ఉద్యానశోభ

Black Pepper Cultivation: మిరియాల సాగులో మెలకువలు.!

1
Black Pepper
Black Pepper

Black Pepper Cultivation: మిరియాలు యొక్క బహువార్షిక తీగజాతికి చెందినది. ఎండిన మిరియా లను నల్ల అని, పై చర్మం తీసి ఎండబెట్టిన వాటిని తెల్లమిరి యాలు అంటారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖజిల్లాలో పర్వత ప్రాంతాలైన చింతపల్లి, పాడేరు, అరకు, తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం ప్రాంతాల్లో దీనిని సాగుచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 60,500 ఎక రాల్లో దీనిని సాగుచేస్తున్నారు. పాడేరులో కాఫీతోటల్లో అంతరపంటగా సాగు చేస్తున్నారు. వర్షాధార పంటగా దీనిని పండిస్తున్నారు.

Black Pepper Trees

Black Pepper Trees

అనుకూల పరిస్థితులు: సముద్రమట్టం నుంచి 500 – 1500 మీ. ఎత్తులో ఉన్న ప్రాంతాలు సాగుకు అనుకూలం. 1250-2000 మి.మీ. వర్షపాతం, 10-35 డిగ్రీల సెం. గ్రే. ఉష్ణోగ్రత ఉండాలి. నీరు ఇంకిపోయే ఎర్రనేలలు, లేటరైట్ నేలలు మంచివి.

రకాలు-

పన్నియుర్- 1: ఎకరాకు 500 కిలోల ఎండు మిరియాల దిగుబడివస్తుంది. దీని ఆకులు వెడల్పుగా, కాయలు గుత్తులు పొడవుగా ఉంటాయి. ఒక్కో గుత్తిలో 125 గింజలుంటాయి. ఇది నీడను తట్టుకోలేదు. పైటోఫ్తోరా వంటి కుళ్ళు తెగులు సోకే అవకాశం ఉంది. తాజా మిరియాల నుంచి 35 శాతం ఎండు మిరియాలు వస్తాయి.

పన్నియుర్-2: ఎకరాకు 1000 కిలోల దిగుబడినిస్తుంది. కాయల గుత్తులు సుమారు 12 సెం.మీ. పొడవుంటాయి. ఒక్కో గుత్తికి 45 గింజలుంటాయి.తాజా మిరియాల నుంచి 35 శాతం ఎండు మిరియాలు వస్తాయి.

పన్నియర్-3: ఎకరాకు 800 కిలోల దిగుబడి నిచ్చే హైబ్రిడ్ రకం దీని || గుత్తులు పొడవుగా ఉండి ఒక్కో గుత్తిలో 68వరకు గింజలుంటాయి. తాజా మిరియాల నుంచి 27.8శాతం ఎండు మిరియాలు వస్తాయి. మిరియాలలో శ్రీకర శుభకర అనే రకాలు కూడా ఉన్నాయి.

Black Pepper Cultivation

Black Pepper Cultivation

సాగు:మిరియాల తీగ అడుగుభాగం నుంచి సమాంతరంగా పెరిగే రన్నర్ కొమ్మలను 2-3 కణుపులున్న చిన్న కొమ్మలుగా కత్తిరించి నాటాలి. ఈ కొమ్మలను మార్చి- ఏప్రిల్ నెలల్లో తీసుకొని నారుమడిలో లేదా పాలి దీన్ సంచిలో నాటాలి. తర్వాత జూన్-జులైలో తోటలో నాటుకోవాలి. మిరి యాల తీగలు వేయడానికి మూడేళ్ల ముందు సిల్వర్క్ మొక్కలను 2.5-2.5 మీ. ఎడంలో నాటాలి. సిల్వర్క్ మొక్కల మొదళ్ళ వద్ద ఉత్తరదిశగా 50-50-50 పరి మాణమున్న గుంతలు తవ్వి మిరియాల తీగలను . నాటాలి. ఎకరాకు సుమారు 640 మొక్కలు అవసరం నాలుగేళ్లు ఆపైన వయస్సు. మిరియాల పంటలో ప్రతి తీగకు 10కిలోల పశువుల ఎరువు, 100గ్రా. నత్ర జని, 40గ్రా. భాస్వరం, 140గ్రా పొటాష్ నిచ్చే ఎరువులను వేయాలి. వీటిని సంవత్సరంలో రెండు దఫాలుగా అంటే మే నెలలో సగభాగం, మిగిలిన సగభాగం ఆగస్టు నుంచి సెప్టెంబరులో వేయాలి. సిఫారసు చేసిన ఎరువుల్లో పావువంతు మొదటి సంవత్సరం, సగం రెండో సంవత్సరం, ముప్పావు భాగం మూడు సంవత్సరాలు వయస్సు వచ్చిన తీగలకు వేయాలి. కొత్తగా నాటిన మిరియాల మొక్కకు రెండు రోజులకొకసారి నీళ్ళు పెట్టాలి. మూడేళ్లు పైబడిన మొక్కకు నవంబర్ నుంచి తొలకరి వర్షాల వరకు నీటి తడులు ఇవ్వాలి. మొక్కల చుట్టూ 75సెం. మీ. ల వ్యాసార్ధంలో తయారుచేసిన పాదుల్లోనే నీరు పెట్టాలి. దీనివల్ల 50శాతం దిగుబడి పెరు గుతుంది. ఎండాకాలంలో మొక్క చుట్టూ ఉన్న పాదును ఎండిన ఆకులతో మల్చింగ్ చేయాలి. కొత్తగా నాటిన మొక్కలు ఊతం ఇచ్చే చెట్టుకు అంటు కొని ఉండేలా పురికొసతో కట్టాలి. నవంబరులో తీగల చుట్టూ మట్టిని తవ్వి మొక్కల చుట్టూ ఎగదోయాలి. ఊతం ఇచ్చే చెట్లకు ఎక్కువ కొమ్మలు లేకుండా ఫిబ్రవరి- ఏప్రిల్ నెలల్లో కత్తిరించాలి. కాపునిచ్చిన పక్క తీగలను ఒకటి ఉంచి రెండు ఆకులతో 3 కణుపులు ఉండేలా కత్తిరించాలి.. ఇలా సాగుచేస్తే తీగల్లాగా రాకుండా గుబురుగా పెరుగుతుంది. వీటిని బప్పర్స్ అంటారు.

Also Read:

Also Watch:

Leave Your Comments

Oil Palm Cultivation: ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ రికార్డ్ – మంత్రి నిరంజన్ రెడ్డి

Previous article

Call for Applications – Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ఏరువాక ఫౌండేషన్ వ్యవసాయ వార్షిక అవార్డుల దరఖాస్తులకు ఆహ్వానం – 2022

Next article

You may also like