Cabbage Cultivation: క్యాబేజి శాస్త్రీయ నామము ‘‘బ్రాసికి ఒలరేషియా వరైటీ క్యాపిటేట’’ ఇది ‘క్రూసిపెరా’ లేదా ‘బ్రాసికేసి’ కుటుంబానికి చెందిన కూరగాయ పంట. శీతాకాలంలో సాగు చేసే పంటల్లో ఇది ఒకటి. క్యాబేజిని కూరగాయ పంట గానే కాకుండా, సలాడ్‌గా కూడా వాడతారు. ఇందులో ‘ఇండోల్`3`కార్చినోల్’ అనే పదార్ధం ఉండటం వలన పేగు క్యాన్సర్ బారిన పడకుండా కాపాడటం జరుగుతుంది. క్యాబేజిలో అన్ని ఆకుకూరలు లాగా తక్కువ మోతాదులో మాంసకృతులు, క్రొవ్వు పదార్థములు ఉంటాయి.
సుమారుగా 92 శాతం తేమను కలిగి 100 గ్రాములకు కేవలం 27 క్యాలరీలను ఇచ్చి క్యాబేజిని స్థూలకాయం కలవారు నిర్భయంగా తీసుకోవచ్చు. పీచుపదార్ధం కూడా క్యాబేజిలో ఎక్కువగా ఉంటుంది. ఈ పీచు పదార్థం శరీరంలోని కొలెస్ట్రాల్‌ని శరీరం నుండి విసర్జించుటలోను, మలబద్దకాన్ని నివారించుటలోను తోడ్పడుతుంది. క్యాబేజి అనేక పోషకాలు కలిగి గుండె జబ్బుల వ్యాధికి ఒక మంచి నివారణ. విటమన్ ‘సి’ ‘కె’ మరియు ‘ఎ’ క్యాబేజిలో ఉన్నాయి.
క్యాబేజిని ఎక్కువ రోజులు నిలువ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతులు అధిక మొత్తంలో సాగు చేయకపోవడానికి ప్రధాన కారణాలు విత్తనాల ధర అధికంగా ఉండటం, రైతుల వద్ద సాంకేతిక పరిజ్ఞానం తగినంత లేకపోవడం వల్ల కొంత వెనుకబడి ఉన్నారు. చీడ, పీడ సమస్యలు కూడా క్యాబేజిలో ఎక్కువగా ఉంటాయి. సరైన దిగుబడి సాధించకపోవడానికి పురుగు మందులు విచక్షణారహితంగా వాడటం రైతులు సరైన సమగ్ర యాజమాన్యం, సస్యరక్షణ పాటించకపోవడం వల్ల కొంత వెనుకబడి ఉన్నారు.
క్యాబేజి పంటను పండిరచేటప్పుడు ముఖ్యంగా రైతులు ఆయా ప్రాంతాల శీతల పరిస్థితులకు అనుకూలంగా ఉండే విత్తన రకాలను ఎంచుకోవాలి. ఈ పంటను పూర్తి విస్తీర్ణంలో ఒకేసారి కాకుండా విడతల వారిగా వేసుకోవడం మంచిది. ఈ పంటలో మంచి మెలుకువ పద్దతులను పాటించడం వల్ల అధిక దిగుబడులను సాధించి మంచి లాభాలను ఆర్జించవచ్చు.
Also Read: Black Thrips Management: నలుపు రంగు తామర పురుగుల సమగ్ర యాజమాన్యం
వాతావరణం:
చల్లని తేమగల వాతావరణం అత్యంత అవసరం, పగటి గరిష్ణ ఉష్ణోగ్రత 300 సెల్సియస్ మించకుండా ఉంటే ఎక్కువ దిగుబడినిస్తుంది.
నేలలు:
ఈ పంటకు నల్లరేగడి నేలలు, ఎర్రనేలలు అనువైనవి. చౌడు, క్షార నేలలు తప్ప మిగతా అన్ని నేలలో సాగు చేసుకోవచ్చు. ఇసుకలో కూడిన బంక నేలలు రబీలో ముందుగా వేసే పంటలకు అనుకూలం. సారవంతమైన గుల్ల, ఒండ్రు నేలలు అధిక దిగుబడినిస్తాయి. ఉదజని సూచిక 5.5`6.5 గల నేలలు మిక్కిలి అనుకూలం.
రకాలు:
గోల్డెన్ పకర్, ఎర్లీడ్రమ్ హెడ్, ఫ్రైడ్ ఆఫ్ ఇండియా, లేట్ డ్రమ్ హెడ్, పూసా డ్రమ్ హెడ్ పూసా ముక్త.
హైబ్రీడ్స్:
బి.యస్.యస్`150, బి.యస్.యస్`126, గ్రీన్ ఎక్స్‌ప్రెస్, గ్రీన్ ఛాలెంజర్, గ్రీన్‌బోయ్, మైటీ, ఇందు, రాధ, మీనాక్షి.
