికపాటి కణజాలం వలన మొక్కకు నీటి పైన తేలియాడే గుణం ఉంది. మొదటగా చెరువుల్లో, కాలువల్లో ఒక్కో మొక్కగా కనిపిస్తుంది. కానీ శాఖీయోత్పత్తి ద్వారా వేగంగా వ్యాప్తి చెంది పూర్తిగా చెరువులు, కాలువల నిండా విస్తరిస్తుంది. శాఖీయోత్పత్తి ద్వారా మాత్రమే కాకుండా ఈ మొక్క పుష్పించి విత్తనాలను ఉత్పత్తి చేయడం ద్వారా కూడా ప్రవర్ధనం చేదుతుంది. ఉత్పత్తి చేయబడిన విత్తనాలు చెరువులో నీరు తక్కువగా ఉండే కాలంలో నిద్రావస్థలో ఉండి నీరు బాగా నిలువయినా తరువాత మొలకెత్తి ఈ కలుపు మొక్క మళ్ళీ విస్తరించడానికి అవకాశం కలుగజేస్తాయి.
శాఖీయోత్పత్తి ద్వారా తల్లి మొక్క నుండి చిన్న మొక్కలు తెలియడుతూ నీటిలో ప్రవహించి ఈ కలుపు మొక్కలు క్రొత్త ప్రాంతాలకు విస్తరించడానికి దోహదం చేస్తాయి. భారతదేశం లో ఈ మొక్క సుమారు 20 లక్షల హెక్టర్ల నీటి వనరుల్లో విస్తరించినట్లు అంచనా. ఈ కలుపు మొక్క నియంత్రణకు వివిధ రాకలైన కలుపు నివారణ రాసాయనాలు, జీవ నియంత్రణ పద్ధతులు అందుబాటులో ఉన్నపటికి వేగవంతమయిన ప్రత్యూత్పత్తి, నీటి ప్రవాహం తో పాటు పంట కాలువల్లో / చెరువుల్లో కలుపు మందులు పిచికారీ చేయడానికి అవకాశం లేకపోవడం వంటి కారణాల వలన క్రొత్త ప్రాంతాలకు వ్యాప్తి చెందే గుణాలు వలన కలుపు మొక్క నివారణ కష్టసాధ్యంగా మారింది.
Also Read: Water Hyacinth: చెరువుల్లో ఉండే గుర్రపుడెక్క యాజమాన్యం.!
గుర్రపు డెక్కను కలుపు గా భావించి నివారించడం ఒక అంశం అయితే ఈ కలుపును ఒక వ్యవసాయ / జీవ వనరులుగా వాడుకొని మాల్చింగ్, తయారీ వంటి వివిధ పద్ధతుల ద్వారా పంటల ఉత్పాదకతను పెంపొందించవచ్చు.
గుర్రపు డెక్కను పచ్చి రొట్ట ఎరువు: గుర్రపు డెక్కను ముక్కలుగా కోసి 1-2 అంగుళాలు పొలంలో దున్నీ లేదా నేరుగా నెలపై మాల్చింగ్ గా వాడుకోవచ్చు.
గుర్రపు డెక్కను మాల్చింగ్ గా వాడడం వలన కలిగే లాభాలు
- పచ్చి రొట్ట ఎరువుగా నేలకు పోషకాలు అందిస్తుంది.
- నేల నిర్మాణాన్ని అభివృద్ధి పరుస్తుంది.
- నేల నుండి తేమ ఆవిరి రూపంలో నష్టపోకుండా కాపాడుతుంది.
- అధిక వర్షాల వలన కలిగే నేల కోతను అరికడుతుంది.
- క్రమం తప్పకుండా గుర్రపు డెక్కతో మాల్చింగ్ చేయడం వల్ల నేలలో కర్బన శాతం పెరిగి నీటి నిలువ ఉంచుకొనే సామర్ధ్యం పెరుగుతుంది.
Also Read:Rules for Watering: నీటిని పెట్టే నియమావళిని తెలుసుకోండి.!
Also Watch: