Fruit Plants Planting Methods: పండ్ల మొక్కలను వివిధ పద్ధతుల్లో నాటవచ్చు.వేసే పంట రకం ప్రాంతీయ పరిస్థితులను అనుసరించి మొక్క నాటే పద్దతిని ఎన్నుకోవాలి.
చతుర్రస పద్దతి: ఈ పద్దతిలో రెండు వరుసల మధ్య దూరం, వరుసలలో రెండు చెట్ల మధ్య దూరం సమానంగా ఉంటాయి.సాధారణంగా ఈ పద్దతినే ఎక్కువగా వాడుతారు.ఈ పద్దతి వలన తోటల్లో వరుసల మధ్య చెట్ల మధ్య దున్నడం సులువు. సులువుగా నీటి బోదెలు చేసుకోవచ్చు.
దీర్ఘ చతురస్ర పద్దతి: ఈ పద్దతిలో చెట్ల మధ్య దూరం కంటే వరుసల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది.ఇందులో కేవలం చెట్ల వరుసల మధ్య దున్నడమే సులువుగా ఉంటుంది.
ఉదా: ద్రాక్ష తోట
ద్వంద్వ చతురస్ర పద్దతి ( ఫిల్లర్ పద్దతి): ముఖ్య పండ్ల మొక్కలను చతురస్ర పద్దతిలో నాటుతారు.తర్వాత ప్రతి చతురస్రం మధ్యలో వేరొక స్వల్ప కాలిక ఫలజాతి మొక్కలను నాటుతారు .దీనిని ఫిల్లర్ మొక్క ( filler plant ) అని అంటారు. కాబట్టి ఈ పద్దతిని ఫిల్లర్ పద్దతి అని అంటారు. ముఖ్య ఫలజాతి చెట్లు పూర్తి స్థలాన్ని ఆక్రమించుకొనే వరకు ఫిల్లర్ మొక్కల నుండి ఫల సహాయం పొందవచ్చు.ఆ తర్వాత ఈ మొక్కలను తీసి వేయాలి. ఈ ఫిల్లర్ మొక్కలు కలిపితే వేరొక చతురస్రం ఏర్పడుతుంది.కనుక దీనిని ద్వంద్వ చతురస్ర పద్దతి అని కూడా అంటారు.చతురస్ర పద్దతి కంటే ఈ పద్దతి లో మొత్తం చెట్లు రెట్టింపు సంఖ్యలో ఉంటాయి.
Also Read: Fruits and Vegetables Harvesting: వివిధ పండ్లలో మరియు కూరగాయలలో కోత కోసే సమయం ను ఎలా గుర్తించాలి..!
ముక్కోణం లేక షడ్బుజ పద్దతి : ఈ పద్దతిలో సమ త్రిభుజ కోణాల వద్ద చెట్లు నాటుతారు.మూడు మొక్కలు కలిపితే త్రిభుజం, ఆరు చెట్లు కలిపితే షడ్భుజం ఏర్పడి మధ్యలో ఒక చెట్టు ఉంటుంది.మొత్తం ఏడు చెట్లు ఉండడం వల్ల దీనిని స్టెపులు పద్దతి అని కూడా అంటారు.చతురస్ర పద్దతి కంటే ఈ పద్దతిలో 15% చెట్లు ఎక్కువగా ఉంటాయి. చెట్ల మధ్య దూరం సమానం గా ఉంటుంది.
కాంటూరు పద్దతి: కొండ ప్రాంతాల్లోని వాలును బట్టి అంచెలు అంచేలుగా చదును చేసి ఆ సమతలం మీద చెట్లు నాటుతారు.ఒక్కొక అంచుకు క్రిందిగా గట్లు ఏర్పాటు చేసి నేల కోతను అరికట్టాలి.ఇది వర్షపు నీటిలో ఇంకెలా చేస్తారు.
జత వరుసల పద్దతి: ఇది చతురస్ర పద్దతికి కొంచెం భిన్నంగా ఉంటాయి.ప్రతి రెండు వరుసల మధ్య దూరం తగ్గించి నాటడం వలన ఎక్కువ సాంద్రత లో మొక్కలు సాగు చేయవచ్చు.ఈ మధ్య కాలంలో మామిడి తోటలలో ఈ పద్దతిని పాటిస్తున్నారు.
Also Read: Storing Fruits and Vegetables: పండ్లు మరియు కూరగాయలు నిల్వ చేయుట గల ప్రాముఖ్యత.!