Punasa Mangoes: పండ్లలో రారాజును ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. పిల్లల నుంచి పెద్దల వరకు ఏడాదికి ఒక్కసారి దొరికే మామిడి రుచిని ఎవరు కాదంటారు. ధరలు ఎక్కువగా ఉన్న ఈ ఫలరాజాని ఆస్వాదించడంలో ఎవరు వెనుకడుగు వేయరు. అయితే మామిడి చెట్టు ఏడాదికి ఒకసారి మాత్రమే కాపునిస్తుంది. అదే పునాస రకం మామిడి మాత్రం ఏడాదికి రెండు సార్లు కాపు నిస్తుంది.
కాలం కానీ కాలంలో కూడా మామిడి కాయలు దొరికేలా అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా అధిక సాంద్ర పద్ధతిలో సాగు చేయడం విశేషం. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల రైతులు ఈ పునాస మామిడి రకాన్ని వేస్తు అధిక దిగుబడులను పొందుతున్నారు. అంతేకాకుండా తోటి రైతులకు ఈ పునాస పండు గురించి, మార్కెట్ గురించి వివరిస్తున్నారు..
సాంద్ర పద్ధతిలో పునాస మామిడి
హైడెన్సిటీ లో పునాస మామిడిని సాంద్ర పద్ధతిలో రైతులు సాగు చేస్తున్నారు. ఈ పంట వేసిన రెండు సంవత్సరాల్లోనే పూత, కాత రావడం విశేషం. అంతేకాకుండా ఈ పునాస రకం ఆన్ సీజన్ లో కూడా కాస్తుంది.. ఆగస్టు లో కాయలు కాసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ మామిడిని ఏక పంటగా సాగు చేస్తారు.
చీడపీడలు ఆశించకుండా కాయలకు కాస్మోటిక్ ఫ్రూట్ ప్రొటక్షన్ బ్యాగ్ ను తగిలిస్తున్నారు. అయితే నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు మాత్రమే బ్యాగ్ ను తగిలించాలి.. డ్రిప్ ద్వారా మొక్కలకు సాగునీరు అందిస్తే మంచి ఫలసాయం పొందవచ్చు. ఈపంట ద్వారా అధిక దిగుబడులు రావడం, మార్కెట్ రేటు ఎక్కువగా ఉండటంతో ఇప్పుడు రైతుల దృష్టి ఈ రకం పై పడింది… దాని కాయ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ పంట ఇరు తెలుగు రాష్ర్టాలలో పండించడానికి నేలలు కూడా అనుకూలమైనవి..
Also Read: Miyazaki Mango: ఒక కిలో మామిడి పండ్లలు 2. 70 లక్షలు… ఎలా సాగు చేయాలో తెలుసుకోండి.!
కాస్మోటిక్ ఫ్రూట్ ప్రొటక్షన్ బ్యాగ్
ఈ పునాస రకం మామిడిని రైతులు సేంద్రియ పద్దతుల్లో పండిస్తున్నారు.. రసాయనక మందులు వాడకుండా కేవలం కషాయాలు మాత్రమే తయారు చేసి పిచికారి చేస్తున్నారు.. దీని ద్వారా తోట కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది..ఎకరాకు 650 మొక్కలు నాటారు.. ఒక్కొక్క చెట్టుకు 20 నుంచి 30 కాయలు దిగుబడి వస్తుంది.
ఈ సమయంలో మార్కెట్ లో కూడా మంచి ధర పలుకుతుంది.. మామిడికి చీడపీడల బెడద ఎక్కువగా ఉంటుంది.. ముఖ్యంగా వర్షాకాలంలో రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఉంటాయి. దీని ద్వారా కాయ నాణ్యత తగ్గుతుంది… ఈ సమస్యల నుంచి బయట పడాలి అంటే చిన్న సైజు కాయలకు కాస్మోటిక్ ఫ్రూట్ ప్రొటక్షన్ బ్యాగ్స్ తగిలిస్తే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా అధిక వర్షాలకు కూడా ఈ ప్రయోగం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా చేయడం వల్ల సాధారణ కాయ కంటే ఈ పునాస కాయ 15-20 శాతం అధిక బరువు ఉంటుంది.. దీనిపై రైతులకు అవగాహన కల్పించడానికి ఉద్యానశాఖ శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తోంది..
Also Read: Demand for Alphonso Mangoes: అమెరికా మార్కెట్లో అల్ఫోన్సో మామిడి పండ్లకు డిమాండ్