ఉద్యానశోభ

Rose Cultivation: గులాబీ సాగు ‘భలే బాగు’

1
Rose Flowers
Rose Flowers
Rose Cultivation: అందమైన పుష్పాల్లో గులాబీ ఒకటి. పూలల్లో కెల్లా రాణి గులాబీ పువ్వు. మహిళల అలంకరణ సాధనలో అత్యంత ప్రాముఖ్యం ఉన్న పూవు గులాబీ. వేడుకలలో గులాబీ వినియోగం ప్రపంచ వ్యాప్తంగా ప్రాశస్త్యం పొందింది. వాణిజ్యపరంగా గులాబీల సాగులో ఉన్న లాభాలను ఇప్పుడిప్పుడే రైతులు గమనిస్తున్నారు. గులాబీ పూల నుండి అత్తరు, సుగంధ తైలాలు ఉత్పత్తికావడం, పూరెక్కలతో గులఖండ్‌ అనే పదార్ధాన్ని వెలికితీయడం వలన దీని విలువకు తావి అబ్బినట్లైనది. సూర్యరశ్మి బాగా ప్రసరించే వాతావరణంలో గులాబీ పంట బాగా పండుతుంది. ఫ్లోరీకల్చర్‌ యూనిట్లలో 90 శాతం వరకు గులాబీలనే సాగు చేస్తున్నారు.
Rose Flowers

Rose Flowers

1. హైబ్రీడ్‌ టీస్‌: మొక్కలు పెద్ద గులాబీలను కొమ్మకు ఒకటిగా పూస్తాయి.
ఉదా: గ్లాడియోటర్‌, కార్డినాల్‌ ఎటర్నా, ఒంకిరోజ్‌
2. క్లోరిబండాస్‌: గులాబీలు మద్యంతర సైజులో గుత్తులుగా పూసి ఎక్కువ రోజులుంటాయి.
ఉదా: ల్యూటిన్‌, రెడ్‌ట్రెంప్‌, వీపింగ్‌ చైనాడాల్‌
3. మీనియేచర్‌: మొక్కలు చిన్నవిగా, చిన్న ఆకులను కలిగి అతి చిన్న పూలను ఇస్తాయి. ఇవి కుండీలలో పెంచడానికి అనువైన మొక్కలు.
ఉదా: పింక్‌స్ప్రే, నర్తకి, ప్రీతి
4. పాలియాంథాస్‌: చిన్న చిన్న పూలు వేసవిలో గుత్తులుగా పూస్తాయి.
5.క్లైంబింగ్‌ రోజెస్‌ : ఈ మొక్కలు తీగలుగా పెరిగి పూలు చిన్నవిగా గుత్తులుగా పూస్తాయి.
ఉదా: క్లైంబింగ్‌ సోబార్‌, క్లైంబింగ్‌ సమ్మర్‌ స్నో
6. డిమాస్క్‌: ఈ గ్రూపులోని గులూబీ రకాలు మంచి సువాసన కలిగి నూనె తీయడానికి అనుకూలం.
7. గ్రాండిప్లోరా గులాబీలు: ఈ గులాబీలు హైబ్రీడ్‌టీ, గులాబీల మాదిరిగా పెద్ద పెద్ద పూలు వస్తాయి.
హరితగృహాలలో సాగు చేసేందుకు డీచ్‌రోజ్‌ గులాబీరకం అనువైనది. అర్కాస్విదేశ్‌, అర్కా ఇవారి, అర్కాసుకన్య, అర్కాఫ్రైడ్‌, పూసమెహక్‌, పూసమెహిత, పూసఅపియ్వంటి మొదలైన రకాలు అందుబాటులో ఉన్నాయి.
Rose Cultivation

