ఉద్యానశోభ

అరటిలో ఎరువుల యాజమాన్యం

0
Banana Crop
Curry Banana

 

banana crop

అధిక సాంద్రత పద్ధతిలో టిష్యుకల్చర్‌ అరటి మొక్కలు, కర్పూరచక్కెర కేళి వంటి వివిధ రకాలను నాటినప్పుడు మొక్కకు అవసరమైన వివిధ పోషకాలను వివిధ దశల్లో సమతుల్యతను పాటించి ఎరువులను వాడాలి.

మొక్కను నాటేసమయంలో ఎకరానికి 10 – 15 ట్రాక్టర్ల పశువుల ఎరువును వాడాలి. మొక్కవేయడానికి సరైన గుంతలు తయారు చేసి అందులో 100 గ్రా. ఎస్‌.ఎస్‌.పి మరియు 50 గ్రా. ఎం.ఒ.పి ఎరువులను వేసి మొక్కలు నాటాలి. అరటి పంటలో రైతులు అధికంగా ఎరువులను వాడాల్సి ఉంటుంది. ఒక టన్ను అరటిపంట దిగుబడికి 7 – 8 కిలోల నత్రజని, 1.5 కిలోల ఫాస్పరస్‌, 15 – 17 కిలోల పొటాషియం పోషకాలు అవసరం ఉంటుంది. మొదటిసారి గెలలను కోయడానికి దాదాపుగా 600 కిలోల యూరియా, 500 ఎస్‌.ఎస్‌.పి మరియు 720 కిలోల పొటాష్‌ (ఎమ్‌.ఒ.పి) ఎరువులను వాడాల్సిఉంటుంది.

ఈ క్రింది విధంగా కాంప్లెక్స్‌ ఎరువులను వాడాలి (గ్రాము / మొక్క ఒక్కింటికీ)

యూరియా ఎస్‌.ఎస్‌.పి ఎమ్‌.ఒ.పి

మొక్క నాటిన 10 రోజుల తరువాత 25 గ్రా.

మొక్క నాటిన 30 రోజుల తరువాత 25 గ్రా.  100 గ్రా.  50 గ్రా.

మొక్క నాటిన 60 రోజుల తరువాత 50 గ్రా.  100 గ్రా.  50 గ్రా.

మొక్క నాటిన 90 రోజుల తరువాత 50 గ్రా.  100 గ్రా.  50 గ్రా.

మొక్క నాటిన 120 రోజుల తరువాత 60 గ్రా.  100 గ్రా.  50 గ్రా.

మొక్క నాటిన 150 రోజుల తరువాత 60 గ్రా.     100 గ్రా.

మొక్క నాటిన 180 రోజుల తరువాత 30 గ్రా.   60 గ్రా.

మొక్క నాటిన 210 రోజుల తరువాత 30 గ్రా.    90 గ్రా.

మొక్క నాటిన 240 రోజుల తరువాత 30 గ్రా.  90 గ్రా.

మొక్క నాటిన 270 రోజుల తరువాత 30 గ్రా.  90 గ్రా.

మొక్క నాటిన 300 రోజుల తరువాత 30 గ్రా.   90 గ్రా.

 

డ్రిప్‌ ద్వారా ఎరువుల యాజమాన్యం (ఫెర్టిగేషన్‌ పద్ధతిలో) కిలో / ఎకరానికి

19 : 19  : 19 13 : 0 : 45 12 : 61 : 0 సూక్ష్మపోషకాలు

మొక్కలు నాటిన 10 రోజుల తరువాత  25 కిలో –  10 కిలో

(10 – 20 రోజులు)

మొక్క నాటిన 20 – 39 రోజులకు  25 కిలో – 10 కిలో

మొక్క నాటిన 40 -79 రోజుల తరువాత 35 కిలో 10 కిలో 3.5 కిలో

మొక్క నాటిన 80 – 85 రోజుల తరువాత 35 కిలో- 35 కిలో

మొక్క నాటిన 90 – 119 రోజుల తరువాత 60 కిలో 25  కిలో – 3.5 కిలో

మొక్క నాటిన 120 – 139 రోజుల తరువాత 60 కిలో 90  కిలో -3.5 కిలో

మొక్క నాటిన 140 – 180 రోజుల తరువాత 20 కిలో 60 కిలో 13 పిండి వేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.

పైన చెప్పిన ఎరువులను ఉపయోగిస్తూ ప్రతి 15 రోజులకొకసారి ఎకరానికి 2 లీటర్ల హ్యుమిక్‌ ఆసిడ్‌ను డ్రిప్‌ ద్వారా పంపాలి. లేదా  ప్రతి 15 రోజలకొకసారి ఒక ఎకరానికి  200 లీటర్ల జీవామృతం ద్రావణాన్ని వడకట్టి డ్రిప్‌ ద్వారా అందచేయాలి. మొక్కలు నాటిన 60 రోజుల తరువాత ఎకరానికి 100 కిలోల వేపపిండి G 150 కిలోల ఆముదం అందజేయాలి.

రాయల రామకృష్ణ, ఉద్యాన అధికారి, మెదక్‌

Leave Your Comments

మామిడి తోటలలో కోత అనంతరం యాజమాన్య పద్దతులు

Previous article

కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి శోభ కరంద్లాజే గారికి వినతిపత్రం అందజేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..

Next article

You may also like