భారతదేశంలో 90 శాతం కొబ్బరి పంట ప్రధానంగా నాలుగు దక్షిణ రాష్ట్రాలైన అయినా కేరళ, తమిళనాడు, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ లలో విస్తరించబడి ఉంది. ఈ రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ 1.11 లక్షల హెక్టార్ల విస్తీర్ణంతో 1567.60 మిలియన్ కాయల ఉత్పత్తి చేస్తుంది. ఇటీవల కాలంలో మన రాష్ట్రంలో అంచలంచలుగా విజృంభిస్తూ రైతులలో ఆందోళన కలుగజేస్తున్న పురుగు సర్పిలాకార తెల్లదోమ (ఆల్బురోడికస్ రూజియో పెర్కులేటస్) మార్టిన్ (హెమిప్టిరా :అలేరో – డిడే) దీనిని మొట్టమొదటిసారిగా 2016 సం.లో తమిళనాడు రాష్ట్రానికి చెందిన పొల్లాచ్చి తాలూకా మరియు కేరళ రాష్ట్రానికి చెందిన పాలకాడ్ లో కొబ్బరి చెట్లను ఆశించినట్లు గుర్తించడమైనది. ఆంధ్రప్రదేశలో తొలిసారిగా 2016 సం.లో కేరళ నుండి దిగుమతి చేసిన తెల్లదోమ సంక్రమించిన కొబ్బరి మొక్కల ద్వారా కడియం నర్సరీలలో వ్యాప్తి చెందినట్లు గుర్తింపబడినది. ఫిబ్రవరి 2016 వ సం.లో తెల్లదోమ ఆశించిన నర్సరీ మొక్కలను పశ్చిమ గోదావరి జిల్లాలోని కలవలపల్లి గ్రామానికి తీసుకురావడం ద్వారా అక్కడ నుండి ఆయిల్ పామ్ పంటపై వ్యాప్తి చెందినట్లు గుర్తించడం జరిగింది.
ఫిబ్రవరి 2019 సం.లో ఉద్యాన శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గణాంకాలు మరియు సర్వే ప్రకారం తూర్పు గోదావరి జిల్లాతో పోలిస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో కొబ్బరి మరియు ఆయిల్ పామ్ లో ఈ సర్పిలాకార తెల్లదోమ ఉధృత ఎక్కువగా ఉండడాన్ని గమనించడం జరిగింది. దీనికి కొబ్బరి మరియు ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం ఎక్కివగా ఉండడం ఒక ముఖ్య కారణంగా కనుగొనడమైనది. ఫిబ్రవరి 2019 సం.లో. ఉద్యాన శాఖ వారు చేసిన సర్వే ప్రకారం ఈ సర్పిలాకార తెల్లదోమ విస్తృత కొబ్బరి సాగు చేసే ఇతర తీర ప్రాంతాలలో అనగా శ్రీకాకుళం (మొత్తము 2314 హె.) విజయనగరం (మొత్తం 1385 హె.) మరియు విశాఖపట్నం (మొత్తం 754 హె.) సోకినట్లు గుర్తించడం జరిగింది. 2018 సం. నుండి 2020 సం. వరకు జరిపిన సర్వే ప్రకారం ఈ సర్పిలాకార తెల్లదోమ అనుకూల వాతావరణ పరిస్థితులలో అనగా సెప్టెంబర్ నుండి మార్చి నెలలో 2 మి. మీ. శరీర పరిమాణంతో రెక్కలపై బూడిదరంగు బడ్స్ ను కలిగి,ఒక వలయానికి 30 నుండి 40 గుడ్లను పెడుతుంది. కాని, ప్రతికూల వాతావరణ పరిస్థితులలో అనగా ఏప్రిల్ నుండి ఆగష్టు నెలలో 0.5 మి. మీ. శరీర పరిమాణం కలిగి రెక్కలపై బూడిదరంగు బ్యాండ్ లు లేకుండా స్పష్టంగా లేని వలయానికి 5 నుండి 10 గుడ్లను మాత్రమే పెడుతూ కోశస్థ దశ కాలాన్నిపెంచుకుని, సంతతిని తగ్గించుకుంటుంది. ఈ తెల్లదోమ ఉధృతి ప్రత్యేకంగా దేశవాళీ రకమైన ఈస్ట్ కోస్ట్ టాల్ కంటే పొట్టిరకాలైన గంగా బొండం, చౌగాట్ ఆరంజ్ డ్వార్ఫ్, మలయాన్ ఎల్లో డ్వార్ఫ్ మరియు హైబ్రిడ్ రకమైన గోదావరి గంగలలో ఈ తెల్లదోమ ప్రభావాన్ని తీవ్రస్థాయిలో గమనించడమైనది.
