ఉద్యానశోభమన వ్యవసాయం

Rose Cultivation in Green Houses: హరిత గృహాలలో గులాబి సాగు.!

0
Rose Cultivation
Rose Cultivation

Rose Cultivation in Green Houses: పువ్వులలో గులాబీని రాణి పువ్వుగా పిలుస్తారు. ఎగుమతి ప్రధానంగా గులాబీలను సాగు చేస్తున్నపుడు, ప్రమాణాలకు అనుగుణంగా మొగ్గ పరిమాణం కొమ్మ పొడవుతో పాటు రోగాలు లేని ఆకు పచ్చని రంగు గల ఆకులు ఉన్న పువ్వులను కట్ ఫ్లవర్స్ లా అమ్ముతారు.

Rose Cultivation in Green Houses

Rose Cultivation in Green Houses

సాధారణ వాతావరణ పరిస్థితులలో సాగు చేసినపుడు ఎగుమతికి అనువైన పువ్వులను ఉత్పత్తి చేయడం కష్టతరం అందువలన హరిత గృహలలో సాగు చేయుట లాభదాయకం.

హరిత గృహాలలో సాగుకి అనువైన గులాబీ రకాలు:

గ్రాండ్ గాలా, గోల్డెన్ గేట్స్, ఫస్ట్ రెడ్, ముర్సిడిస్, కాంఫెస్, కిస్.

సాగుకు అనుకూలమైన నేల పరిస్థితులు: ఉదజని సూచిక 6-6.5; లవణ సూచిక 1; మురుగు నీరు పోవు వసతి కలిగి ఉండాలి.

Also Read: వేసవిలో గులాబీ మొక్కల సంరక్షణ

ఉష్ణోగ్రతలు: మబ్బుగా ఉన్నపుడు 20 డిగ్రీలు; ఎండగా ఉన్నపుడు 24-28 డిగ్రీలు ఉండాలి. అనుకూల ఉష్ణోగ్రత 15-27 డిగ్రీ సెంటిగ్రేడ్లు.

నాటే సమయం : అక్టోబర్ నుండి డిసెంబర్

మొక్కల  సాంద్రత : చదరపు మీటర్ కు 7 మొక్కలు. రకాన్ని బట్టి వరుసలలో 20-30 సె.మీ ఎడం ఉంచుకోవాలి.

Rose Cultivation

Rose Cultivation

ప్రవర్థనం మరియు నాటడం: 

2-3 మొగ్గలు కలిగిన కోతలు IBA లేదా IAA @ 500 ppmలో ముంచాలీ . 45 సెం.మీ x 45 సెం.మీ x 45 సెం.మీ గుంటలను 2.0 x 1.0 మీటర్ల దూరంలో తవ్వి, నాటడానికి ముందు ప్రతి గుంటకు 10 కిలోల FYM కలుపుతారు.

నీటిపారుదల: 

మొక్కలు ఏర్పడే వరకు 2 రోజులకు ఒకసారి మరియు ఆ తర్వాత వారానికి ఒకసారి నీరు అందించాలీ. ఉప్పు నీటి  వినియోగం  నివారించాలి. డ్రిప్ పద్ధతి అత్యంత అనుకూలం.

ఎరువుల యాజమాన్యం: 200 పి.పి. ఎం  నత్రజని మరియు 150 పి.పి. ఎం పోటాషియం ద్రవరూపంలో పిచికారీ చేసుకోవాలి. ఫెర్టిగేషన్ ద్వారా కూడా అందించవచ్చు.

Rose Cultivation in India

Rose Cultivation in India

కోత: మంచి రంగు వచ్చి ఆకర్షక పత్రాలు విచ్చుకున్నపుడు కోసుకోవాలి. కోత అనంతరం 200-500 పి.పి.ఎం అల్యూమినియం సల్ఫేట్ లేదా సిట్రిక్ ఆసిడ్ లో ముంచి తీసి 10 డిగ్రీల  వద్ద శీతల గదిలో ఉంచాలి.

దిగుబడి: సంవత్సరంలో చదరపు మీటరుకు 250-350 పువ్వులు వచ్చును.

Also Read: ఈ ఒక్క ఆకు ఎన్నో సమస్యలకు దివ్య ఔషధం

Leave Your Comments

Thamara Purugu Effect: తామరపురుగు కట్టడికి పరిశోధనలు

Previous article

Mulberry Cultivation: వర్షాధారిత  పరిస్థితులలో మల్బరీ సాగు

Next article

You may also like