ఉద్యానశోభ

మల్లె సాగులో మెళుకువలు..

0
Jasmine
Jasmine

సువాసన అందించే పూలలో మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మల్లె పూలు. వీటిలో ఎన్నో విశిష్ట గుణాలూ ఉండటం వల్ల ఈ పంటకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. దేశీయ మార్కెట్లోనే గాక అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి ఆదరణ ఉంది. మనదేశం నుంచి మల్లె పూలను శ్రీలంక, సింగపూర్, మలేషియా, గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ముఖ్యంగా రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు.

సాగులో దిగుబడి, నాణ్యత అనేవి సకాలంలో కొమ్మ కత్తిరింపులు, ఎరువుల యాజమాన్యం, చీడపీడల నివారణ మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మల్లె పూలకు తక్కువకాలం నిల్వ ఉండే స్వభావం ఉండటం వల్ల రైతులు మార్కెట్ చేసుకోవటంలో ఇబ్బందులు పడుతున్నారు, సరైన యాజమాన్యం, ప్యాకింగ్ పద్ధతులను అవలంభించటం వల్ల రైతులు మంచి రాబడిని పొందే అవకాశం ఉంటుంది.

రకాలు:

మల్లెలో సాధారణంగా విడిమల్లె, దొంతరమల్లె, గుండుమల్లె మరియు బొడ్డుమల్లె తరహా పూల రకాలు కలవు.

ప్రవర్ధనం :

కొమ్మ కత్తిరింపుల ద్వారా గాని, అంటూ  మొక్కలు తొక్కడం ద్వారా గాని ప్రవర్ధనం చేస్తారు.

నాటటం:

మల్లె మొక్కలను తేలికపాటి నేలల్లో నాటాలి. జూన్ – డిసెంబర్ వరకు ఎప్పుడైనా నాటవచ్చు. సాయంత్ర సమయాన నాటడం వలన మొక్క బాగా అతుకుంటుంది. అంటుమొక్కలను వరుసల మధ్య మరియు మొక్కల మధ్య 1.25 – 2.0 మీటర్ల ఎడం ఉండేలా నాటుకోవాలి.

కత్తిరింపులు:

మల్లె తోటలో లేత చిగుర్లు నుంచే పూలు వస్తాయి. కాబట్టి ప్రతి సంవత్సరం ఆకును రాల్చడం మరియు కొమ్మ కత్తిరింపులు తప్పనిసరిగా చేపట్టాలి. కొమ్మలు కత్తిరించడానికి 10 – 15 రోజుల ముందు నీరుకట్టడం ఆపేయాలి.

నీటి యాజమాన్యం:

కొమ్మ కత్తిరింపుల తర్వాత నీరు కట్టడం వలన మొక్కలు కొత్తగా చిగురిస్తాయి. నేల స్వభావాన్ని బట్టి 8 – 10 రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి. డ్రిప్ ద్వారా కూడా నీటి సదుపాయం కల్పించవచ్చు.

ఎరువులు:

ప్రతి మొక్కకు 8 – 10 కిలోల పశువుల ఎరువుతోపాటు 60 – 120 గ్రా. నత్రజని, 120గ్రా. భాస్వరం మరియు పొటాష్ ఎరువులను మొదటి కొమ్మ కత్తిరింపులు చేసిన వెంటనే వేయాలి. తదుపరి సూచించిన మోతాదును దఫాలుగా వేయటం మంచిది.

దిగుబడి:

పూల దిగుబడి పెంచుటకు లీటరు నీటికి 2.5 గ్రా.ల జింక్ సల్ఫేట్, 5 గ్రా.ల మెగ్నీషియం సల్ఫేట్ సూక్ష్మ ధాతువులను కలిపి రెండు, మూడు దఫాలుగా పిచికారీ చేయాలి. మొక్కలు నాటిన 6 నెలలు తర్వాత పూత ప్రారంభమయి మొక్క పెరిగే కొద్ది దిగుబడి అధికమవుతుంది. ఎకరానికి 3 – 4 టన్నుల దిగుబడి పొందవచ్చు.

Leave Your Comments

వేసవిలో కూరగాయ పంటలలో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు..

Previous article

ప్రకృతి వ్యవసాయం చేయు విధానం..

Next article

You may also like