Jasmine Pruning: మహిళల కురులకు అందాన్ని ఇవ్వటంతో పాటు, సువాసనలు వెదజల్లే మల్లపూలకు మార్కెట్లో మంచి గిరాకీ లభిస్తుంది. దీంతో చాలా మంది రైతులు తెలుగు రాష్ట్రాల్లో మల్లెతోటల సాగును చేపడుతున్నారు. వాణిజ్య సరళిలో చేపట్టే ఈ మల్లె తోటల సాగులో సరైన యాజమాన్య పద్దతులు పాటిస్తే మంచి దిగుడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. మల్లెలో సాధారణంగా విడిమల్లె, దొంతమల్లె, గుండుమల్లె, బొడ్డుమల్లె అనే రకాలను రైతులు సాగు చేస్తున్నారు. మల్లెను కొమ్మ కత్తిరింపుల ద్వారా గానీ , అంటు మొక్కలు తొక్కటం ద్వారాగానీ ప్రవర్ధనం చేయవచ్చు. మల్లెలకు వచ్చే సువాసనలు ఏపువ్వులకు రావు. దాని అందం కూడా వేరు. చాలా మంది సినిమాల్లో పాటలు కూడా మల్లెపువ్వలు మీద ఎక్కువగా పెట్టుకుంటారు. అంత పేరు ఉంది. ఆ పువ్వులకు మల్లెలో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. అవి గుండు మల్లెలు. ఈరకం మల్లె మార్చి నుంచి సెప్టెంబర్ వరకు పూలను ఇస్తాయి. జాజిమల్లె ఈ రకం మార్చి నుంచి అక్టోబర్ వరకు పూలను ఇస్తాయి. కాగడమల్లె ఈరకం పూలు జూన్ నుంచి పిబ్రవరి వరకు పూలను ఇస్తాయి. సాధారణంగా మల్లి నాటిన మూడో సంవత్సరం నుండి వ్యాపార సరళిలో దిగుబడి ప్రారంభమై 12-15 సంవత్సరాల వరకు దిగుబడినిస్తోంది జనవరి నెల నుంచి మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి తోపాటు పూల నాణ్యత బాగుంటుంది.
మల్లెలో కొత్తగా పుట్టిన రెమ్మలపై పూలు వస్తాయి. కాబట్టి పూలు పూసే కొమ్మలు, రెమ్మలు ఎక్కువ సంఖ్యలో పొందడానికి, ఆధిక పూల దిగుబడికి కత్తిరింపులు ఖచ్చితంగా ఉండాలి. కత్తిరింపులు చేసే ముందు మల్లెతోటలకు నవంబర్ నుంచి నీరు పెట్టకుండా చెట్లను నీటి ఎద్దడి గురిచేసి వాడపెట్టి ఆకులు రాలేలా చేయాలి. జనవరి నెల వరకు సహజంగానే చలికి ఆకులు రాలుతాయి. కొమ్మలన్నింటిని కలిపి తాడుతో కడితే ఆకులు తర్వగా రాలుతాయి. మల్లెతోటలోకి మేకలను వదిలిన కూడా అవి ఆకులను తింటాయి. కొన్ని అకులు రాలకుండా ఉంటాయి. అప్పుడు వాటిని మనుషులతో తీయించాలి. ఆకులు రాలిన తర్వాత ఐదు సంవత్సరాలలోపు వయసున్న తోటల్లో కొమ్మలు భూమి నుంచి రెండు అడుగులు, ఐదు సంవత్సరాల వయసున్న తోటల్లో మూడో అడుగులు ఉంచి మిగిలిన పైభాగాన్ని కత్తిరించాలి. ఎండుకొమ్మలను బలహీనంగా ఉన్న కొమ్మలను తొలగించాలి.
Also Read: Pearl Millet Seed Production: సజ్జ విత్తనోత్పత్తిలో ఎలాంటి మెళకువలు అవసరం.!
కొమ్మలు కత్తిరింపుల తర్వాత తేలకపాటి తడి ఇవ్వాలి. ఒకసారి పూలు కోసిన తర్వాత ఏడు పది రోజులకు నీరు పారించకుండా చెట్లు కొద్దిగా వాడేలా చేసి తర్వాత నీరు పారిస్తే పూల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. నేల స్వభావాన్ని బట్టి ఐదు-ఆరు రోజులకు ఒకసారి పూలు కోసే సమయంలో నీరు పారించాలి. కత్తిరింపులు పూర్తి అయినా తరువాత మొదటి తవ్వకం చేసిన వారం రోజులు తర్వాత ఒక్కొక్క చెట్టుకు 10కిలోల పశువుల ఎరువు 500 గ్రాములు వేప పిండి లేదా ఆముదపు పిండి, 200 గ్రాములు అమ్మోనియం సల్ఫేట్, 200 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్పెట్, 75 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పోటాష్ ను చెట్టు చుట్టూ చిన్న గాడి తీసి అందులో వేసి మట్టితో కప్పించి నీరు పారించాలి.
పూలు పూయటం పూర్తయ్యలోపు నాలుగు సార్లు రసాయన ఎరువులను వాడుకోవాలి. దాని వల్లన పూల దిగుబడి నాణ్యత పెరుగుతాయి. పూర్తిన పెరిగిన మొగ్గల్ని ఉదయం 11 గంటలకు కోయాలి. లేకపోతే పూల నాణ్యత పూర్తిగా తగ్గిపోతుంది. దగ్గర మార్కెట్ కోసం గోన సంచులను కోసి చిన్న సంచులుగా కుట్టి, వీటిలో రెండు, ఐదు కిలోల వరకు మొగ్గలని ప్యాకింగ్ చేయాలి. తర్వాత సంచుల్ని నీళ్ళల్లో ముంచి తీసి రవాణా చేయాలి. దూరప్రాంతాల కొరకు వెద్దరు బుట్టలను కార్డ్ బోర్డ్ పెట్టెలను వాడవచ్చు. తాజాదనం కోసం పూసిన మొగ్గలు ఎక్కువ కాలం నిలువ ఉండి తాజా సుహాసనలు రెండు మూడు రోజులు వెదజల్లుతుండాలంటే లీటర్ నీట్ గా 10 గ్రాముల సుక్రోస్ లేదా 50 గ్రాముల బోరిక్ యాసిడ్ లేదా ఒక గ్రా అల్యూమినియం సల్పెట్ కలిపిన ద్రావణం లో పది నిమిషాల నుంచి ఆరబెట్టి తర్వాత ప్యాకింగ్ చేయాలి.
Also Read: Tomato Pests and Diseases: టమాట పంటలో తెగుళ్లని ఎలా నివారించుకోవాలి.?