Red Gram: జూలై మాసం వచ్చినా కూడా వర్షపాతం ఎక్కడ నమోదు కాలేదు. రైతులు వర్షాల కోసం ఎదురు చూసినా కూడా ఫలితం కానరాలేదు. విత్తనాలను శుద్ది చేసుకొని ఎదురుచూస్తున్న అన్నదాతకు చినుకు జాడ లేదు. వానలు లేవు కాబట్టి దీర్ఘకాల పంటలను ఎంచుకోకుండా తక్కువ కాల పరిమితిలో అందివచ్చే విత్తనాలను విత్తు కోవాలని సూచించారు. ఒకవేళ వర్షాభావ పరిస్థితులు ఎదురు అయినా అందుకు ప్రణాళికకు సిద్ధంగా ఉండాలని శాస్త్రవేత్తలు అంటున్నారు..
పప్పు జాతులలో కంది
వర్షాకాలంలో పండే పప్పు జాతులలో కంది ప్రధానమైనది.. ప్రత్తి, పొగాకు, మొక్కజొన్న పంటలకు ప్రత్నాయంగా కంది మంచి రాబడినిచ్చిన సందర్భాలు లేకపోలేదు. సాధారణంగా ఖరీఫ్ లో ఏక పంట కంటే కందిని మిశ్రమ పంటగానే రైతులు సాగు చేస్తున్నారు. నీటి వసతి ఉన్న రైతులు బిందు సేద్యంను జోడించి కందిని నారు పెంచే పద్దతులతో సాగు చేస్తారు…ఆధిక దిగుబడినిచ్చే వంగడాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత కంది సాగులో రైతులు 15 క్వింటాళ్ల దాకా దిగుబడులను సాధిస్తున్నారు.. సాగు మొదలు నుంచి మేలైన యాజమాన్య పద్దతులను అనుసరించడం ద్వారా కంది పంటను సాగు ఫలఫద్రం చేసుకోవచ్చు.
Also Read: Really Agricultural Manual Seeder: రియల్లీ కంపెనీ నుండి అందుబాటులోకి వచ్చిన మాన్యువల్ సీడర్
తక్కువ వర్షపాతం నమోదు
ప్రస్తుత పరిస్థితుల్లో అనుకున్నంత స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు.. సాధారణం కంటే తక్కువ స్థాయిలో వర్షపాతం నమోదు అవుతుంది.. కొంతమంది విత్తనాలను విత్తు కోవడానికి ఎదురుచూస్తున్నారు. మరి కొంత మంది వచ్చిన మొలకలను కాపాడుకోవడానికి వాన కోసం ఎదురుచూస్తున్నారు. జూలై 15 వచ్చిన కూడా వర్షాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి తక్కువ కాలంలో వచ్చే వర్షాధార పంట అయినా కందిని వేసుకోవాలి అని అధికారులు అంటున్నారు.
దృష్టి సారిస్తే ఎక్కువ దిగుబడులు
ఇరు తెలుగు రాష్ట్రాలలో పండించే పప్పుదినుసులలో కంది ఒక్కటి..కందిని అంతర పంటగా సాగు చేస్తారు. దీనిలో 10 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉంది.. దీనిని జూన్ 15 నుండి ఆగస్టు వరకు విత్తుకోవచ్చు. ఎకరాకు 3-4 కి విత్తనం అవసరమవుతుంది. కంది పంటకు చవుడు నేలలు, మురుగు నీరు నిల్వ ఉండే నేలలు తప్ప అన్ని నేలల్లో కందిని వేయవచ్చు. కీలకమైన కాత, పూత దశలో బెట్ట పరిస్థితి ఎదురు అయినప్పుడు అవకాశం ఉన్నవారు 1 లేదా 2 నీటి తడులను ఇచ్చినట్లయి తే 20 శాతం ఆధిక దిగుబడులను పొందవచ్చు.. అంతేకాకుండా కందిలో హైబ్రిడ్ నూతన వంగడ రకాలు అందుబాటులోకి వచ్చాయి. రైతులు నీటి పైన కూడా దృష్టి సారిస్తే ఎక్కువ దిగుబడులను సాధించవచ్చు. మనకు కంది వినియోగం ఎక్కువ కాబట్టి విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది… ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాలు కోసం ఎదురు చూడకుండా వర్షాధార పంట అయినా కందిని సాగు చేసుకుంటే రైతులకు మంచి ఆదాయన్నిస్తుంది.
Also Read: Punasa Mangoes: ఏడాదిలో రెండుసార్లు కాపు నిచ్చే పునాస మామిడి..