Umran Regi Pandu: తియ్యని సీజనల్ పండు. పొద జాతి ముళ్ళ చెట్టు. రేగు చెట్టు ఆకులు కాయలు కూడా చిన్నవే. పొలాల్లో తియ్యని రేగుపళ్ళు కోసం వాటి ముళ్ళ గాయాలు రుచి చూడని వారుండరు. దేశవాళీ రేగు చెట్లకు నిండుగా ముళ్ళుంటాయి. రేగు ఆకుల్లో పండ్లలో కూడా ఔషధ ప్రయోజనాలున్నాయి. చిన్న మొక్కలే పెద్ద కాయలతో ఘనమైన కాపు కాస్తూ, అమోఘమైన రుచిని అందిస్తాయి. ముళ్ళు తక్కువగా ఉండే విదేశీ రేగు మొక్కలూ మనకు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. రేగు జాతి మొక్కలకు ఎక్కువగా నీటి వనరు అవసరం లేదు.. రేగు సాగు రైతులకు లాభాల సిరులను కురిపిస్తోంది..గత నాలుగేళ్లలో ఎకరాకు లక్ష రూపాయలు లాభం తగ్గకుండా తెచ్చిపెడుతుంది.. భిన్నమైన రకం సాగు కోసం ఉమ్రాన్ రేగు ను ఎంచుకున్నాడు. సాగులో మార్పులు చేసుకుని ఆగస్టు నుండి దిగుబడులను తీస్తున్నాడు. దాదాపు 20 టన్నులు తగ్గకుండా తోటి రైతులకు ఆదర్శప్రాయం అవుతున్నాడు.. నోరూరిస్తున్న రేగుపండ్లు గురించి మనం ఈరోజు ఏరువాకలో తెలుసుకుందాం..
ఉమ్రాన్ రేగుపండు నాటిన సంవత్సరం నుండి దిగుబడులను సాధించవచ్చు.. ఒక్కొక్క పండు బరువు 30 గ్రాములు నుండి 40 గ్రాములు వరకు ఉంటుది..ఎకరానికి 20 నుంచి 25 టన్నుల వరకు దిగుబడిని సాధిస్తున్నారు రైతు. గత 25 సంవత్సరాల నుండి ఇదే పంటను పండిస్తున్నారు.. బీడు బంజరు భూముల్లో సునాయసంగా పండే ఈ మొక్క రైతుకు మంచి ఆదాయ వనరుగా ఉంది.. ఈపండు బాగా రుచిగా ఉండటంతో మార్కెట్లో బాగా పుంజుకున్నాయి. ఎకరానికి 100 మొక్కలు నాటిన ఈరైతు నీటిని పొదుపుగా వాడుకునేందుకు డ్రీప్ ఏర్పాటు చేశారు. మార్చి, ఏప్రిల్ లో కాయలు కోసిన తరువాత కొమ్మ కత్తిరింపు చేస్తారు. వర్షాలకు కొమ్మ చిగురుంచి డిసెంబర్ నుంచి కాయలు రావడం మొదలు అవుతాయి. నీటి వసతి కూడా తక్కువ ఉండటంతో ఎక్కువ దిగుబడులను సాధిస్తున్నారు..
Also Read: Tomato Price: కోటీశ్వరులు అవుతున్న టమాట రైతులు.!
నీటిలో కరిగే ఎరువులను డ్రిప్ ద్వారా రెండు రోజులు ఒక్కసారి 3 కిలోల చొప్పున వేస్తున్నారు. ఏటా ప్రతిచెట్టుకు 5కి పశువుల ఎరువు, 10కిలోల కొత్త మట్టి వేస్తున్నారు. దీని ద్వారా మంచి దిగుబడులు సాధిస్తున్నామని రైతులు అంటున్నారు.. ప్రతి సంవత్సరం పశువుల ఎరువు తో బాటు నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువుల్ని వాడాలి. నత్రజని లో సగం, మొత్తం భాస్వరం, మొత్తం పొటాష్ కత్తిరించిన వెంటనే పాదుల్లో వేసి, మట్టిని తిరుగ కొట్టాలి. మిగిలిన సగం నత్రజని కత్తిరింపు అయిన 3 నెలల తర్వాత వేయాలి. అప్పుడే మనం మంచి దిగుబడులు సాధిస్తాము.
ఉమ్రాన్ రకం మార్కెట్లో కిలో రూ.8 నుంచి 18 రూ వరకు ధర పలుకుతుందని రైతులు అంటున్నారు. రెండు ఎకరాలకు 3 లక్షల ఆదాయం వస్తుందని ఖర్చు 1లక్ష కాగా నికరలాభం రెండు లక్షలు ఉంటుందని రైతులు అంటున్నారు. రేగు మంచి సత్ఫలితాలు ఇస్తుందని సూక్ష్మ నీటి అధికారులు అంటున్నారు. అంతేకాకుండా మొదటి మూడు సంవత్సరాలు రేగులో వేరుశనగ, పెసర, అలసంద మొదలైన పంటలను అంతర పంటలుగా పండించవచ్చు అని అంటున్నారు అధికారులు.
Also Read: Turmeric Price: పసుపు పండించిన రైతులకి శుభవార్త… రికార్డు స్థాయిలో పెరిగిన పసుపు ధర…