Lipstick Seeds Farming: వారసత్వంగా వస్తున్న భూమిని కాపాడుకుంటు వ్యవసాయంలో రాణించాలనదే ఆ యువకుడి ఆలోచన. పొలంను కౌలుకు ఇస్తే పురుగుమందులు కొట్టి పాడు చేస్తారని భయం.. ఇలాంటి ఆలోచనలతో ఉన్న ఆయువకుడు కొత్తపంట వైపు మొగ్గు చూపాడు… వాతావరణ మార్పులు, రసాయనాలు, కూలీల సమస్యలు అన్ని బేరీజు చేసుకొని కొత్త పంట అయినా సింధూరి పంటకు శ్రీకారం చూట్టాడు.
ఆంజనేయస్వామికి సింధూరంగా వాడుక
బాపట్లజిల్లా, బొమ్మనంపాడుకు చెందిన రామకృష్ణ హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగం చేస్తున్న వ్యవసాయం అంటే ఇష్టం. ఉద్యోగరీత్యా ఇక్కడే ఉండి వ్యవసాయం చేయలేని పరిస్థితి.. కూలీల అవసరం తక్కువ ఉంటూ దీర్ఘకాలిక పంట అయితే బాగుంటుందని రామకృష్ణ ఆలోచించారు. ఈక్రమంలోనే సింధూరి పంట గురించి వివరాలు సేకరించిన రామకృష్ణ సింధూరి మొక్కలు పొలంలో నాటారు. మొక్కకు మొక్కకు మధ్య పది అడుగుల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎకరాకు 435 మొక్కలు అవసరమయ్యాయి. సింధూరి ఏడాది తర్వాత కాపు వస్తుంది. పంట దిగుబడి క్రమంగా పెరుగుతూ 6 నుంచి 10 క్వింటాళ్ల మేర వస్తుంది. విత్తనాలపై ఉండే పట్టు నుంచి సింధూరం పొడి సేకరిస్తారు. దీన్ని పూజల్లో లేదా నుదిటిన బొట్టుగా ధరించేందుకు వినియోగిస్తారు. విదేశాలలో ఆహార పదార్థాల తయారీలో వాడుతారు. అంతే కాకుండా ఆంజనేయస్వామికి సింధూరంగా వాడుతారు.
Also Read: Telangana Farmers: తెలంగాణా రైతులకు శుభవార్త
గింజలతో లిప్‌స్టిక్ తయారీ
ప్రకృతి సహజంగా ఇచ్చే రంగులతో అనేక పూలు పూస్తుంటాయి. ఆకోవకే చెందుతుంది అనాటో మొక్క. సింధూరీ, జాఫ్రా అని పిలిచే ఈమొక్క కాయలు, గింజల నుంచి వచ్చే రంగును లిప్‌స్టిక్ తయారీలో ఉపయోగిస్తారు. సేద్యాన్ని ఒక పరిశ్రమగా మార్చి, ఎవరూ పండించని వాణిజ్య పంటలను పండిస్తే మంచి లాభం ఉంటుందని భావించారు. దాని కోసం పరిశోధన కూడా ప్రారంభించారు. ఇంటర్‌నెట్‌లో వెతకగా ఈమొక్క గురించి తెలిసింది. నేచురల్ కలర్‌గా ఉండే అనాటో మొక్క గింజలను లిప్‌స్టిక్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారని తెలిసింది. దానితోపాటు ఫుడ్ ప్రాసెసింగ్‌లోనూ ఈఅనాటో మొక్కలను వాడతారు.
విత్తనం నుంచి తీసే నూనెను ఈ విటమిన్ మాత్రలు తయారీలో ఉపయోగిస్తారు. సింధూరి విత్తనాల ధర కిలో 80 నుంచి 180 రూపాయల వరకు పలుకుతోంది. పెట్టుబడి పెద్దగా లేదు. కాబట్టి ఆదాయం పరంగా ఇబ్బంది ఉండదని రైతులు చెబుతున్నారు. విదేశాల్లో డిమాండ్ ఉండటంతో ఎక్కువగా అక్కడికి ఎగుమతి చేస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మాత్రమే పంట చేతికి వస్తుంది. ఒక్కసారి నాటిన జాఫ్రా మొక్క దాదాపు 25 సంవత్సరాల పాటు కాపు ఇస్తూనే ఉంటుంది. మనరాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో ఈమొక్కలు కనిపిస్తాయి. ఇది అడవి మొక్క. ఎలాంటి నేలలోనైనా పండటం సింధూరి పంటకు ఉన్న ప్రధాన అనుకూలత. ఇప్పుడు ఔత్సాహిక రైతులంతా ఈసాగు వైపు మళ్ళుతున్నారు.
Also Read: Tomato Crop Cultivation: ఏ కాలంలో వేస్తే టమాటా పంటలో మంచి లాభాలు వస్తాయి.!