ఉద్యానశోభ

బెండలో ఎర్రనల్లి నివారణ చర్యలు..

0

పట్టణాలకు దగ్గరగా ఉండే గ్రామాల్లో అధిక శాతం రైతులు కూరగాయ పంటలను సాగు చేస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్లో ధర నిలకడగా ఉండే బెండ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. వివిధ ప్రాంతాలలో విత్తిన బెండ ప్రస్తుతం పూత, కాత దశలో ఉంది. వాతావరణ పరిస్థితుల వలన బెండలో ఎర్రనల్లి ఉధృతంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
బెండ ఏడాది పొడవునా సాగైయ్యే పంట. నాలుగు నెలల పాటు కాల పరిమితి గల ఈ పంట హైబ్రీడ్ రకాలు అందుబాటులోకి వచ్చాక రైతులు ఎకరాకు 50 క్వింటాళ్ల నుంచి 100 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. ఏడాదిలో ఎక్కువ రోజులపాటు మార్కెట్లో ధర నిలకడగా ఉండటం వలన రైతులు మంచి ఫలితాన్ని సాధిస్తున్నారు. ప్రస్తుతం రబీలో విత్తిన బెండ పూత, కాత దశలో ఉంది. ఇప్పటికే ఒకటి, రెండు కోతలు కూడా జరిగాయి. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా చాలా చోట్ల ఎర్రనల్లి ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వాతావరణం పొడిగా ఉండటం వలన ఎర్రనల్లి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని ప్రభావం వల్ల రైతులు పంట దిగుబడి తగ్గి నష్టపోయే అవకాశం ఉంది.
ఎర్రనల్లి లక్షణాలు:
తల్లి పురుగు చెట్టు ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే రసం పీల్చడం వలన చాలా వరకు ఆకులు మొత్తం పసుపు రంగులోకి మారి మచ్చలు ఏర్పడతాయి. అదే విధంగా పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే కూడా ఆకులన్నీ పండు బారిపోయి ఆకులు ముడుచుకుపోతాయి. తల్లి పురుగు ప్రతి రోజు సుమారు 2 వేల గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లను పెట్టి వాటి  చెట్టు చుట్టూ బూజును తయారుచేస్తుంది. ఇలా తల్లి పురుగు గూడులా చేసుకొని గుడ్లను కాపాడుకుంటుంది. బెండలో పూత, కాత వచ్చినప్పుడు పురుగులు రసం పీల్చడం వలన కాయలు మొత్తం తెలుపు రంగులోకి మారిపోయి సరైన మద్దతు ధర దొరకక నష్టపోయే అవకాశం ఉంది.
నివారణ:
నల్లి ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు నీటిలో కరిగే గంధకం పొడి 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఫెన్ ప్రోప్రాతిన్ 30% ఈసి 0.5 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నల్లిపై తీవ్ర ప్రభావం చూపాలంటే స్పైరోమిసిఫిన్ 1.2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి లేదా డైకోఫాల్ 5 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

Leave Your Comments

అధిక ఆదాయాన్ని అందించే “అగర్ వుడ్”

Previous article

పెసర.. బహుళ ప్రయోజనకారి

Next article

You may also like