ఉద్యానశోభవ్యవసాయ పంటలు

Mango Fruit Covers: మామిడిలో ఫ్రూట్‌ కవర్ల వినియోగం`వాటి ఉపయోగాలు.!

1
Mango Fruit Covers Uses
Mango Fruit Covers Uses

Mango Fruit Covers: ఇరు తెలుగు రాష్ట్రాల్లో మామిడిలో కాయ అభివృద్ధి చెందే దశలో పండు ఈగ మరియు తెగుళ్లు ఆశించడం ద్వారా ఎక్కువగా నష్టం చేకూరుతుంది. దీని నివారణకు

పండు ఈగ : ఈ పండుఈగ పిల్ల పురుగులు గుజ్జును తిని పండ్లను కుళ్ళిపోయి రాలిపోయేలా చేస్తాయి. ఈ పురుగు ఆశించడం వల్ల కాయలు తినడానికి గాని, గుజ్జు రసం తీయడానికి గాని పనికిరాక ఎగుమతులకు కూడా ఉపయోగపడకుండా పోతాయి. దీని ద్వారా 30-35% శాతం నష్టం కలుగుతుంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో పూత ఆలస్యంగా రావడం ద్వారా ఈ పండుఈగ సమస్య అధికమై ఎక్కువ నష్టం జరుగుతుంది.

కాబట్టి ఈ సమస్యను అధిగమించడానికి కృషి విజ్ఞాన కేంద్రం, కొండెంపూడి శాస్త్రవేత్తలు మ్యాంగో ఫ్రూట్‌ కవర్‌ టెక్నాలజీని సూచించారు. మామిడితోటలో కాయలు నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు ఈ బ్రౌన్‌ కవర్స్‌ తొడగాలి. మరలా ఆ కవర్సును 65 ` 75 రోజుల తర్వాత తీసివేయాలి. అప్పటికీ ఆ కాయలు ఎటువంటి మచ్చలు లేకుండా మరియు నిగనిగలాడే పసుపు రంగులో ఉంటాయి. ఎందుకంటే ఈ బ్రౌన్‌ కవర్స్‌ లోపల నల్లటి కోటింగ్‌ ఉండటం ద్వారా ఇది సూర్యరశ్మిని బాగా శోషించు కొనడం ద్వారా కాయ రంగు పసుపు రంగులోకి మారుతుంది.

Also Read: Bengal gram Cultivation: శనగ కోత మరియు నిల్వలో పాటించాల్సిన మెళకువలు.!

Mango Fruit Covers

Mango Fruit Covers

అంతేకాకుండా మామిడికాయ పక్వత చెందటానికి హీట్‌ యూనిట్‌ 585 గంటలు అవసరం. కాబట్టి హీట్‌ యూనిట్‌ మాంగో బ్రౌన్‌ కవర్స్‌ ద్వారా లభిస్తాయి. కాబట్టి కాయ రంగు మరియు నాణ్యత పెరిగి ఈ మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. ఈ రకం పండ్లు ఇతర దేశాలకు కూడా ఎక్కువగా దిగుమతి కూడా చేసుకోవచ్చు. వీటి ధర మార్కెట్లో కిలోకి రూ. 80`100 వరకు పలుకుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ మ్యాంగో ఫ్రూట్‌ కవర్‌ (టెక్నాలజీ) సాంకేతికత పరిజ్ఞానం వాడుకోవాలి. మరియు ఒక్కొక్క ఫ్రూట్‌ మ్యాంగో కవర్‌ 1.50 నుండి 2.00 రూపాయల వరకు ఉంటుంది.

ఎన్‌. సత్తిబాబు, ఎన్‌. రాజకుమార్‌, వై. స్రవంతి, కె. శంకరరావు,
ఎ. సౌజన్య, ఎన్‌. కిశోర్‌ కుమార్‌, పి. బాబు, సి.హెచ్‌. మహాలక్ష్మి,
పి. రాజేష్‌ మరియు పి.వి. యస్‌. రామునాయుడు, ఫోన్‌ : 8639066690

Also Read: Antirrhinum Cultivation: అంటిరైనమ్‌ పూల సాగు విధానం.!

Leave Your Comments

Bengal gram Cultivation: శనగ కోత మరియు నిల్వలో పాటించాల్సిన మెళకువలు.!

Previous article

Home Remedies Uses: మన ఇంటి పెరటి వైద్యం – ఆరోగ్య చిట్కాలు.!

Next article

You may also like