బొండార్స్ సెస్ట్ ఫ్లై ఉనికి:
సర్పిలాకార తెల్లదోమ ఉనికి గుర్తించిన 3 సం.ల తర్వాత 2020 సం. లో ఈ కోవకు చెందిన మరొక తెల్లదోమ రకమైన బొండార్స్ సెస్ట్ ఫ్లై(పార రోడికస్ బొండాలి పెరచీ) పశ్చిమ గోదావరి జిల్లాలోని చాగల్లు మరియు కలవపల్లి గ్రామలలోని కొబ్బరి చెట్ల ఆకులు అంతర భాగాల రసాన్ని పీల్చినట్లు గమనించబడినది. ఈ బొండార్స్ సెస్ట్ ఫ్లై తల్లిపురుగు 1.0 మి.మీ కంటే తక్కువ శరీర పరిమాణంలో రెక్కలపై ‘X’ ఆకారంలో వాలుగా ఉండే బూడిద రంగు బ్యాండ్ లు కలిగి ఉంటుంది. పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు ముద్దగా మైనపు ఉన్నితో కట్టిన పిచ్చుక గూడు లాంటి నిర్మాణంలో ఉంటాయి. వీటి గుడ్లు తోకలు కలిగి ఉంటాయి మరియు పిల్లపురుగుల ప్రక్క భాగాన దారాల వంటి అంచులు కలిగి ఉంటాయి. ఒక ఈనెకు పది కాలనీల చొప్పున, సర్పిలాకార తెల్లదోమ కాలనీలతో కలిసి ఉన్నట్లు హైబ్రిడ్ కొబ్బరి రకమైన గోదావరిగంగ మొక్కల క్రింద వరుస హక్కుల లో గుర్తించడమైనది.
సర్పిలాకార తెల్ల దోమ పై నియంత్రణ విధానాలు మరియు వాటి ప్రభావం:
క్షేత్రస్థాయిలో తెల్ల దోమ పై ఇసారియా ఫ్యుమసోరోసియా పరిశోధనల ప్రభావం…..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలో NBAIR, Bangalore వారి సహాయంతో నవంబర్-మార్చి 2018-2019 సం.లో జరిపిన క్షేత్రస్థాయి పరిశోధనలకు అనుగుణంగా వెలువడిన ఫలితాల ప్రకారం తెల్లదోమపై ఫ్యుమసోరోసియా గుడ్లు పొదుగుదల 60-78 శాతం, మొదటి లద్దె పురుగు 50-68 శాతం మరియు చివరి దశ లద్దె పురుగు 48-63 శాతం తగ్గినట్టుగా గమనించడం జరిగింది. 2019 సం. ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట వారు నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశోధన ఆధారంగా గంగబొండం తోటలో ఇసారియా ఫ్యుమసోరోసియా తెల్ల దోమ గుడ్లు 37-50 శాతం, మొదటి దశ పిల్ల పురుగులు 35-40 శాతానికి తగ్గించబడినదిగా గుర్తించారు. అధిక ఉష్ణోగ్రత సమయాలలో గుడ్లు మరియు పిల్లపురుగులపై ఇసారియా ఫ్యుమసోరోసియా ప్రభావం చాలా తక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.సర్పిలాకార తెల్లదోమ సంతతిని మరియు ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు హైజెట్ స్ప్రేయర్ సహాయంతో ఇసారియా ఫ్యుమసోరోసియా (PFU-5)10-15 రోజుల వ్యవధిలో పిచికారి చేసుకోవడం ద్వారా తెల్లదోమ సంతతి అదుపులో ఉన్నట్లు గమనించారు.
