ఉద్యానశోభ

వేసవి కాలంకు అనువైన కూరగాయ పంటలు మరియు రకాలు – తీసుకోవలసిన జాగ్రత్తలు

0
Dhoni Farm
Dhoni Farm

వేసవిలో కూరగాయలకు అధిక డిమాండ్ ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకొనే రకాలను ఎంపిక చేయడం, సాగులో మేలైన యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా వేసవిలో అధిక దిగుబడులతో పాటు అధిక ధరలను పొందే వీలుంది.

వేసవి కాలంకు అనువైన కూరగాయ పంటలు మరియు రకాలు

టమాట: పూసా ఎర్లీడ్వార్ఫ్, మారుతమ్, అర్క వికాస్, పూసా-120, సంకర రకాలైన నవీన్, అవినాష్-2, అన్నపూర్ణ. వంగ: పూసా పర్పుల్ క్లస్టర్, భాగ్యమతి, హరిత, గ్రీన్ లాండ్, ఉత్కర్ష, కల్పతరువు. మిరప: సిఎ-960 (సింధూరు). బెండ: అర్క అనామిక, అర్క అభయ, వర్ష, ప్రియ, సుప్రియ. బీర: పూసా నస్ దర్, జైపూర్ లాంగ్, జగిత్యాల లాంగ్, సురేఖ, సురేఖ, సంజీవని, మహిమ. సొర: అర్క బహర్, కావేరి, స్వాతి, వరద. కాకర: అర్క హరిత, యం.బి.టి.హెచ్.-101, కో.లాంగ్ గ్రీన్. గోరు చిక్కుడు: పూసా సదా బహార్, పూసా నవబహార్, గౌరి.

టమాట, వంగ మరియు మిరప నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి. నేలను 3-4 సార్లు దుక్కి దున్నుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాని 8-10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువును వేసి కలియ దున్నాలి. దీనితో పాటు 24 కిలోల భాస్వరము, 24 కిలోల పొటాష్ ను ఇచ్చు ఎరువులను వేయాలి. 40 కిలోల నత్రజని ఇచ్చే ఎరువును మాడు సమపాళ్ళుగా నాటిన 30 వ రోజు, 45వ రోజు మరియు 60 వ రోజున వేయాలి. నాట్లు వేసిన రెండు రోజులలోపు పెండిమిథాలిన్ అనే కలుపు మందును 6 మి.లీ/ లీటరు నీటికి కలిపి (ఎకరానికి 1.2లీ. 200 లీటర్ల నీటిలో) తడి భూమిపైన నేలంతా బాగా తడిచేటట్లు పిచికారి చేయాలి.బెండ, కాకర, బీర, సొర, దోస, గుమ్మడి, కూర గుమ్మడి, పొద చిక్కుడు మరియు గోరు చిక్కుడు పంటలను నేరుగా ప్రధాన పొలంలో విత్తుకోవాలి. విత్తేముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ పంటను తప్పనిసరిగా నత్రజని స్థాపించే రైజోబియం కల్చరుతో విత్తన శుద్ధి వేయాలి.  చివరి దుక్కిలో 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 24-32 కిలోల భాస్వరం, 20-24 కిలోల పొటాష్ నిచ్చు ఎరువులును వేసుకోవాలి. 32-40  కిలోల నత్రజని రెండు దఫాలుగా విత్తిన 25 రోజులకు మరియు 45 రోజులకు పైపాటుగా వేయాలి.

తీసుకోవలసిన జాగ్రత్తలు:

పూత, పిందె రాలటం:

వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు వేడి గాలులువల్ల పుత, పిందే రాలుతుంది. దీని వల్ల దిగుబడులు తగ్గుతాయి. పూత, పిందె రాలుడాన్ని నివారించుటకు నేలలో తేమ ఒడిదుడుగులు లేకుండా చూసుకోవాలి. పూత, పిందె రాలుకుండా, పిందె బాగా పట్టడానికి టమాట, వంగ లాంటి పంటలకు ప్లానోఫిక్స్ (ఎన్.ఎ.ఎ.) 2.5 మి.లీ. 10 లీటర్ల నీటిలో కలిపి పూత దశలో వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. మిరప పూత దశలో ప్లానోఫిక్స్ 2.5 మి.లీ. 10 లీటర్ల నీటిలో కలిపి పూత దశలో రెండు సార్లు పిచికారి చేస్తే పిందె, కాత నిలుస్తుంది. తీగజాతి కూరగాయల్లో అధిక ఉష్ణోగ్రతకు మగపూలు ఎక్కువగా వచ్చి లింగ నిష్పత్తి తగ్గి, దిగుబడి తగ్గుతుంది. నివారణకు పూత దశలో సైకోసిల్ (సి.సి.సి) 2.5 గ్రా. 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

నీటి ఎద్దడి:

