Mango Flowering: మామిడి పండ్లలో రారాజు. మామిడి పూత డిసెంబర్ నుండి జనవరి మధ్య మొదలై ఫిబ్రవరి నెల వరకు వస్తుంది.దాదాపు 8 నెలల పాటు చేసే యాజమాన్య పద్ధతులు ఒక ఎత్తయితే పూత నుంచి కోత వరకు అనగా దాదాపు 4 నెలల పాటు చేపట్టే పద్ధతులు మరో ఎత్తుగా అభివర్ణించవచ్చు. మామిడిలో పూతంతా ఒకేసారి ఆకుండ దశలుగా ఉంటుంది. దీంతో సుమారుగా ఒక నెల మొత్తం పూత కాలం ఉంటుంది. పూత ఒకేసారి రాకపోవడం వలన మామిడిలో సస్యరక్షణ చర్యలు చేయడం, కోత సమయంలో వివిధ దశలలో పండ్లు ఉండడం వలన రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయి.
పూతకు ముందు, పూత దశలో సరైన యాజమాన్యం చేపట్టాకపోవడం వల్ల పూత ఆలస్యంగా రావడం లేదా ఒకేసారి రాకపోవడం గమనించవచ్చు. మామిడిలో పూత డిసెంబర్ నెల ఆఖరి వారంలో విరివిగా వస్తుంది. డిసెంబరు చివరి వారంలో పూమొగ్గలు బయటికి వస్తుంది, పూత మొత్తం రావటానికి జనవరి నెల ఆఖరు దాకా సమయం పడుతుంది. కావున్న పూత, కోత మొదలైన తర్వాత సస్యరక్షణ చేయడం సరైన పద్ధతి కాదు, ఒక వేళా చేసిన దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది.కాబట్టి పూతకు కొన్ని రోజుల ముందు నుండి తోటను గమనిస్తూ యాజమాన్య పద్ధతులు తీసుకొని అధిక దిగుబడులను పొందుటకు ఆస్కారం ఎక్కువ. నవంబర్ నెల నుంచి జనవరి వరకు కొమ్మలను కత్తిరించటం కానీ, దున్నడం కానీ చేయకుండా మామిడి చెట్లకు పూర్తిగా విశ్రాంతిని ఇవ్వాలి.
Also Read: మొక్కలలో సమీకృత పోషక నిర్వహణ యొక్క ప్రాముఖ్యత
ఈ సమయంలో చెట్టుకు ఎలాంటి అంతరాయం కలిగినా పూత ఆలస్యంగా రావడం లేదా పూత మొత్తానికే రాకుండా ఉండడం వలన దిగుబడులు తగ్గుతాయి. వాతావరణ పరిస్థితులు, యాజమాన్య పద్ధతులు పూతను ప్రభావితం చేస్థాయి. సాధారణంగా జూలై – ఆగష్టు నెలలో మామిడి చెట్లకు వచ్చిన ఇగుర్లు ముదిరి, రెమ్మల్లో పూత డిసెంబర్ చివర నుండి జనవరి చివర వరకు వస్తుంది. మామిడి పూత వచ్చే రెండు నెలలు ముందు బెట్ట పరిస్థితులు అవసరం, డిసెంబర్ నెలలో సగటు ఉష్ణోగ్రత 18 – 28° సెంటిగ్రేడ్ తో పాటు రాత్రి ఉష్ణోగ్రత 10 – 13° సెం.గ్రే. ఉంటే పూత విరివిగా పూయడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలం.కావున పూతకు రెండు నెలల మునుపు చెట్లకు నీటి తడులు ఇవ్వడం ఆపివేయాలి. పూతకు ముందు భూమిలో తడి ఉన్నట్లైతే పూత రాకుండా ఆకు ఇగుర్లు వస్థాయి. డిసెంబర్ చివరిలో పూత ఏర్పడిన తరువాత ప్రతి 10- 15 రోజులకు ఒకసారి నెలలో తేమను బట్టి నీటి తడులు అందించాలి.
చలి వాతావరణం ఎక్కువగా ఉండే నవంబర్, డిసెంబర్ నెలలో పూమొగ్గలు రావడం ఆలస్యం అగును.ఇలాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు డిసెంబర్ 15 తరువాత లీటరు నీటికి 10గ్రా. మల్టి – కె (పొటాషియం నైట్రేట్) + 5 గ్రా. యూరియా కలిపి రెమ్మలు బాగా తడిచేలా మొక్కల పైన పిచికారి చేసుకోవాలి. యూరియా, మల్టి – కె లోని నత్రజని, పోటాష్ పోషకాలు సంయుక్తంగా మొగ్గలను ఉత్తేజపరిచి, పూత బాగా రావదాంతో పాటు, పిందె బాగా కట్టడానికి,పెద్ద సైజు, మంచి నాణ్యత కలగడానికి ఉపయోగపడుతాయి.
Also Read: మామిడి సాగుకు అనువైన రకాలు