ఉద్యానశోభ

Mango Flowering: మామిడి తోటల్లో సకాలంలో పూత రావాలంటే ఇలా చెయ్యాలి.!

0
Mango Flower
Mango Flower

Mango Flowering: మామిడిలో రైతులు సాగుచేసే రకాలు, వాతావరణ పరిస్థితులు, సాగులో పాటించే యాజమాన్య పద్ధతులను బట్టి నవంబరు నుంచి జనవరిదాకా పూమొగ్గలు వస్తాయి. వర్షాకాలం మొదటి నుంచి వర్షాభావ పరిస్థితులు ఏర్ప డితే బెట్ట పరిస్థితుల వల్ల వర్షాధారంగా పెంచే తోటల్లో ముందుస్తుగానే పూత వస్తుంటుంది.

Mango Flowering

Mango Flowering

త్వరగా పూత వచ్చేందుకు: చలి వాతావరణం ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కోసారి ఆలస్యంగా కనిపి స్తాయి. అలాంటి పరిస్థితుల్లో పూమొగ్గలను ఉత్తేజపరిచి తొందరగా పూత తెప్పించటానికి డిసెంబరు 15-20 తేదీల మధ్య నీటి వసతి ఉన్న తోటల్లో మామిడి పాదుల్లో ఒక తేలికపాటి తడినివ్వాలి. లీటరు నీటికి 10గ్రా. పొటా షియం నైట్రేట్+5గ్రా. యూరియాతో కలిపి పిచికారి చేయాలి ఇలా చేస్తే త్వరగా పూమొగ్గలు దాదాపు ఒకేసారి చిగురిస్తాయి.

Also Read: Mango Ripening: మామిడికాయలు మాగబెట్టడానికి కాల్షియం కార్బైడ్ వాడకం అనర్ధo

యూరియాను నీటిలో కలిపి పిచికారి చేయడం వల్ల మొక్కలు తొందరగా పీల్చుకోవడమేగాక తక్కువ సమయంలో ఆకులు ఆహార పదార్థాలను తయారుచేయడానికి ఉపయోగపడుతుంది. పొటాషియం నైట్రేట్లోని పొటా షియం ఆహారం తయారైన ప్రదేశం నుంచి అంటే ఆకుల నుంచి ఆహార నిల్వ ఉంచే ప్రదేశమైన పూమొగ్గల దగ్గరకు చేరవేసేందుకు ఉపయోగపడు తుంది. అంతే గాకుండా పూత రావటానికి ఉత్తేజం కలుగుజేస్తుంది. పొటా షియం నైట్రేట్ ద్రావణం పిచికారి చేయకపోతే వేర్ల ద్వారా భూమి నుంచి పోషకాలు గ్రహించి వాటిని ఆకులను చేరవేసి అక్కడ ఆహార పదార్థాలు తయారవటానికి సమయం ఎక్కువగా పడుతుంది. ఆకులపై యూరియా, పొటాషియం నైట్రేట్ నేరుగా పిచికారిచేస్తే తొందరగా వాటిని ఆకులు ఆహార పదార్థాలుగా మార్చుతాయి. అలా తయారైన ఆహారాన్ని పొటాషియం నైట్రేట్లో ఉన్న పొటాషియం పూమొగ్గలకు తొందరగా చేరవేసి పూతగా రావటానికి ఉపయోగపడుతుంది. చలి వాతావరణంలో మొక్కలకు నీటి వాడుక తక్కువగా ఉంటుంది. కాబట్టి నీటిని వేర్ల ద్వారా గ్రహించడం తగ్గిస్తాయి. మొక్కలకు కావాల్సిన పోషకాలు నీటి ద్వారా పీల్చబడతాయి. కాబట్టి తక్కువ మోతాదుల్లో పోషకాలు మొక్కలు గ్రహించగలుగుతాయి. అందుకే చలి ఎక్కువగా ఉన్నప్పుడు మామిడిలో మొగ్గలు పగిలి పూతకు మారుటకు సాధారణంకంటే ఎక్కువ సమయం పడుతుంది. అలాంటి సంద ర్భంలో ఈ పిచికారి ఎంతో ఉపయోగపడుతుంది.వర్షాకాలంలో బెట్ట పరిస్థితులను గురికాకుండా అక్టోబరు వరకు నీరు ళ పెట్టిన తోటల్లో చివరిసారిగా కలుపు లేకుండా తోటలో వాలుకు అడ్డంగా 5 దున్నుకోవాలి. నవంబరు నీరు పెట్టడం ఆపివేయాలి. తద్వారా చెట్లను – బెట్టకు గురిచేసి పూత వచ్చేందుకు ప్రేరేపించాలి.

సస్యరక్షణ: తోటల్లో చెదలు ఉన్నట్లయితే వాటిని చెట్ల నుంచి దులిపి డైమిథోయేట్ 2మి.లీ./ లీటరు నీటిలో కలిపి చెట్టు మొదలు బాగా తడిసేలా పిచికారి చేయాలి.

Mangoes in Garden

Mangoes in Garden

తేనె మంచు పురుగు: ఈ పురుగులు రసాన్ని పీల్చడం వల్ల పూత పూర్తిగా మాడిపోయి పిందె పట్టదు. లేత ఆకులు, కొమ్మలనుంచి కూడా రసం పీల్చడంతో ఆకులు ముడు తపడి సరిగా పెరగవు. పురుగులు విసర్జించిన తేనెలాంటి బంక ఆకుల మీద కారి, సూర్యరశ్మి వెలుతురులో మెరుస్తూ ఉంటుంది.

నివారణ: లీటరు నీటికి ఫాస్ఫామిడాన్ 0.5 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 15 మి. లీ. లేదా కార్బరిల్ 3 గ్రా. లేదా డైమిథోయేట్ 2 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ చొప్పున కలిపి పూత మొదలయ్యే, పిందెలు తయారయ్యే సమ యాల్లో పూకులపైనే కాకుండా మొదళ్ళపైన, కొమ్మలపైన కూడా పిచి కారి చేయాలి. పూత పూర్తిగా విచ్చుకోక ముందే పిచికారి చేయాలి. పూత బాగా ఉన్నప్పుడు పిచికారి వేయడం వల్ల పుప్పొడి రాలి పరాగ సంపర్కానికి తోడ్పడే కీటకాలు నశిస్తాయి. మొగ్గదశలో కనిపిస్తే కార్బరిల్ 3 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ. లేదా కార్బెండాజిమ్ 1గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. థయోమిథాక్సామ్ (0.3గ్రా/లీ. నీటికి) పిచికారి చేస్తే పూత, కాపు సమయంలో తేనెమంచు పురుగును సమర్థంగా నివారిం చవచ్చు.

Also Read: Special Measures for Mango Cultivation: మామిడిలో ప్రతి సంవత్సరం కాత రావడానికి చేపట్టవలసిన ప్రత్యేక చర్యలు.!

Also Watch: 

Leave Your Comments

Ambedkar’s 66th birth Anniversary Celebrations: యన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఘనంగా అంబేద్కర్ గారి 66వ వర్ధంతి వేడుకలు.!

Previous article

Health Benefits of Albakara Fruit: ఆల్బకారా పండ్లతో కలిగే అద్భుతమైన ప్రయోజనాలు.!

Next article

You may also like