Muskmelon and Watermelon: బ్యాక్టీరియా మచ్చతెగులు – ఆకులు , తీగలు, కాయలపై మచ్చలు కనిపిస్తాయి. వాతావరణంలో తేమ అధికంగా ఉంటే కాయపై జిగురు ఏర్పడి క్రమేణా ఈ జిగురు గట్టిపడుతుంది.
నివారణ:
తెగులు సోకని ఆరోగ్యమైన విత్తనం ఎంచుకోవాలి. వ్యాధి సోకిన చెట్ల భాగాలను తీసివేయాలి. పాదులు, తీగలు, కాయలపై వారంరో జుల వ్యవధిలో 2 సార్లు కాపర్ ఆక్సీ క్లోరైడ్ (3 గ్రా./లీ.) పిచికారి చేయాలి.
బూడిద తెగులు:
తెగులు సోకిన మొక్కల్లో కాండం పైన, ఆకు అడుగు భాగాన, తీగలపై తెల్లటి బూడిదవంటి పదార్ధంతో కప్పి ఉంటుంది. ఆకులు పసుపురంగులోకి మారి, తీగలు గిడసబారి ఉంటాయి. పూత సరిగ్గా రాదు. ఆకులు, కాండంఎండి పెరుగుదల తగ్గి కాయలు చిన్నవిగా ఏర్పడతాయి. జనవరి, ఫిబ్రవరిలో ఎక్కువగా ఆశిస్తుంది.
నివారణ:
పొలాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. వ్యాధిసోకిన ఆకులు, తీగలు ఏరివేసి వాటిని కాల్చివేయాలి. లీటరు నీటికి ఒక మి.లీ. లేదా ఒక గ్రాము కెరాథెన్ లేదా కార్బెండాజిం లేదా 2.5 గ్రా. ఇండోఫిల్ ఎం-45 చొప్పున కలిపి 2 సార్లు ఆకు అడుగు భాగం బాగా తడిసేలా 10 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.
Also Read: Agricultural Mechanization: వ్యవసాయంలోస్త్రీ ల శ్రమను తగ్గించే వివిధ వ్యవసాయ యంత్రాలు.!
బూజు తెగులు:
తేమ వాతావరణం అధికంగా ఉంటే ఆకు అడుగున ఊదార రంగుమచ్చలు తెల్లని బూజువంటిది ఏర్పడి. మొక్కలు తాత్కాలికంగా వడలిపోతాయి. ఆకులపైన పసుపురంగు మచ్చలు ఏర్పడతాయి. దీనివల్ల కాయల పక్వత మందగిస్తుంది.
నివారణకు:
తెగులు సోకిన ఆకులని ఏరి, కాల్చివేయాలి. మొక్కలపై వారం వ్యవధిలో రెండు, మూడు సార్లు మాంకోజెబ్ (2గ్రా./లీటరు. నీటికి) పిచికారి చేయాలి.
వైరస్ తెగులు (వెర్రి తెగులు):
ఇది వైరస్ వల్ల వస్తుంది. ఈనెలు పసుపు వర్ణంలోకి మారుతాయి. ఆకు లపై బుడిపెలు ఏర్పడతాయి. పూత,కాపు రాదు. ఒకవేళ అక్కడక్కడ వచ్చినా కాయ ఏర్పడదు. మొక్క గిడసబారుతుంది. ఆకులు వికృతంగా మారుతాయి. ఇటువంటి వైరస్ సోకిన పొలం నుంచి విత్తనం సేకరించరాదు. ప్రత్యేకించి తెగులుని నివారించే మందులు లేవు. ముందుజాగ్రత్త చర్యగా మొక్క పాదుల్లో కలుపును తీసివేయాలి. పేనుబంక పురుగుల ద్వారా ఈ వైరస్ తెగులు ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాప్తి చెందుతుంది గనుక లీటరు నీటికి 2 మి.లీ. డైమిథోయేట్ చొప్పున కలిపి పిచికారి చేసి పేనుబంకను నిర్మూలించి వ్యాధి వ్యాప్తి జరగకుండా చూడాలి.
కాయకుళ్ళు తెగలు:
ఇది నేల ద్వారా ఫిథియం శిలీంద్రం వల్ల వస్తుంది. భూమిలో తేమ అధికంగా ఉంటే ఈ కాయ కుళ్ళు రావటానికి ఆస్కారం ఎక్కువ. కాయపై తెల్లని బూజు కనిపిస్తుంది.
నివారణ:
బిందుసేద్యం ద్వారా పంటసాగు చేయాలి. మల్చింగ్ విధానం అవలంబించాలి. లీటరు నీటికి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రా. చొప్పున కలిపి పాదులు, తీగలు, కాయలు తడిచేలా వారం రోజుల వ్యవధిలో రెండు, మూడుసార్లు పిచి కారి చేయాలి.
Also Read: Pests of Black and Green Gram: రబీ మినుము, పెసరలలో సస్యరక్షణ చర్యలు.!