విత్తనం:
ఒక ఎకరా విత్తుకోవడానికి సూటి రకాలకు 3 గ్రా. థైరమ్ లేదా 3గ్ర ా. కార్బండిజంలో విత్తన శుద్ది చేసుకోవలెను.
నారుమడి:
నారు పెంచుటకు నారు మడులను నేలకు దాదాపుగా 10`15 సెం.మీ. ఎత్తుగా మడులను చేసుకొని విత్తనాలను సన్నని ఇసుకతో గాని లేక కంపోష్టుతో గాని కలిపి నారుమడిలోని వరుసల్లో పలుచగా విత్తాలి. విత్తిన మడిని ఎండు ఆకులతో కప్పాలి. విత్తనాలు మొలిచే వరకు (సుమారు వారం రోజుల వరకు) ప్రతిరోజు నీటిని పోయాలి. మొక్కలు మొలకెత్తిన తరువాత ఎండిన ఆకులను తీసివేయాలి. నారుమళ్ళు తెగులు సోకకుండా లీటరు నీటికి 3 గ్రా. కాఫర్ ఆక్సీక్లోరైడ్‌తో నేలను తడపాలి.
నారును ప్రోట్రేలలో శుద్ది చేయబడిన కోకోపీట్, పెర్తైట్, వెర్మిక్యూలైట్ మిశ్రమంలో కూడ పెంచవచ్చు. ఈ విధంగా నారును షెడ్ నెట్ల క్రింద, పాలీహౌస్‌లలో పెంచుకున్నట్లయితే ఆరోగ్యవంతమైన నారు పొందవచ్చు. ఈ విధంగా నారు పెంచుకున్నప్పుడు తక్కువ విత్తనం అవసరం అవుతుంది.
నాటుకునే కాలం:
స్వల్పకాలికి రకాలు ` ఆగష్టు రెండవ పక్షం ` సెప్టెంబరు వరకు దీర్ఘకాలిక రకాలు ` అక్టోబర్ మొదటి పక్షం ` నవంబరు వరకు
నాటడం:
నేలను అదును వచ్చే వరకు బాగా దున్నాలి. సుమారు 10`15 రోజుల ముందు నేలను సిద్దం చేసుకోవాలి. దీర్ఘకాలిక రకాలకు 60`45 సెం.మీ మరియు స్వల్ప కాలిక రకాలకు 45`45 సెం.మీ.దూరాన్ని ఉంచాలి. 50`30 రోజుల వయస్సు గల నారును జాగ్రత్తగా నాటుకోవాలి. నాటే ముందు తడిని ఇవ్వాలి.
నీటి యాజమాన్యం:
తేలిక నేలల్లో వారం రోజులకు ఒకసారి, బరువైన నేలల్లో 10 రోజులకు ఒకసారి నీటి తడిని ఇవ్వాలి.
ఎరువులు:
తొలి దఫాగా ఎకరాకు 8`10 టన్నుల పశువుల ఎరువుతో బాటు 32`40 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్ ఎరువులను చివరి దుక్కిలో వేసి బాగా కలియదున్నాలి. 24`32 కిలోల నత్రజనిని 3దఫాలుగా నాటిన 25`30 రోజులకు మొదటిసారి, 50`60రోజులకు రెండవసారి, దీర్ఘకాలిక రకాలయితే 75`80 రోజులకు మూడవసారి వేయాలి. నాటిన 20`25 రోజలప్పుడు అంతరకృషి చేయాలి.
సస్యరక్షణ:
. క్యాబేజి రెక్కల పురుగును అరికట్టడానికి స్పైనోశాడ్ 0.3 మి.లీ.కలిపి పిచికారీ చేయాలి.
. పేనుబాకను అరికట్టడానికి డైమిథోయేట్ 2మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
. నారుకుళ్ళు తెగులు అరికట్టడానికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. లేదా ప్రోట్రేలలో నారును పెంచాలి.
కోతకోయడం: తగిన పరిమాణం వరకు ఎదిగిన తర్వాత కోయాలి. గట్టిగా, లేతగా ఉన్న గడ్డలను కోసుకోవాలి.
దిగుబడి: ఎకరాకు 14`16 టన్నుల దిగుబడి వస్తుంది.
టి. తేజశ్వని (పి.హెచ్.డి), టి.ధాంసన్ (శాస్త్రవేత),
ఎం.రవీంద్రబాబు (సీనియర్ శాస్త్రవేత్త), ఎస్.వి.గౌతమ్ దీక్షితులు (శాస్త్రవేత్త)
డా॥వై.యస్.ఆర్.ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం
ఫోన్ : 9849733741, 9494963291
Also Read: Infectious Bursal Disease in Chickens: కోళ్ళలో గంబోరో వ్యాధి ని ఎలా నివారించాలి.!