Rabi Groundnut Cultivation: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సాగుచేసే నూనె గింజల పంటల్లో వేరుసెనగ ముఖ్యమైనది. రబీలో వేరుసెనగ నీటి పారుదల కింద సాగవుతుంది. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో వేరుసెనగ 17.91 లక్షల హెక్టార్లలో సాగుతూ 10.45 లక్షల టన్నుల దిగుబడినిస్తోంది. సరాసరి ఎకరానికి 5-6 క్వింటాళ్ళ కాయ దిగుబడినిస్తుంది. దిగుబడులు తగ్గ డానికి ప్రధాన కారణం సరైన రకాన్ని ఎంపిక చేసుకోకపోవడం, మేలైన యాజమాన్య పద్ధతులను పాటించకపోవడం, సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టకపోవడం. కాబట్టి రబీకి అనువైన కదిరి-6, జె.సి.జి-88, కదిరి-7, కదిరి-8, కదిరి- కదిరి హరితాంధ్ర, అనంత, నారాయణి, అభయ (టీసీజీ యస్-25) వంటి రకాలను చ.మీ. కు 44 మొక్కలుండేలా విత్తుకోవాలి.
విత్తన శుద్ధి: ముందుగా కిలో విత్తనానికి ఒక గ్రాము కార్బెండిజమ్ లేదా 3గ్రా. మాంకోజెబ్ తో శుద్ధిచేసి,ఆరబెట్టి విత్తుకోవాలి. వేరు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సరాసరి కిలో విత్తనానికి 6.5 మి.లీ. క్లోరి పైరిఫాస్ లేదా 2 మి.లీ ఇమిడాక్లో ప్రిడ్ కలిపి శుద్ధిచేయాలి. కొత్తగా వేరుసెనగ వేసే నేలల్లో 60 కిలోల, విత్తనానికి ఒక కిలో రైజోబియం కల్బరుతో కలిపి విత్తుకోవాలి. మొదట క్రిమి సంహారక మందు లతో శుద్ధి చేసి తర్వాత రైజోబియం కూడా విత్తనాలకు పట్టించి విత్తుకోవాలి.
Also Read: Groundnut Seeds: నేల మరియు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వేరుశనగ గింజలు.!
ఎరువులు: ఎకరానికి 4.5 టన్నుల మాగిన పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. ఎకరానికి 20 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ క సూపర్ఫాస్పేట్, 30కిలోల మ్యూరే ట్ ఆఫ్ పొటాష్ దుక్కిలో వేయాలి. 10కిలోల యూరియా పైపాటుగా విత్తిన 30-35 రోజులకు వేయాలి. ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ను భాస్వరం ఎరువు లతో కలుపకుండా ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నాలి. 200 కిలోల జిప్సంను పైరు పూత, ఊడదిగే సమయంలో మొక్కల మొదళ్ళ దగ్గర 5 సెం.మీ లోతులో వేసి మట్టి ఎగదోయాలి. జిప్సంలోని కాల్షియం, కాయలు బాగా ఊరడా నికి, గంధకం గింజల్లో నూనె శాతం పెరగడానికి దోహద పడుతుంది. పైపాటుగా జింక్ లోపం ఉన్నప్పుడు 2 గ్రా. జింక్ సల్ఫేటు లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ఇనుము లోపించినప్పుడు ఒక కిలో అన్నబేధి, 200గ్రా. సిట్రిక్ ఆమ్లాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. బోరాన్ లోపించి నప్పుడు 1 లీటరు నీటికి 10గ్రా. బోరాక్స్ను కలిపి పిచికారీ చేయాలి.
విత్తిన 3 రోజుల్లో ఎకరానికి 0.8లీ అలాక్లోర్ లేదా పెండిమిథాలిన్ను 200 లీటర్ల నీటిలో కలిపి తడినేలపై పిచికారీ చేసి కలుపు నిర్మూలించాలి. విత్తిన 25 రోజుల్లోపు పైరుపై ఇమాజిత ఫిర్ 300 మి.లీ. లేదా క్విజల్ ఫాప్ ఇథైల్ 400 మి.లీ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.రబీ వేరుసెనగలో వేరుపురుగు, పచ్చదోమ, తామరపురుగు, పేనుబంక, ఆకుముడత, పొగాకు లద్దెపురుగు, బీహారీ గొంగళిపురుగు, శనగ. పచ్చపురుగు ఆశిస్తాయి.
Also Read: Rabi Crops: రబీ సీజన్ పంటల్లో చీడపురుగుల నివారణ చర్యలు
Must Watch: