Chili Cultivation: మిరప పంటలో అధిక దిగుబడులు సాధించేందుకు చీడపీడల ‘సమస్యలను అధిగమించేందుకు రైతులు విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. ఎకరాకు రూ.50వేల నుంచి రూ. లక్ష వరకు కూడా ఖర్చు పెడుతున్నారు. నారుమడి దశ నుంచి నాటిన తొలిదశలో సమగ్ర కలుపు, నీటి యాజమాన్యం, చీడపీడలు నివారించే విషయాల్లో రైతులు జాగ్రత్త వహించినప్పుడే పంట ఆరోగ్యవంతంగా పెరిగి అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది.
ప్రధానంగా నారుమడి దశలో, నాటిన తొలిదశలో ఆశించే చీడపీడల విషయంలో అజాగ్రత్త వహించినట్లయితే తదుపరి దశలో చీడ పీడల ఉధృతి ఎక్కువై సాగు పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులు నారుమడి దశలో ప్రధాన పొలంలో నాటే ముందు, నాటే సమయం. వంట తొలిదశలో కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటే నాణ్యమైన పంటను పొందవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో పంట వివిధ దశల్లో ఉంది. కొన్ని ప్రాంతాల్లో నారుమడి దశలో, మరి కొన్ని ప్రాంతాల్లో ప్రధాన పొలంలో వాటినవి. నాటేందుకు సిద్ధంగా ఉంది.
Also Read: Varieties of Chilies: మెరుగైన మిర్చి రకాలు.!
నారుమడి చివరి దశలో: నారుమడిలో మొక్కలు నాటటానికి సిద్ధంగా తయారైన వెంటనే చీడపీడలను సోకిన మొక్కలను విధిగా వేరుచేసి పీకి కాల్చివేయాలి. ముఖ్యంగా వైరస్ తెగుళ్లు సోకిన నారు మొక్కలను తొలిదశలోనే గుర్తించి కాల్చివేయాలి. నారు పీకటానికి వారం రోజుల ముందు ఒక సెంటు (40 చ.మీ.)నారుమడికి 80 గ్రా. ఫిప్రోనిల్ గుళికలు వేయాలి. దీనివల్ల రసంపీల్చుపురుగుల నివారణ జరగటం వల్ల నాటిన తర్వాత మొక్క ఏపుగా పెరుగుతుంది. నారుమడిలో ముఖ్యంగా వర్షాలు పడే వాతావరణంలో కాండం కుళ్ళు తెగులు ఆశిస్తే లీటరు నీటికి 1.5గ్రా. థయోఫినేట్ మిథైల్ లేదా 3గ్రా లు కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి పిచికారీ చేయాలి.
నాటే సమయంలో: 30-35 రోజుల వయసు నారును ప్రధాన పొలంలో నాటటం మంచిది. వీలైనంత వరకు ముదురు నారు వాడకూడదు.మిరప పంటను ప్రధాన పొలంలో నాటేముందు నేలలో బాగా తేమ ఉన్నప్పుడు నాటడానికి 1, 2 రోజుల ముందు పెండి మిథాలిక్ 30శాతం ద్రావకం ఎకరాకు 1.3-1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.నాటేముందు పైరు చుట్టుగా 2-3 వరుసల్లో జొన్న లేదా మొక్క జొన్న
పైరు విత్తనాలను ఒత్తుగా విత్తుకోవాలి. ప్రధాన పొలంలో లేదా గట్లపైన ఎకరాకు 15-20 బంతి, ఆముదం మొక్కలు ఉండేలా విత్తుకోవాలి బంతి పంట సెనగపచ్చ పురుగుకు | ఆముదం పొగాకు లద్దెపురుగుకు ఆకర్షణ పంటగా పనిచేస్తాయి. సాధారణ పద్ధతిలో లేదా డ్రిప్, పాస్టిక్ మల్చింగ్ పద్ధతిలో అయినా సాగు| చేసుకోవచ్చు. మల్చింగ్ విధానం వల్ల కలుపు, కొన్ని రకాల చీడపీడల ఉన్నతి బాగా తగ్గుతుంది.
నాటిన తర్వాత: ఈ పంటలో నాటక ముందు కలుపు మందులు పిచికారీ చేసినప్పటికీ మిరప వాటిని 25-30 రోజుల తర్వాత, 30 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి గొర్రు గంటలతో రెండు వైపులా అంతరకృషి చేయాలి. వర్షాలు అధికంగా ఉండి. అంతరకృషి చేయటం కుదరక గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు క్విజలోహస్ ఇస్టల్ శాతం ద్రావకం ఎకరాకు 400 మి.లీ చొప్పున పిచికారీ చేస్తే గడ్డిజాతి మొక్కలు వారం, పది రోజుల్లో చనిపోతాయి. పంటకు ఎలాంటి నష్టం ఉండదు.
Also Read: Red Chili: నందుర్‌బార్ మార్కెట్‌కు క్యూ కడుతున్న మిర్చి రైతులు.!
Must Watch:
-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171