Papaya Cultivation: మన రాష్ట్రంలో బొప్పాయి సాగు విస్తీర్ణం 12500 ఎకరాలు ఉత్పత్తి 4 లక్షల టన్నులు ఉత్పాదకత సుమారు ఎకరాకు 50 టన్నులు ఉంది. అనంతపూర్, కడప, మెదక్, కర్నూల్, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలోను కోస్తా జిల్లాలో తక్కువ విస్తీర్ణంలో సాగులో ఉంది.
బొప్పాయి అధికంగా అత్యధిక పోషక విలువలను కల్గింటుంది. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు ఖనిజాలు అధికంగా ఉంటాయి. దీనిని అనేక ఔషదాలలో కూడా వాడతారు. ముఖ్యంగా కడుపులోని అనేక వ్యాధులు బొప్పాయి వలన నివారించబడతాయి. బొప్పాయి పాల నుండి తీయబడిన పపయిన్ అనే ఎంజైమ్ను అనేక పరిశ్రమలలో మందుల తయారీలో వాడుతున్నారు.
ఎర్ర గరప నేలలు నీరు బాగా మధ్య రకం నల్ల రేగడి నేలలు అనుకూలం. ఎట్టి పరిస్థితులలోను మొక్క మొదలు దగ్గర నీరు నిలువ ఉండకూడదు. హెక్టారుకు 20 కిలోల పశువుల ఎరువును భూమిలో వేసి బాగా దున్నాలి. ప్రతి మొక్కకు 250 గ్రాముల యూరియా ఎరువులను ప్రతి 2 నెలలకు ఒకసారి చొప్పున మొక్కలు నాటిన 2 నెలల తర్వాత నుంచి ప్రారంభించి మొత్తం 6 మోతాదులుగా వేయవలెను.
Also Read: Tomato Cultivation: రైతులు ఎక్కువగా సాగు చేసే ఈ కూరగాయ.. మీరు సాగు చేయాలి అనుకుంటున్నారా…

Papaya Cultivation
డ్రిప్ ద్వారా చిన్న మొక్కలకైతే 2 రోజులకు ఒక సారి సుమారు 8-10 రోజులకు ఒక సారి నీటిని ఇవ్వాలి. అదే పెద్ద మొక్కలకైతే ప్రతిరోజు 20-25 లీటర్ల నీటిని ఇవ్వాలి. రింగు పద్ధతిలో వేసవిలో 4-6 రోజుల కొకసారి, చలి కాలంలో 8-10 రోజులకొకసారి నీరు ఇవ్వాలి.
మొక్కలు నాటిన 4-5 నెలల నుంచి పూత, కాత ప్రారంభమగును. పూత వచ్చిన 4 నెలలకు కాయ తయారవుతుంది. పండు కొద్దిగా పసుపు రంగుకు మారినపుడు బొప్పాయిని కోయవలెను. పండ్లు సంవత్సరం పొడవునా వచ్చును. కాయలను మొక్కల మీద మాగనివ్వరాదు. నాటిన 9 వ నెల నుండి 2 సంవత్సరాల వరకు పండునిస్తుంది. దిగుబడి ఎకరంకు 21-30 టన్నుల వరకు ఉంటుంది.
Also Read: Expensive Mushrooms: ఈ పుట్టగొడుగుల ధర తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం.!