Farmer Success Story: అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే పువ్వు ఏదైనా ఉందంటే అది గులాబీ. గులాబీ ప్రేమకు చిహ్నం కూడా. అయితే గులాబీ కేవలం అలంకరణకే పరిమితం కాక ఆరోగ్య పరిరక్షణలోను, సౌందర్య పోషణలోను, సుగంధ ద్రవ్యంగాను పనిచేస్తాయి.
ఇకపోతే మిగతా గులాబీ రకంలో అనేక రకాలు, రంగులు ఉంటాయి. నాటు గులాబీలో మూడు రకాల రంగులు ప్రధానంగా ఉంటాయి. 1. తెలుపు రంగు, 2. లేత గులాబీ, 3. ఎరుపు రంగులలో ఉంటాయి. దేశీ గులాబీ రకం సంవత్సరం పొడవునా పుష్పిస్తుంది. వేసవిలో మాత్రం కొంతమేర తగ్గే అవకాశం ఉంటుంది. ఇక హైబ్రిడ్ రకం గులాబీ ఎక్కువగా చలి కాలంలో ఉంటుంది. అయితే ఈ రకం గులాబిని వేసవి, చలి, వర్షా కాలాల్లో జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అయితే వేసవిలో గులాబీ మొక్కలను ఎలా కాపాడుకోవాలో చెప్తున్నారు శ్రీ లక్ష్మీ సౌజన్య రావూరి గారు. మరి ఆమె మాటల్లోనే విందాం..
చిట్కాలు:
సాధారణంగా మొక్కలకు ఎండా, మరియు సూర్యరశ్మి అవసరం. గులాబీ మొక్కకు కూడా ఎండ తగిలేలా చూసుకోవాలి. చెట్టు, పువ్వులకు సూర్యరశ్మి ఎక్కువ అవసరం ఉండటం కారణంగా ఎండ ఉండే ప్రదేశాల్లో కుండీలను మార్చుకుంటే మంచిది. అయితే వేసవి కాలంలో జాగ్రత్త తీసుకుంటూ కొంతమేర ఎండని తగ్గించుకోవాలి. మధ్యాహ్న ప్రాంతంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీడ ఉన్న ప్రాంతంలో మార్చుకోవాలి.
సస్య రక్షణ:
గులాబీ మొక్కను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. చీడపురుగులు లేదా ఫంగస్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొక్క ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఆకులు మాడిపోతూ ఉంటాయి. పండిన, ఎండిన ఆకులు కొమ్మలు ఎప్పటికప్పుడు తుంచేయాలి. మొక్క ఎంత గుబురుగా ఉంటే అంత ఎక్కువగా పూలు పూస్తాయి అని గుర్తు పెట్టుకోండి.మొగ్గలు వచ్చే దశలో అదనంగా ఎరువులు అందించటం అవసరం. అధికంగా పెరిగే కాండపు చివర్లను కత్తిరించుకోవాలి.
Also Read: రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్రం ప్రణాళికలు
గులాబీ మొక్కలు పైన నీళ్ళు స్ప్రే చేయడం వలన అధిక వేడి, దుమ్ము ధూళి నుంచి రక్షణగా ఉంటుంది. ఇలా చేయడం ద్వారా నీరు, ఎరువుల వృధా అవ్వకుండా మొక్కకు చేరి బలాన్నిస్తుంది. మొక్కకు ప్రతి 15 రోజులకు ఒకసారి ఎరువులను అందిస్తూ ఉండాలి. వేసవిలో ఎండా తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉదయం, సాయంకాలం నీటిని అందిస్తూ ఉండాలి. మొక్కకు పైనుండి నీరు పోయకుండా మొక్క మొదట్లో పోయాలి.
గులాబీ మొక్కలలో ఎక్కువగా కనిపించేది బూజు, ఆకులకు రంధ్రాలు ఏర్పడటం. ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు వేపాకును నీళ్లలో మరిగించి పిచికారీ చేయడం లేదా బూడిద చల్లుకోవడం చేస్తూ ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి వేసవిలో గులాబీ మొక్కలను కాపాడుకోవచ్చు.
Also Read: బిగ్ బాస్కెట్, రిలయన్స్ లతో ఒప్పందం కుదుర్చుకున్న మహిళా రైతు కథ