Mango Ripening – ముందస్తు శీతలీకరణo: ఈ పెల్లెట్స్ తర్వాత శీతలీకరణ గదులలోనికి తదుపరి శుద్ధి కొరకు తీసుకొని రావాలి. తొలి శీతలీకరణ తదుపరి వెంటనే 12-13′ సెం.గ్రే. ఉష్ణోగ్రతతో, గాలిలో తేమ 90-95 శాతం వద్ద కాయలను శీతలీకరణ చెయ్యాలి. శీతలీకరణ పద్ధతిని నిరంతరంగా 6 నుండి 8 గంటల పాటు చేయటం ద్వారా కాయలోని క్షేత్ర ఉష్ణోగ్రతను (13-14 సెం. గ్రే) వరకు తగ్గించవచ్చు.
శీతల గిడ్డంగి: శీతలీకరణ గావించబడిన పండ్లను (మెటీరియల్ను) ఫోర్రిఫ్ట్ సహాయంతో శీతల గదులలోకి తీసుకొని వచ్చి జాగ్రత్తగా అమర్చాలి.పెల్లెట్స్ 12.5° సెం.గ్రే. ఉష్ణోగ్రత మరియు గాలితో తేమ శాతం 90-95% వద్ద తదుపరి రవాణా కొరకు ఉంచాలి.కాయలను బదిలీ చేయు సమయంలో కనీస ఉష్ణోగ్రత 12.5° సెం.గ్రే ఉండాలి.
Reefer Container: పెల్లెట్స్ ఫోలిఫ్ట్ సహాయంతో రీఫర్ కంటైనర్ లోకి లోడ్ చెయ్యాలి. రవాణా సమయం అంతా రీఫర్ కంటైనర్ లోపలి భాగంలో తప్పనిసరిగా 12.5° సెం.గ్రే. ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. ఈ పెల్లెట్స్ ఓడను చేరు సమయం వరకు ఇదే ఉష్ణోగ్రత మరియు తేమ శాతం ఉండునట్లు నిత్యం గమనిస్తూ ఉండాలి.బాక్స్లో నింపబడిన కాయలను విప్ర్డు రవాణా చేయాలి మరియు షిప్ యొక్క కార్గోలో నేరుగా రీఫర్ కంటైనర్ను పంపాలి. విద్యుత్ను ప్రసరింపజేయడం ద్వారా కావల్సిన ఉష్ణోగ్రత మరియు తేమను ఉండే చూసుకో వాలి.గమ్యస్థానం చేరిన తర్వాత పెల్లెట్స్ లోని కాయలను 20 నుండి 25″ సెం.గ్రే ఉష్ణోగ్రత వద్ద గదులలో ఉంచి పండిన తర్వాత అమ్మకానికి వినియోగించుకోవాలి.
Also Read: Different Types Tractors: వివిధ రకముల ట్రాక్టర్లు
కాల్షియం కార్బైడ్ వాడకం: వ్యాపారపరంగా మామిడి, అరటి మరియు సపోటా పండ్లను కృత్రిమంగా మాగబెట్టటం చాలాకాలంగా జరుగుతున్నది.రైతులు మరియు వ్యాపారులు ముఖ్యంగా మామిడి కాయలను పక్వానికి రాక ముందే కోసి కాల్షియం కార్బైడ్ మాగబెట్టటం వలన ముందస్తుగా అధిక ధరలకు అమ్ముకొనుటకు వీలు ఉంటుంది. దూర ప్రాంతాలకు ఎగుమతి చేసేటప్పుడు వ్యాపారులు పక్వానికి రాని మామిడి కాయలతో బాటు కాల్షియం కార్బైడ్ను ఉంచి రవాణా చేస్తే పచ్చికాయలు కూడా మంచి రంగు సంతరించుకొంటాయి.కాల్షియం కార్బైడ్ వాడకం వలన పరిపక్వతకు రాని కాయలను ముందుగా కోయటం వలన, కాయ నాణ్యత సరిగా లేకపోవడమే కాకుండా తీయదనం కూడా తగ్గుతుంది, అయినప్పటికీ కాయ బంగారు పసుపు రంగు సంతరించుకొని చూపరులను బాగా ఆకట్టుకుంటుంది.
కాయ నాణ్యత లేకపోవుటయే కాకుండా కాల్షియం కార్బైడ్ గాలిలోని తేమతో కలిసినపుడు వెలువడే వాయువులో (ఎసిటలీన్) ఫాస్పేస్ మరియు ఆర్సిన్ కలిగి ఉండటం వలన దీనిని ఉపయోగించి మాగబెట్టిన పండ్లను తిన్నవారికి అల్సర్, క్యాన్సర్, కాలేయ మరియు మూత్రపిండ వ్యాధులు వచ్చే అవకాశముంది. ఎసిటలీన్ వాయువు కేంద్రనాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపడం వలన తల భారము, దీర్ఘకాలిక మత్తు (కోమా), జ్ఞాపకశక్తి కోల్పోయే అవకాశము కూడా ఉన్నది.
ప్రస్తుతం మామిడి కాయలను కాల్షియం కార్బైడ్తో మాగ బెట్టవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయి. ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టేషన్ (పి.ఎఫ్.ఎ), 1954 యాక్ట్ (చట్టం) మరియు ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడస్ట్రేషన్ రూల్స్, 1955 రూల్ నెం. 44(ఏఏ) ప్రకారం కాల్షియం కార్బైడ్ పండ్లను మాగబెట్టటం నిషేధించటమైoది. దీనిని అతిక్రమించిన వారికి 3 సం॥ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడుతుంది.
Also Read: Jammu Grass Cultivation: జమ్ము గడ్డి