ఉద్యానశోభ

Banana Cultivation Varieties: అరటి సాగులో రకాలు.!

1
Banana Varieties
Banana Varieties

Banana Cultivation Varieties: అరటి లో ప్రాధాన్యత సంతరించుకున్న రకాలు 70 వరకు ఉన్నాయి.వీటిలో 10-12 వరకు మన రాష్ట్రం లో ఎక్కువగా సాగు చేస్తున్నారు.

కర్పూర చక్కెర కేలి: దేశంలో 70% అరటి ఉత్పత్తి ఈ రాకనేదే దీని గెలలు పెద్దవిగా10-15 కేజీల బరువు ఉండును.గెలకు 135-170 కాయలుండి 10-12 హస్తలు ఉండును.12 నేలలలో పంట వచ్చును.ఈ రాకం నిల్వ ఉంచడానికి తగినవే కాక రవాణాకు అనుకూలం గా ఉంటుంది.పనామా తెగుళ్ళను, ఆకు మచ్చ తెగుళ్ళను బాగా తట్టుకుంటుంది.తేలిక నేలల్లో వర్షా భావ పరిస్థితులలో సాగు చేయవచ్చు.

తెల్ల చెక్కెర కేళి: ఈ రకం ఉభయ గోదావరి, గుంటూరు,జిల్లాలో సాగులో ఉంది. ఆకులో అంచు పైకి తిరిగి ఉండడం ఈ రకం ప్రత్యేకత గెల చిన్నగా ఉండి 6-8 కేజీలు ఉంటుంది. ఒక గేలలో 5-6 హస్తాలతో 60-80 కాయలు కలిగి ఉండును.12 నేలలో పంట కోతకు వచ్చును.పనామా తెగులు తట్టుకుంటుంది.అధిక ఉష్ణోగ్రతా సారవంతం కలిగిన నెలలకు అనుకూలం కాదు.

Also Read: Banana Harvesting: అరటి గెలలను కోసిన తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు.!

Banana Cultivation Varieties

Banana Cultivation Varieties

అమృత పాణి: ఇది పొడవు రకం 13-14 నేలల్లో పంట వచ్చును.గెల 15-20 కేజీల బరువు ఉండి 8-10 హస్తాలతో 80-100 కాయలు కలిగి ఉండును.ఎక్కువ కాలం నిల్వ చేయడానికి పనికి రాదు.పండిన వెంటనే గెలల నుండి పండ్లు రాలిపోవును.పనామా తెగులు ఈ రకం పై తీవ్రంగా వస్తుంది.ఆకు మచ్చ తెగులును తట్టుకోగలదు.

రోబోస్టా: ఇది మధ్య రకం గెల 15-20 కేజీల బరువు 9-10 హస్తాలతో దాదాపు 125-130 కాయలు కల్గి ఉండును.11-12 నేలల్లో పంటకు వచ్చును. కాయలు కొంచెం పెద్దవి గా ఉండి వంకర తిరిగి ఉంటాయి.పండిన తర్వాత కూడా తొక్క ఆకు పచ్చ రంగులో ఉంటుంది.కాయలో గింజలు ఎక్కువగా కనిపిస్తాయి.రాయలసీమ ప్రాంతాలలో ఎక్కువగా పండిస్తారు.కాని వెర్రి తెగులు, ఆకు తెగులు ఆశిస్తాయి.

వామన కేళి: గట్టిగ ఉన్నందున తుఫాను గాలి తాకిడికి తట్టుకోనును.వీటి గెల 12-15 కేజీల బరువు 8-10 హస్తలతో దాదాపు 120 కాయలు కలిగి ఉండును.11 నేలలో పంట వచ్చును.ఇది చాలా తీపి రకము అన్ని ప్రాంతాలకు అనువైనది. పండు పండిన తర్వాత తోలుపైన చుక్కలు వస్తాయి. పండిన తర్వాత పసుపు పచ్చ, వేసవి కాలం లో ఆకు పచ్చ గా ఉంటాయి.ఎక్కువ కాలం నిల్వకు పనికి రావు.పనామా తెగులును తట్టుకుంటుంది.

బొంత: 13 నేలలో పంటకు వచ్చును.గెల 12-15 కేజీల బరువుతో 5-6 హస్తలను దాదాపు 70-80 కాయలు కలిగి ఉండును.కాయలు పెద్దవిగా కొంచెం వంకరగా ఉండి అంచులు బాగా కనిపించును.అన్ని ప్రాంతాలకు అనువైన రకం.ఆకు మచ్చ తెగులును తట్టుకోనును.పనామా తెగులును తట్టుకోలేదు.

ఏనుగు బొంత: బొంత రకాన్ని మ్యుటేషన్ ద్వారా రూపొందించిన మేలైన రకం 13 నుంచి 14 నేలల లోపు కాపుకు వస్తుంది.గెల 15-20కేజీ ల బరువు 6-7 హస్తలతో 75-100 కాయలు కలిగి ఉండును.రాష్ట్ర మంతట పండించుటకు అనువైన రకం.ఆకు మచ్చ మరియు పనామా తెగులును తట్టుకోలేదు.

గ్రేoడ్ నైన్: ఇది ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే శక్తి అధికంగా ఉంటుంది.గెలల పరిమాణం సైతం ఎక్కువగా ఉంటుంది.12 నేలల పంట కాలం ఉన్న రకం 2.2-2.7 మీ.ఎత్తు సగటు గెల బరువు 25-30 కేజీ లు ఉండును.

Also Read: Banana Peel Tea: అరటి తొక్క టీ ప్రయోజనాలు

Leave Your Comments

Integrated Farming Practices: సమగ్ర వ్యవసాయ పద్ధతులు.!

Previous article

Red Banana Benefits: షుగర్ వ్యాధి గ్రస్తులకు మేలు చేసే రెడ్ బనానా.!

Next article

You may also like