Mango Branch Pruning: మామిడి పంటకు మన దేశం ప్రసిద్ధి, అంతేకాకుండా మామిడి సాగులో మన దేశం మొదటి స్థానంలో ఉండగా ఉత్పత్తిలో రెండో స్థానం ను ఆక్రమించింది. అంతేకాకుండా పండ్లకు రారాజుగా మామిడి పేరుగాంచింది. ప్రపంచ ఉత్పత్తిలో మన దేశం వాటా 65 శాతం, అలాగే ఉత్పత్తిలో మన దేశం ముందు ఉన్నప్పటికీ ఉత్పాదకతలో మాత్రం చాలా వెనుకబడి ఉన్నారు. అంతేకాకుండా ఉత్పత్తి అనేది హెక్టారుకు 8.1 టన్నుల నుండి 5.5 టన్నులకు పడిపోయింది. మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో మామిడి రకాల లభ్యత మరియు వైవిధ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ మార్కెట్లో మన వాటా పెంచడానికి, ఉత్పత్తి మరియు ఉత్పాదకత ను పెంచడానికి కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించవచ్చు
మొక్కై వంగనిదే మానై వంగదు
కాయలను కత్తిరించడం వలన అనేక లాభాలున్నాయి. మామిడి కాయలు ప్రతి సంవత్సరం నిలకడగా కాపు కాస్తుంది కాబట్టి చెట్టుకు గాలి వెలుతురు బాగా సోకి దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. మరియు తోటలో అంతర కృషి పనులు చేయడానికి అనువుగా ఏర్పడుతోంది. అంతేకాకుండా నాణ్యమైన పండ్ల ఉత్పాదకత పెరుగుతుంది. చీడ పీడల బెడద తగ్గుతుంది. చెట్టు ఎత్తును అదుపులో ఉంచుకోవచ్చు మొక్కై వంగనిదే మానై వంగదు అనే సామెత మన అందరికి తెలిసిందే. మొగ్గ దశలోనే మామిడిని మంచి ఆకారంతో పెంచుకోవాలి.
మొక్క మొదలు నుండి 70 సెం. మీ. ఎత్తులో కాండాన్ని అక్టోబర్-నవంబర్ నెలల్లో కత్తిరించాలి. తర్వాత అక్కడి నుంచి తొలి కొమ్మలు పెరుగుతాయి. నాలుగు వైపులా పెరిగిన 4 ప్రధాన కొమ్మలను మాత్రమే పెరగ నిచ్చి 1 మీ. పొడవు పెరిగిన తర్వాత 70 సెం. మీకు కత్తిరిస్తే అక్కడనుండి ద్వితీయ కొమ్మలు పెరుగుతాయి. ఈ విధంగా చేయడం వలన చెట్టు నిటారుగా పెరగకుండా గుబురుగా పెరిగి దిగుబడి పెరుగుతుంది.
Also Read: Biochar: పంటల నేల సారాన్ని పెంచుతున్న బయోచార్.!
కాపు కు వచ్చిన తోటల్లో కత్తిరింపులు
మామిడి కాయలు కొమ్మల చివర్ల గుత్తులుగా కాస్తాయి. కనీసం 6-8 వారాల వయస్సు పై బడిన కొమ్మలపై మాత్రమే పూత వస్తుంది. అంతకన్నా తక్కువ వయస్సు ఉన్న కొమ్మల్లో పూత రాదు. కాబట్టి కాయ కోత వెంటనే కత్తిరింపులు చేస్తే కొత్త చిగుళ్లు పెరిగి పూత వచ్చేటప్పటికి వాటి వయస్సు 8 వారాల పైనే ఉంటుంది. కాపు కు వచ్చిన తోటల్లో రెండు సార్లు కత్తిరింపులు చేసుకోవాలి. మన రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మామిడి తోటలు 50-60 సంవత్సరాలు పైబడిన ఉండటం వలన వాటి ఉత్పత్తి తగ్గి ఆదాయం రావడం లేదు. ఈ ముదురు తోటలు ఎత్తుగా ఉండటం వలన సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి కూడా అనువుగా ఉండక పోవడం వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి.
అందువలన రైతులు వాటి యాజమాన్యం చేపట్టలేక ముదురు తోటలో తొలగించి వాటి స్థానంలో వేరే పంటలు అంటే ఆయిల్ పాం తోటలు, మళ్ళీ అంటు కట్టిన మామిడి మొక్కలను నర్సరీలు నుండి తెచ్చుకొని వేసుకుంటున్నారు. మళ్ళీ కొత్తగా వేసుకోవడం వలన పెట్టుబడి ఎక్కువ అవటమే కాకుండా వాటి నుండి ఆదాయం పొందడానికి కనీసం 5 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ నష్టాన్ని భరించాలంటే కొత్త మొక్కలు వేసుకోకుండా ఉన్న ముదురు తోటలని పూర్తిగా తొలగించకుండా వాటి వేరు వ్యవస్థను ఉపయోగించుకొని ఎక్కువ పెట్టుబడి లేకుండా ప్రూనింగ్ పద్ధతి ద్వారా వాటిని సులభంగా పునరిద్ధరించుకొని మంచి దిగుబడులు పొందవచ్చు.
Also Read: Cut Flowers Farming: తక్కువ ఖర్చుతో కాసుల వర్షం కురిపిస్తున్న కట్‌ఫ్లవర్స్ .!