ఉద్యానశోభమన వ్యవసాయం

Moringa farming: మునగ సాగు చేసే వారు కచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..!

0

Moringa farming మునగ వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పైగా మునగాకు మార్కెట్లో డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. మునగ సాగు చేస్తే అధిక లాభాలని స్వల్పకాలంలో పొందొచ్చు

ఏ రకమైన నేల అయినా సరే ఈ పంటను సాగు చేయడానికి బాగుంటుంది. కానీ ఎక్కువగా నీరు నిలిచే పరిస్థితులను తట్టుకోలేదు ఈ చెట్టు.

సాధారణంగా మునగ జనవరి నెలలో పూతకు వచ్చి ఫిబ్రవరీలో కాయలు కోతకు వస్తాయి. కాయలు కాసే సమయంలో నాలుగు నుండి ఐదు రోజులకి ఒకసారి నీళ్ళు పెడితే నాణ్యమైన కాయల దిగుబడి పొందొచ్చు. అదే విధంగా జాగ్రత్తగా చీడ పీడ సమస్యలని రైతుల గమనిస్తూ సరైన సమయంలో సస్యరక్షణ చేపడితే మంచిగా దిగుబడులను పొందొచ్చు.

అయితే మునగ చెట్లు పెంచే వాళ్ళు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు మునగ చెట్టుకి ఎలాంటి సమస్యలూ కలగవు. గొంగళి పురుగులు మునగ చెట్టు కి అన్ని దశల్లోనూ కూడా ఇబ్బందిని కలిగిస్తాయి. ఈ బాధలు తొలగిపోవాలంటే ఒక లీటర్ నీటిలో రెండు మిల్లీ లీటర్ల క్వినాల్ కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.

కాండం కుళ్లు మరియు వేరు కుళ్లు తెగులు:

ఈ సమస్య ఉంటే నివారణకు లీటరు నీటిలో 1గ్రాము కార్బండైజిమ్‌ లేదా 3గ్రాముల డైథేన్‌ ఎం-45 కలిపిన ద్రావణం ఇవ్వండి లేదు అంటే 1శాతం బోర్డోమిశ్రమాన్ని మునగ మొక్క మొదల్లో వేయండి.

             

కాయతొలిచే ఈగ:

పూత దశలో లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల ఫాసలన్‌ కలిపి పిచికారీ చేయాలి. పిందె దశలో లీటరు నీటికి 1మి.లీటరు డైక్లోరోవాస్‌ కలిపి మళ్లీ పిచికారీ చేయాలి. ఇలా చేస్తే ఈ సమస్య ఉండదు.

Also Read: వ్యవసాయ రంగంపై కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్

అలాగే తామర పురుగుల బాధ నుంచి కూడా చెట్టు బయటపడడానికి చూడండి లేదు అంటే ఇబ్బంది వస్తుంది. ఇలాంటి సమస్యలు ఏమి లేకుండా చూసుకుంటే ఖచ్చితంగా మంచి దిగుబడి వస్తుంది. కనుక రైతులు ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మునగ చెట్టు కాయలని ఇవ్వలేదు అలానే నష్టాలే ఉంటాయి.

Leave Your Comments

Success Story: బిగ్ బాస్కెట్, రిలయన్స్ లతో ఒప్పందం కుదుర్చుకున్న మహిళా రైతు కథ

Previous article

Heavy rains: అకాల వర్షాలతో రైతన్న కుదేలు.. చేతికొచ్చిన పంట దెబ్బతిందని దిగులు…

Next article

You may also like