Pointed Gourd Cultivation (Parwal) – వాతావరణం:- తేమతో కూడిన వాతావరణం అనుకూలం. ఇది ఉష్ణ మండలం పంట. అతి తక్కువ ఉష్ణగ్రత్తను తట్టుకోలేదు. బీహార్ , ఉత్తరప్రదేశ్లలో దీనిని వేసవి పంటగా సాగు చేసి దూర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. ఉష్ణగ్రత్త 30- 35° సెంటిగ్రేడ్ వున్న వాతావరణం పెరుగుదల , దిగుబడికి అనుకూలం.
పంటక్రమం:- మొక్కల మర్చి నుండి అక్టోబర్ నేల వరకు బాగా పెరుగుతాయి. ఈ కాలంలో బాగా పూతకు వచ్చి మంచి కాపునిస్తాయి. నవంబర్ నేల నుండి ఎదుగుదల ఆగిపోయి మొక్క నిద్రవస్థలోకి పోతుంది. కాబట్టి ఈ కాలంలో మొక్కలను మొదళ్ళ 6 అంగుళాలు వరకు వదిలి కాండం, ప్రక్క కొమ్మలు కత్తిరించాలి.
నేలలు:- నది తీర ప్రాంతాలలోని ఒండ్రుమట్టి నేలలు పంట సాగుకు శ్రేష్ఠమైనవి. ఇసుక నేలలు, నీరు నిలువని నల్ల నేలలు, సారవంతమైన ఒండ్రు నేలలు అనుకూలం. నీరు ఎక్కువగా నిలిచే బంకమట్టి నేలలు, మురుగు నీటి సౌకర్యం లేని నేలలు సాగుకు అనుకూలం కాదు. ఎందుకంటే పర్వల్ నీరు నిలువ ఉంటే తట్టుకోలేదు . ఉదజని సూచిక 6.0-6.5 వున్న నేలలు శ్రేష్టం
నాటే విధానం:- ఆడ, మగ , మొక్కలు వేరు వేరుగా ఉంటాయి. కాబట్టి ప్రతి 10 ఆడ మొక్కలకు ఒక మగ మొక్క ఉండే విధంగా నాటుకోవాలి. పందిరిపై పాకించే పద్దతిలో ఎటు చూసినా 2 మి. దూరం ఉండే విధంగా నాటాలి. ఈ పద్దతిలో ఎకరాకు 1000 మొక్కలు పడతాయి. వరుసలో కర్రలు పాతి, వైరు చుట్టి దాడిలాగా పాకించె పద్దతిలో వరసల మధ్య, మొక్కల మధ్య 1.5 మి . ఉండే విధంగా నాటాలి. ఈ పద్దతిలో ఎకరాకు సుమారు 1800 మొక్కలు అవసరం అవుతాయి.
నీటి యాజమాన్యం:- ఎండాకాలంలో చిగురించి పెరిగి, పూతకు వస్తుంది. కాబట్టి ఈ దశలో నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలి. నేల స్వభావాన్ని బట్టి వాతావరణ పరిస్థితులను బట్టి నీటి తడులు ఇవ్వాలి. పూత , కోత సమయంలో నీటి ఎద్దడి ఉంటే దిగుబడి బాగా తగ్గిపోతుంది. డ్రిప్ ద్వారా నీటిని అందించుకున్నట్లెట్ మంచి ఫలితాలు పొందవచ్చు.
Also Read: Drip and Sprinkler Irrigation Benefits: డ్రిప్ మరియు స్ప్రింక్లర్ ఇరిగేషన్ వల్ల లాభాలు.!
కత్తిరింపులు, తీగ పాకించుట:- నవంబర్ నేలలో మొక్కలు నిద్రవస్థకు చేరుకుంటాయి. కాబట్టి కోత అయిపోయిన తరవాత అక్టోబర్ చివరలో మొక్క మొదళ్ళు 6 అంగుళాల వరకు వదలి కాండం , పక్క కొమ్మలు కత్తిరించాలి. నిద్రవస్థ పూర్తయిన తర్వాత మరలా పెరిగే తీగలను పందిరి మీదకు కాని, ట్రేల్లిసింగ్ పద్దతిలో కాని పాకించాలి. నేలపై పాకించినట్లాయితే చీడపిడల బేడద ఎక్కువగా ఉంటుంది. పొలంలో ఆడ, మగ మొక్కలు సరైన నిష్పతిలో ఉండి తేనె టిగాలు ఉన్నట్లయితే పరపరగా సంపర్కం జరిగి కాయలు ఏర్పడి దిగుబడి పెరుగుతుంది.
ఎరువుల యాజమాన్యం:- బహువర్షిక పంట కావడం వల్ల పోషకాలు ఎప్పుడూ నేలలో అందుబాటులో ఉండేలా చూడాలి. కాబట్టి పర్వల్ పంటకు ప్రతి సంవత్సరం ఎక్కువగా ఎరువులను వేయాలి. ఎకరాకు పశువుల ఎరువు 6-8 టన్నులు
కోత మరియు దిగుబడి:- బాగా ఎదిగిన ఆకు పచ్చని కాయలను కోయాలి. కాయలు కోయకుండా ఎక్కువ కాలం ఉంచితే పండూబారి పోతాయి. ఒక ఎకరాకు 2.5 నుండి 3.5 టన్నుల వరకు దిగుబడి పొందవచ్చు.
సస్యరక్షణ :
పండు ఈగ:- తల్లి ఈగలు చిన్ని పిందాలపై గుడ్లు పెడతాయి. పొదిగబడిన పురుగులు కాయలను తోలుచుకొని లోపల పదార్ధాన్ని తిని నష్టం కలుగజేస్తాయి. నివారణకు ముందుగా పురుగు ఆశించిన కాయలను ఏరి నాశనం చేయాలి.పూత, పిందె దశలో మలాథియాన్ 2 మి. లీ. / లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ఈగలను ఆకర్షించడానికి పొలంలో అక్కడక్కడ విషపు ఎరువు వుంచాలి. ఇందుకుగాను మలాథియాన్ 100 మి. లీ.., 100 గ్రా. బెల్లం లేదా చక్కెర 10 లీటర్ల నీటిలో కలిపి మూకుడులో పోసి ఎకరాకు 10-12 మూకుడులు అక్కడక్కడ పెట్టాలి. ఈ విషపు ఎరకు బాగా పులిసిన కల్లును కలిపితే ఈగలు ఎక్కువగా ఆకర్షించబడ విషపదర్థం తిని చనిపోతాయి.
బూడిద తెగులు:- వాతావరణంలో తేమ ఎక్కువగా వుండి,చలికాలంలో ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. ఆకుల పై భాగం లో బూడిద వంటి తెల్లటి పదార్థం ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. పూత , పిందెలపై కూడ ఆశించి పూత, పిందె రాలుతుంది. నివారణకు డినొక్యాప్ 1 మి. లి. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. గంధకం వాడకూడదు.
బూజు తెగులు:- వాతావరణంలో తేమ ఎక్కువగా వుండి, వేడిగా ఉన్నప్పుడు ఆకుల అడుగు భాగంలో బూజు ఏర్పడి క్రమేపి ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు రిడోమిల్ 2 గ్రా./ లీటరు లేదా అజాక్సిస్ట్రాబిస్ 1 గ్రా. / లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
ఆకు తొలుచు పురుగు:- ఈ పురుగు తాలూకు లార్వా ఆకును తోలుచుకుంటూ తినివేయడం వల్ల తెల్లని చారలు ఏర్పడి క్రమేపి ఆకులు ఎండిపోతాయి. దీనివల్ల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఈ పురుగు నివారణకు ప్రోఫినోసాస్ 2 మి. లి. / లీటరు నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి.
Also Read: Important Mulberry Varieties: కొన్ని ముఖ్యమైన మల్బరీ రకాలు.!