పరాన్నభుక్కు సూడో మల్లాడ ఆస్టర్ ఉనికి,క్షేత్రస్థాయిలో విస్తరణ:
ప్రకృతిలో గ్రీన్ లెస్ వింగ్ క్రైసోపెర్ల జస్టరోవి సహజమైన పరాన్నభుక్కుగా గుర్తించబడినది. కాని, ఆశించిన విధముగా దీనియొక్క ప్రభావం సర్పిలాకార తెల్లదోమపై కనబడలేదు. ఈ కోవకు చెందిన మరొక న్యూరోప్టిరాన్ పరాన్నభుక్కు (సూడోమల్లాడ ఆస్టర్) ను సహజసిద్ధంగా అంబాజీపేట ఉద్యాన పరిశోధన స్థానం లో గల తెల్ల దోమ ఆశించిన కొబ్బరి చెట్ల పై కనుగొనబడింది. ఈ పరాన్నభుక్కు ఉనికి కొబ్బరిలోనే కాక, జామ మరియు ఆయిల్ పామ్ చెట్లను ఆశించినటువంటి తెల్లదోమపై ఆసక్తికరమైన ఫలితాలను పొందినట్లు గమనించడం జరిగింది. ఈ పరానభుక్కు ఉనికి మరియు క్షేత్రస్థాయి విస్తరణ కనుగొనుటకు ఉద్యాన పరిశోధన స్థానం, అంబాజీపేటలో 6 సం.ల వయస్సు మరియు ఎక్కువ తెల్లదోమ సంతతి కలిగి ఉన్న GB X PO చెట్లను ఎంపిక చేసి, పరాన్నభుక్కు యొక్క సామర్ధ్యమును గుర్తించడమైనది. మరియొక పరిశోధనలో పశ్చిమ గోదావరి జిల్లా, చాగల్లు మండలానికి చెందిన చిక్కాల గ్రామంలో 4 సం.ల వయస్సు గల హైబ్రిడ్ గోదావరి గంగపై 2019 సం. లో క్షేత్రస్థాయి పరిశోధన నిర్వహించబడింది.
ఈ పరిశోధనలో తెలిపిన అంశాల ప్రకారం తక్కువ నుండి మధ్యస్థాయి తెల్లదోమ సంతతి (9-15 వలయాల/ఈనె) ఉన్నప్పుడు, చెట్టుకు 300-500 గుడ్లను 1 క్లిపుకు 10 గుడ్ల చొప్పున అక్కడక్కడ చెట్టు పైకి విడుదల చేయడం జరిగినది. విడుదల చేసిన 20 రోజుల తర్వాత 6 శాతం పిల్ల పురుగులు, 2 శాతం గుడ్లు మరియు 1 శాతం కోశస్థ దశలు సహజంగా పరాన్నజీవి పి. ఆస్టర్ గా గుర్తించడం జరిగినది. పి. ఆస్టర్ ఉనికి వలన తెల్ల దోమ యొక్క తీవ్రత (3 వలయాలు/ఈనె) గణనీయంగా తగ్గినట్లు గుర్తించబడింది.