Rose Cultivation

నేలలు: ఎర్రనేలలు, గరప నేలలు బాగా నీరు ఇంకే నేలలు గులాబీసాగుకు మిక్కిలి అనుకూలం. నేల యొక్క పి.హెచ్‌ 6.5 `7.5 వరకు ఉంటే మంచిది.
వాతావరణం: సూర్యరశ్మి బాగా కలిగిన వాతావరణం అనువైనది.ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు, పూలదిగుబడి నాణ్యతపై మిక్కిలి ప్రభావం చూపుతుంది. పగటి ఉష్ణోగ్రత 300 సెం. రాత్రి ఉష్ణోగ్రత 150 సెం. అనుకూలం.
ప్రవర్థనం: శాఖీయంగా కొమ్మకత్తిరింపులు, బడ్డింగ్‌ ద్వారా ఎక్కువగా ప్రవర్థనం చేస్తారు. రోజా ఇండికా రోజా మల్టిఫ్లోరాలను రూట్‌స్టాక్‌గా వాడతారు.
నాటే దూరం: వాణిజ్యపరంగా పెంచే హైబ్రీడ్‌ రకాలను 60I60 సెం.మీ దూరంలో నాటిన ఎకరాకు సుమారుగా 8500 మొక్కలు నాటవచ్చు.
నాటే సమయం: గులాబీ మొక్కలను జూన్‌` జూలై వరకు నాటుకోవచ్చు. సెప్టెంబరు`అక్టోబరులో నాటడం మంచిది.
నీటియాజమాన్యం: మొక్కలు నాటిన తరువాత కొత్త చిగుర్లు వచ్చే వరకు తేలికపాటి నీటితడులను ఇచ్చి అటు తరువాత 8`10రోజుల వ్యవధిలో నీటి తడులు ఇవ్వాలి. డ్రిప్‌ పద్ధతిలో కూడా నీరు పెట్టవచ్చు.
ఎరువులు: 
కొమ్మలు కత్తిరించిన తరువాత ప్రతిమొక్కకు 7`8 కిలోల పశువుల ఎరువు, 3`5 కిలోల వేపపిండి వేయాలి. తరువాత ఊ15 నుండి 20 రోజులకు యూరియా, భాస్వరం, పొటాష్‌ ఎరువులను 1ః8ః3 నిష్పత్తిలో ప్రతి మొక్కకు 100 గ్రా. చొప్పున వేయాలి. ఇలా 2`3 సార్లు ఇవ్వాలి. సూక్ష్మధాతువులైన మాంగనీస్‌ సల్ఫేట్‌ 15 గ్రా., మెగ్నీషియం సల్ఫేట్‌ 20 గ్రా., చిలేటెడ్‌ ఐరన్‌ 10 గ్రా., బోరాక్స్‌ 5 గ్రా. లీటరు నీటికి కలిపి గులాబీ మొక్కలపై పూత పూయక ముందు పిచికరీ చేసినట్లయితే పువ్వు సైజు బాగా వస్తుంది.
కొమ్మ కత్తిరింపులు: 
గులాబీపూలు కొత్తచిగుర్లపై వస్తాయి. కాబట్టి కొమ్మకత్తిరింపులు తప్పనిసరిగా చేయాలి. అక్టోబరు, నవంబరులో కొమ్మకత్తిరింపులు చేయుటకు అనుకూలం. హైబ్రీడ్‌టీ రకాలను మనం కోరుకునే పూత సమయానికి 45 రోజుల ముందుగానూ, ప్లోరిబండా రకాలను 42 రోజుల ముందుగానూ కత్తిరించాలి. కత్తిరించిన అన్ని భాగాలకూ విధిగా బోర్డోపేస్టును రాయాలి.

Also Read: సేంద్రియ విధానంలో గులాబీ సాగు.. గులాబీ రేకులతో రుచికరమైన గుల్కాండ్

పూత దిగుబడి:  
వాణిజ్యపరంగా సాగుచేసిన గులాబీలు నాటిన రెండు సంవత్సరాల తరువాత మొదలై 7`8 సంవత్సరాల వరకు పూస్తాయి. 3 సంవత్సరాల మొక్క 300 గులాబీల వరకు పూస్తుంది. మార్కెట్‌ కొరకు పెంచే గులాబీలలో మొగ్గ ఎదిగి రక్షక పత్రాలు విచ్చుకోవడం ప్రారంభించే ముందు కోయాలి.
Rose Harvest

Rose Harvest

చీడపీడలు: 
కారకం: మొగ్గ తొలిచే పురుగు
లక్షణాలు: పూల మొగ్గలలో రంధ్రాలు
నివారణ: లార్విన్‌ 1 గ్రా.
కారకం: ఎర్రపొలుసు పురుగు
లక్షణాలు: కొమ్మల ఆకులపైన పొలుసుగా ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి.
నివారణ: ఎసిఫేట్‌్‌ 2 గ్రా., పెగాసిస్‌ 1 గ్రా.
కారకం: తామర పురుగులు
లక్షణాలు: రసం పీల్చడం వల్ల ఆకులు ముడుచుకుంటాయి. పూ మొగ్గలు గోధుమ రంగులోకి మారతాయి.
నివారణ: ఫిప్రోనిల్‌ 1`2 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్‌ 0.5 మి.లీ.
కారకం: నల్ల మచ్చ తెగులు
లక్షణాలు: వర్షాకాలం, శీతాకాలం ఆరంభంలో ఆకులపై నల్లని మచ్చలు ఏర్పడి పచ్చబడి రాలిపోతాయి.
నివారణ: కాప్టాన్‌ 2.5 గ్రా. , స్ట్రెప్టోసైక్లిన్‌ 0.6 గ్రా.
కారకం: బూడిద తెగులు
లక్షణాలు: ఆకులపై పూలు మరియు కొమ్మలపై తెల్లని పొడి బూజులాగా ఏర్పడుతుంది.
నివారణ: సల్ఫర్‌ 1 గ్రా. , ట్రైడిమార్ఫ్‌ 1 గ్రా.
కారకం: ఎండు తెగులు
లక్షణాలు: కొమ్మపై నుండి కిందికి నల్లగా మారి ఎండిపోతాయి.
నివారణ: సిఒసి 3 గ్రా. కొమ్మ మొత్తం తడిచేలా పిచికారీ చేయాలి. సిఒసి పేస్టు పూయాలి.
డా. నిర్మల,అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, పిజెటిఎస్‌ఎయు
డా. ఎమ్‌. వెంకటేశ్వర రెడ్డి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, పిజెటిఎస్‌ఎయు
డా. కె. నిరోష, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఎస్‌కెఎల్‌టిఎస్‌హెచ్‌యు
డా. యమ్‌. విజయలక్ష్మి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, పిజెటిఎస్‌ఎయు
డా.జి. జ్యోతి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (హార్టీకల్చర్‌), ఎస్‌కెఎల్‌టిఎస్‌హెచ్‌యు
Leave Your Comments

Rabi Peanuts: రబీ వేరుశనగలో సస్యరక్షణ

Previous article

International Women’s Day: జార్ఖండ్ వ్యవసాయంలో మహిళల కీలక పాత్ర

Next article

You may also like