తగినంత నీటి వసతి ఉంటేనే వేసవిలో కూరగాయలు సాగు చేయాలి. కూరగాయల్లో సుమారుగా 85-90 శాతం నీరుంటుంది. కాబట్టి నీటి ఎద్దడి వల్ల బరువు, నాన్యత తగ్గి దిగుబడి కూడ తగ్గుతుంది. కూరగాయల్లొ రెండు సున్నిత దశలు ఉంటాయి. అవి పంట కొతకు వచ్చినఫ్పుడు, కోతకు ముందు 2-3 వారాలు వ్యాపార సరళిలో కూరగాయలు పండించినప్పుడు నీరు ఇవ్వాల్సిన ఆవస్యకత, ఇప్పుడు నీరు ఇవ్వాలి, నీరు ఇవ్వాల్సిన పద్దుతులు, ఎంత నీరు ఇవ్వాలి అనే నాలుగు అంశాలపై దృష్టి సారించాలి.

తేమను సంరక్షించే పద్ధతులు:

వేసవిలో నేలలోని తేమను సంరక్షించే పద్ధతులు చేపట్టాలి. దానికోసం పాదుల్లో రెండు వరుసలు మధ్య వరిగడ్డి, శనగపొట్టు నేలపై పరిస్తే నేలలో తేమ సంరక్షించబడుతుంది. దీని ద్వారా మొక్కలు పెరుగుదల బాగా పెరిగడమేగాక, కలుపు పెరుగుదలను నియంత్రిస్తుంది.

నీటి తడులు:

పంట, నేల స్వభావాన్ని బట్టి నీరివ్వాలి. టమాటకు ప్రతి 5-6 రోజులకు ఒక తడి ఇస్తూ పూత, పిందె దశలో శ్రద్ధ చూపాలి. క్రమపద్ధతిలో నీరు ఇవ్వకుంటే కాయ పగిలే అవకాశముంది. వంగకు 4-5 రోజులకొక తడివ్వాలి. నీటి ఎద్ధడి వస్తే కాయ రంగు, పరిమాణం తగ్గి, కాయల్లో చేదు వచ్చి నాణ్యత కోల్పోతుంది. బెండకు ప్రతి 4 రోజులకు ఒకసారి తడి అవసరం. పూత, పెందె దశల్లో కాక, కాయ పెరుగుదల దశలో నీటి ఎద్దడి వస్తే పూత ఆలస్యమై, కాత తగ్గుతుంది. పూత దశలో నీటి ఎద్దడి వల్ల పూత, పిందె రాలి దిగుబడి తగ్గుతుంది. బీర, సొర, కాకర, గుమ్మడి పొదలకు వారం రోజులకొక తడివ్వాలి. పూత, కాయ ఎదిగే దశలో నీటి ఎద్దడి వస్తే కాయలు రాలిపోవడమేకాక డొల్లపోయి, నాణ్యత తగ్గుతుంది.

  • మొక్కలకు నీడ నిచ్చేలా ఆముదం, మొక్కజొన్న లాంటి పంటలను ఉత్తర, దక్షిణ దిశగా వరుసల్లో అక్కడక్కడ నాటుకోవాలి. లేదా వీలైన రైతులు షేడ్ నెట్ లను ఏర్పాటు చేసుకుంటే ఎండ తీవ్రతను తగ్గించి మంచి దిగుబడులను సాధించవచ్చు.
  • వేసవిలో మొక్క పెరుగుదల తక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కల సాంధ్రత అధికంగా ఉండేలా నాటుకోవాలి. ఉదాహరణకు బెండలో వర్షాకాలం పంటకు ఎకరాకు 4 కిలోల విత్తనం వాడితే, వేసవి పంటలో 6 కిలోల విత్తనం వాడాలి. కొత్తగా నాటిన మామిడి, జామ, కొబ్బరి లాంటి పండ్లతోటల్లో మొదటి 3-4 సంవత్సరాలు అంతర పంటలుగా బెండ, సొర, బీర, గుమ్మడి, గోరు చిక్కుడు వంటి కూరగాయ పంటలను వేసవిలో సాగుచేసి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.

ఆకుకూరల పంటల్లో దిగుబడి పెంచడానికి యూరియా 20గ్రా. ను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. వేసవిలో నీటి ఎద్దడిని తట్టుకోడానికి 2 శాతం యూరియా ద్రావణాన్ని పిచికారి చేయవచ్చు. పొటాష్ ను సరైన మోతాదులో వాడితే నీటి ఎద్దడిని, చీడ పీడలను తట్టుకొనే గుణం మొక్కల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎండ వేడికి యూరియా ఆవిరి కాకుండా మొక్కకు ఎక్కువ రోజులు ఉండేలా 9 కిలోల యూరియాకు ఒక కిలో వేప పిండి కలిపి వేయాలి.

Leave Your Comments

Asparagus Cultivation: వేసవి కాలంకు అనువైన తోటకూర పంటలు మరియు రకాలు.!

Previous article

స్ట్రాబెర్రీస్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Next article

You may also like