80 శాతం తెల్లదోమ వ్యాప్తిని పి.ఆస్టర్ విడుదల ద్వారా తగ్గించడయినది. క్షేత్రస్థాయిలో పి.ఆస్టర్ యొక్క గ్రబ్ కాలము 32 రోజులు ఉంటుంది. ప్రయోగశాలలో కార్సరా గుడ్ల పై 14 రోజులలో దాని గ్రబ్ కాలాన్ని పూర్తి చేసుకుంటుంది. పి.ఆస్టర్ గుడ్లు పరాన్నభక్కు కావడంతో ఇది గుడ్లు మాత్రమే నివారించగలదు. కావున, ఇతర దశలను నియంత్రించుటకు పరాన్నభక్కు విడుదలకు ముందుగానే హైజెట్ స్ప్రేయర్ సహాయంతో ఇసారియా ఫ్యుమసోరోసియా ను పిచికారీ చేయడం ద్వారా గణనీయంగా తెల్లదోమ అధిక తీవ్రతను తగ్గించవచ్చు. పి.ఆస్టర్ సర్పిలాకార తెల్లదోమనే కాకుండా బోండారు నెట్టింగ్ ఫ్లై ను కూడా సమర్థవంతంగా నివారించగలదు. దీనివలన కొబ్బరి ఆశించే అన్ని రకాల తెల్ల దోమలను గణనీయంగా తగ్గిస్తుంది. సహజసిద్ధంగా పి.ఆస్టర్ యొక్క సంతతి తరచు తెల్ల దోమ పై గుర్తించడం వలన దీనిని రైతులకు అందజేయుటకు అంబాజీపేట శాస్త్రవేత్తలచే పరాన్నభక్కు సామూహిక ఉత్పత్తి పెంచుట “జీవనియంత్రణ యాజమాన్య పద్ధతుల ద్వారా కొబ్బరినాశించు సర్పిలాకార తెల్లదోమ నివారణ” అను పథకాన్ని నిర్వహించడానికి కొబ్బరి అభివృద్ధి సంస్థ, కొచ్చి వారి సహకారం తీసుకోవడం జరిగింది.
క్షేత్రస్థాయిలో పరాన్నజీవి యొక్క ఉనికి మరియు విస్తీర్ణం:
ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో జరిగిన సర్వే ప్రకారం (ఎన్ కార్సియా గ్వడెలోపె) ఆంధ్రప్రదేశ్ లో గుర్తించనందున,2017 డిసెంబర్ నుండి జనవరి 2018 వరకు మూడు సార్లు పరాన్నజీవులను కొబ్బరి పరిశోధన సంస్థ, అలియార్ నగర్ నుండి తెచ్చి పశ్చిమ గోదావరి జిల్లా, కలవలపల్లి మరియు చిక్కాల గ్రామాలలో విడుదల చేసిన తర్వాత, 10 చెట్లకు 20.01+1.69 శాతం డేటా నమోదు చేయడం జరిగింది. తర్వాత ఫిబ్రవరి నెలలో 72.06+3.15 పెరిగి క్రమేపీ ఏప్రిల్ నుండి ఆగస్టు 2018 నాటికి గణనీయంగా తగ్గి, మొత్తానికి అంతరించినట్లు గుర్తించడం జరిగింది. ఏప్రిల్ మరియు మే నెలలో అధిక ఉష్ణోగ్రత కారణంగా తెల్లదోమ తీవ్రంగా ఉండటంతో CPCRI, Kasaragod మరియు NBAIR, Bangalore నుండి మరొకసారి పరాన్నజీవిని తెప్పించి, విడుదల చేయడం ద్వారా 29.34+3.56, 42.38+5.48, 69.49+4.97 మరియు 68.88+3.61 శాతం సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మరియు డిసెంబర్ 2018 సం.లో గమనించినట్లుగా గుర్తించడమైనది.
