Dryland Agriculture: రసాయనాల వాడకం వల్ల నీటి వనరుల ఉన్న భూముల్లో దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ప్రతి సంవత్సరం సాగుభూమిలో 4 శాతం చౌడు భూములు గా మారుతున్నాయి. యంత్రీకరణ వల్ల భూమి పై పొరలు గట్టిపడి నీటి నిలువ సామర్థ్యం తగ్గుతున్నందున పంటల దిగుబడి పడిపోతుంది.
వాతావరణంలో పెనుమార్పులు: భూమి మీద ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఆహారధాన్యాల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 1 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగితే 10శాతం ఉత్పత్తి తగ్గుతుందన్న అంచనాలున్నాయి. 2100 నాటికి చైనా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో 78 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుంది ‘వాటా డామ్’ వాతావరణ కేంద్రం నివేదిక సమర్పించింది. దీని ప్రభావంతో మనదేశంలో ఆహారోత్పత్తి సగానికి పడిపోవచ్చు. కొన్నిచోట్ల 50శాతం అధిక వర్షపాతం, మరికొన్నిచోట్ల సాధారణ వర్షపాతం కన్నా 50శాతం తక్కువ వానలు కురుస్తాయి. 2050 నాటికి దక్షిణ భారతదేశంలో 15 శాతం వరకు ఆహార ఉత్పత్తులు తగ్గుతాయనే అంచనా ఉంది.
మెట్ల భూములే శరణ్యం: 156 మి. హె. సాగుభూమిలో 98 మి.హె. అంటే 62శాతం మెట్ట భూములున్నాయి. దేశంలో వ్యవసాయ విధానాలమార్పు అనివార్యం. మెట్టభూముల అభివృద్ధి, సాగు విధానాల్లో గణనీ యమైన మార్పు, భూసారం పెంపు, మెట్టరైతులు లాభాలవైపు గమనం ఎంతో ప్రాముఖ్యత సంచరించుకున్నాయి. మెట్టప్రాంత వ్యవసాయానికి వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రస్తుత విధానాల మార్పుతో మెట్టప్రాంత వ్యవసాయంలో సమగ్రమైన అభివృద్ధి. చేయాల్సిన అవసరం ఎంతయినా ఉంది. మెట్ట సాగులో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే హరిత విప్లవం దిశగా అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమయింది.
కొత్త ప్రతిపాదనలు, విధానాలను, సూచనలను ఆచరణలో పెట్టడానికి రైతులు సిద్ధంగా లేరన్న విషయం దాచలేని నిజం. ఖర్చులు ఎక్కువైనా శ్రమ తక్కువగా ఉంటే పంటలసాగుకు, కావాల్సిన వనరులవైపు ఆసక్తి పెరుగుతోంది. దీనికి ఉమ్మడి కుటుంబాలు చిన్న కుటుంబాలుగా మారడమే కారణమై ఉండవచ్చు.
మెట్టసాగులో ప్రాధాన్య అంశాలు: మెట్టభూముల్లో పంటల సాగు లాభసాటతులను గాని పాటించాలి. రైతులను వినియోగదారుల నుంచి ఉత్పత్తిదారు లుగా మార్చాలి. పంటలకు కావాల్సిన ప్రధాన వనరులైన ఎరువులు, విత్త నాలు, క్రిమిసంహారకాలు – రైతులు వారి క్షేత్రాల్లోనే అభివృద్ధి చేసే పద్ధతు లను ఆచరిస్తే తప్పా ఖర్చులను తగ్గించలేం. ఎకరా సాగులో రసాయనాల ఖర్చు మొత్తం ఖర్చులో 20శాతంగా తేలింది. దీనిని తగ్గించగలిగే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా తగినంత ప్రాచుర్యం, ఆదరణ పొందడం లేదు. ఖర్చులేని సేంద్రియ ఎరువులను తయారు చేసుకొని 20శాతం రసాయనాల ఖర్చును తగ్గించవచ్చు. కొన్ని పంటలకైనా రైతులు తమ క్షేత్రాల నుంచి విత్తనాలను సేకరిస్తే మరికొంత ఖర్చును తగ్గించే వీలుంది.
నీటి వనరుల పెంపు: బాగా తక్కువ వర్షపాతం నమోదైనా జిల్లాలు. అనంతపురం (550 మి.మీ.) మహబూబ్ నగర్ (560 మి.మీ.) మంచి వర్షాల లతో నీటి సమస్యను అధిగమించే విధంగా సాంకేతికతను అభివృద్ధిచేసి ఆచరణలో పెట్టడం జరిగింది. వారసత్వ పంటల సాగు: మనదేశ వ్యవసాయ చరిత్ర కొన్నివేల సంవత్సరాల నాటిది. పూర్వీకుల అనుభవాలను రంగరించి అభివృద్ధి చేసిందే సుస్థిర వ్యవసాయ విజ్ఞానం. ఎన్నో వేల సంవత్సరాలైనా చెక్కు చెదరని పరి జ్ఞానం. పంటల సాగుకు పశువుల పోషణ, పెంపకాన్ని అనుసంధానించారు. పాడి పంటలు రెండు కళ్ళలాంటివని తెలియజెప్పారు. పశువులకు కావాల్సిన మేత పంటలు అందిస్తే, పశువులు పంటభూములకు పేడ, పంచకం ద్వారా భూసార స్థిరత్వానికి, పాలద్వారా మానవుల ఆరోగ్యం, పశువుల శ్రమతో దుక్కి తయారీ, అంతరకృషి, పంటల మార్పిడిలో ప్రాధాన్యత సంతరించుకు న్నాయి. అత్యంత ప్రాధాన్యమైన అంశం భూసార సుస్థిరత, పశువుల ఎరువు, పశువులు, గొర్రెలు, మేకలు, బాతులు పంటలులేని కాలంలో పొలంలో మంద కట్టుట, మిశ్రమ పంటలు (ధాన్యం + నూనె+పప్పు దినుసులు), అంతరపంటలు (ముఖ్యంగా పప్పు దినుసులు), నల్లరేగడి నేలల్లో గడ్డ విరవడం, చెరువుమట్టి, పాటిమన్నుతోలడం, వంటి విధానాలతో భూసారం తగ్గకుండా ప్రతి సంవత్సరం తప్పనిసరిగా పైపనులు చేసేవారు.
Also Read: Dryland Agriculture Problems: మెట్ట ప్రాంత పంటల ఉత్పత్తి లో సమస్యలు మరియు యాజమాన్యం.!
Also Watch: