మల్లె సాగులో దిగుబడి, నాణ్యత అనేవి సకాలంలో కొమ్మ కత్తిరింపులు, ఎరువుల యాజమాన్యం, చీడపీడల నివారణ మీద ఆధారపడి ఉంటుంది.
సస్యరక్షణ
మొగ్గతొలుచు పురుగు:
పురుగు యొక్క లార్వా, పువ్వు, మొగ్గల్లోనికి చొచ్చుకొనిపోయి పూల భాగాలను తినివేస్తూ తీవ్రదశల్లో మొగ్గలన్నింటిని ఒక దగ్గరికి చేర్చి ముడుచుకుపోయేటట్లు చేస్తుంది. నివారణకు గాను మలాథియాన్ లేక ఎండోసల్ఫాన్ లీటరు నీటికి 2మి.లీ. మందును కలిపి చెట్ల పై పిచికారీ చేయాలి.
నల్లి:
ఈ పురుగు ఉధృతి పొడి వాతావరణంలో ఎక్కువగా ఉంటుంది. పురుగులు ఆకు అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వలన ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతాయి. నివారణకు గాను గంధకపు పొడిని ఎకరాకు 8 – 10 కిలోల చొప్పున చల్లుకోవాలి.
తెగుళ్ళు
ఆకు ఎండు:
తెగులు ఆశించిన ఆకులు దళసరిగా మారుతాయి. ఆకుపై భాగంలో ఎరుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. తీవ్రదశలో 50 శాతం వరకు దిగుబడి తగ్గుతుంది. నివారణకు మాంకోజెబ్ 3గ్రా. లేక కార్బండిజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఎండు తెగులు:
తెగులు తొలిదశలో మొక్క క్రింది భాగం ఆకులు ఎండిపోతాయి. అటు పిమ్మట పైభాగాన వున్న ఆకులు కూడా ఎండి రాలిపోతాయి. తీవ్ర దశలో మొక్కంతా ఎండి చనిపోతుంది/ నివారణకు మొక్కల చుట్టూ కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటిలో కలిపి భూమిని తడపాలి.