అదేవిధంగా 2019 సం.లో వేసవికాలంలో, పరాన్నజీవి యొక్క సహజ ఉనికి లేకపోవడంతో మరియు 3000 పరాన్నజీవి కోశస్థ దశను TNAU, కోయంబత్తూరు మరియు NBAIR, Bangalore నుండి తెచ్చి, పశ్చిమ గోదావరి జిల్లా, చాగల్లు మండలం లోని చిక్కాల గ్రామంలో మరియు ఉద్యాన పరిశోధన స్థానం, అంబాజీపేటలో విడుదల చేయడం జరిగింది. చిక్కాల గ్రామంలో ఎటువంటి పిచికారీలు చేయకపోవడం ద్వారా పరాన్నజీవి ఉనికి ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అధిక స్థాయిలో పిచికారీ చేయడం వలన పరాన్న జీవిని కి తగినట్లు CPCRI, Kasaragod వారు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ప్రారంభ దశలో ఎటువంటి పిచికారీలు చేయకుండా ఉండడం వలన 10-15 శాతం ఉన్న తెల్ల దోమ పరాన్నజీవి సంతతి 5 నుండి 8 నెలలలో 70-80 శాతానికి గణనీయంగా పెరిగినట్లు గుర్తించారు. సర్పిలాకార తెల్లదోమ మరియు బోండారు నెట్టింగ్ ఫ్లై ఉన్న ప్రాంతాల నుండి పరాన్నజీవిని తీసుకురావడం వలన పరాన్నజీవితో సహా బొండారు సంతతి పెరిగే అవకాశాలు ఉండడం వలన పేరలైజ్ అయినంత వరకు పరాన్నజీవిని ప్రయోగశాలలో పెంచి వాటిని మొత్తం తోటలో విడుదల చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.
తెల్ల దోమ సమగ్ర యాజమాన్య పద్ధతులు: 1 విభిన్న మొక్కలలో సర్పిలాకార తెల్ల దోమ మరియు సహజ పరాన్నజీవులు పై నిరంతరం
పర్యవేక్షించాలి.
2. తెల్ల దోమ సోకిన కొబ్బరి మరియు అలంకార మొక్కలను ఒక చోట నుండి మరొక చోటికి
తరలించరాదు.
3. తెల్ల దోమ యొక్క అభివృద్ధి తక్కువగా ఉన్నప్పుడు మిత్ర పురుగులు అయినా సూడోమల్లాడ
ఆస్టర్ 100-150 గుడ్లు, మధ్యస్తంగా ఉన్నప్పుడు 300-500 గుడ్లు ఒక్కొక్క చెట్టుకి, విడుదల
చేయాలి. సూడోమల్లాడ ఆస్టర్ అని మిత్ర పురుగులు, ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట
నందు లభించును.
4. తెల్ల దోమలను మిత్ర పురుగులు ఎన్ కార్సియా గ్వడెలోపె అనే బదనిక లను సహజసిద్ధంగా
అభివృద్ధి చెందిన కొబ్బరి తోటల నుండి సేకరించి, బదనికలు తిని తెల్లదోమ ఆశించిన
ప్రాంతాలలో విడుదల చేయాలి.
5. సర్పిలాకార తెల్లదోమ కోసం పురుగుమందుల వాడకం నివారించి మిత్ర పురుగులను
పెంచుకోవాలి.
6. పురుగు స్థాయి ఎక్కువగా ఉండి మిత్ర పురుగులు లేనిచో, 1 శాతం వేపనూనె కు 10 గ్రా.
డిటర్జెంట్ పౌడర్ కలిపి ఆకు అడుగు భాగాలు పూర్తిగా తడిచేలా 15 రోజుల వ్యవధిలో పిచికారి
చేయాలి.
7. ఎంటమోపాధోజెనిక్ శీలింద్రాలు ఐసోరియ ఫ్యుమోసోరోసే 5 గ్రా./లీటరు నీటికి
(1×10⁸ స్పోర్స్/ మి.లీ.) కలిపి ఆకులపై పిచికారీ చేయాలి.
8. నీరు సమృద్ధిగా లభించినచో నీటిలో డిటర్జెంట్ పౌడర్ 10 గ్రా./లీటరు నీటికి కలిపి తెల్లదోమ
ఆశించిన మొక్కలపై 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.
9. కమ్యూనిటీ ఆధారిత విధానం, ఈ హానికర తెల్లదోమను సమర్థవంతంగా అరికడుతుంది.
పరాన్నభుక్కు సూడోమల్లాడ ఆస్టర్, మిత్రపురుగులు కావల్సిన వారు ఉద్యాన పరిశోధనా స్థానం వారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాము.