Sweet Orange Pruning – సయాన్ మొగ్గల ఎంపిక: అంటు కట్టేందుకు వాడే మొగ్గ (బడ్) “సయాన్ మొగ్గ” అని అంటారు. అసలు ఎలాంటి చెట్టు నుంచి సయాన్ మొగ్గలను సేకరిస్తున్నారు అనే దానిపైనే ఆ బత్తాయి సామర్ధ్యం ఆధారపడి ఉంటుంది.
సయాన్ మొగ్గను సేకరించే తల్లి చెట్టుకు ఉండాల్సిన లక్షణాలు :
1. ఎటువంటి రోగాలు లేనిదై ఉండాలి.
2. బాగా పెరుగుదల సామర్ధ్యం ఉండి, వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉండాలి.
3. ప్రధానంగా దిగుబడి ఎక్కువగా ఉండి, కాయలు చక్కని మెరుపుతో తోలు పలుచగా, రసం తీయగా ఉండినాణ్యత కలిగి ఉండాలి.
4. ఆ చెట్టు కాపు కనీసం వరుసగా అయిదేళ్ల పాటు గమనించి దిగుబడి నిలుకడగా ఉంటేనే ఆ తల్లి చెట్ల నుంచి సయాన్ మొగ్గను తీసి అంటుకట్టాలి.
5. వైరస్ తెగుళ్లయిన ట్రిస్టీజా,
మొజాయిక్, బడ్ యూనియన్ క్రేజ్,
గ్రీనింగ్ మొదలైన తెగుళ్లు సోకని
చెట్ల నుంచి సయాన్ మొగ్గలను సేకరించాలి.
పైన కనబరచిన అంశాలన్నింటిని సాధించాలంటే చీని తోటల్ని పూర్తిగా సర్వే చేసి, రోగాలు లేని చెట్లను గుర్తించి, వీటి నుంచి నర్సరీ యజమానులు సయాను మొగ్గల్ని సేకరించాలి. విచక్షణారహితంగా కనిపించిన ప్రతి చెట్టు నుండి మొగ్గల్ని సేకరించరాదు. ఈ విధంగా జాగ్రత్తగా మొగ్గల్ని సేకరిస్తే కొంతవరకు శిలీంద్రాలు, వైరస్ రోగాల బెడద నుంచి చీని అంట్లను కాపాడవచ్చు.
Also Read: Pests Control Methods in Paddy: వరిలో బాక్టీరియా వేరు మరియు కాండం మొదలు కుళ్ళు తెగులు.!
అనారోగ్య అంట్లను తీసి వేయడం:
1) నారుమడుల్లో కొన్ని అంట్ల ఆకులు పసుపు పచ్చగా మారి సరిగా పెరగకుండా ఉంటాయి. ఇది పల్లాకు లేదా శంఖు లక్షణాలు కావచ్చు. ఈ లక్షణాలున్న అంట్లు ప్రధాన పొలంలో నాటితే తర్వాత కూడా బాగా పెరగక తొందరగా క్షీణిస్తాయి. కాబట్టి ఇలాంటి మొక్కలను నారుమడి దశలోనే తీసి నాశనం చేయాలి.
2) కొన్ని నర్సరీల్లోని అంట్లకు నులి పురుగులు (నెమటోడ్స్) సోకి ఉంటాయి. బుడిపెలు కలుగజే”సే నులిపురుగులు సోకితే వేర్లపైన చిన్న బుడిపెలుంటాయి. ఇలాంటి చీని అంట్లను నాటితే చెట్టుతో పాటు నులి పురుగులు కూడా వృద్ధిచెంది చెట్టు పెరుగుదలను తగ్గించి తొందరగా క్షీణింప చేస్తాయి. కాబట్టి ఇలాంటి నారుమడుల్లోని అంట్లను నాటు కోకూడదు.
3) రంగపూర్ నిమ్మ వేరు మూలం జంబేరి వేరు మూలం మీద కట్టిన చీని అంట్లను గుర్తించాలంటే, రంగ పూర్ అయితే అంటు కిందభాగన వచ్చే కొమ్మలు ఆకులను నలిపి చూస్తే మంచి సువాసన కలిగి ఉంటాయి. అందే జంబేరి అయితే వాసన ఘాటుగా ఉంటుంది. ఇదే ముఖ్యమైన తేడా.
రైతాంగం కొన్ని సంవత్సరాల క్రితం జంబేరిపై కట్టిన చీని అంట్లను నాటడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను అధిగమించాలంటే రంగపూర్ నిమ్మపై కట్టిన చీని అంట్లను మాత్రమే ఎంపిక చేసుకొని నాటుకోవాలి. ఈ రంగపూర్ నిమ్మపై కట్టిన చీని అంట్లు లభించే స్థానం – ఆంధ్ర ప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారి అధ్వర్యంలోని తిరుపతి చీని, నిమ్మ పరిశోధనా స్థానం వారు చీని అంట్లను, నిమ్మ మొక్కలను (బాలాజీ) రకం తయారుచేసి సరఫరా చేస్తు న్నారు. ఒక చీని అంటుకు 30 రూపాయల చొప్పున నిమ్మ మొక్క (బాలాజీ రకం) ఒకటి 12 రూపా యలు చొప్పున పైన తెలిపిన పరిశోధనా స్థానంలో లభిస్తాయి.
Also Read: Microorganisms and Soil Fertility: నేలల భూసార మరియు సూక్ష్మ జీవుల యాజమాన్యం.!