- పూలను పూజకు పెండ్లిలో ఇతర సాంఘిక పరమైన వేడుకల్లో ఎక్కువగా వాడతారు.
- వాణిజ్య పరంగా పూలను కట్ ( cut flowers ) గా ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తున్నారు.
- పూల నుండి సేకరించిన నూనెలు ఇతర కాస్మోటిక్స్ తయారీలో విరివిరిగా వాడుతున్నారు.
- వాణిజ్య పరంగా పూల మొక్కలు నాటి విత్తనాలు అమ్మడం వలన చాలా మందికి జీవనోపాధి లభిస్తుంది.
- వాణిజ్య పరంగా ఆంధ్రప్రదేశ్ లో గులాబీ, మల్లె,కనకాంబరం, చామంతి , బంతి సాగులో ఉన్నాయి.
అలంకరణ తోటలు: అందానికి అలంకరానికి వివిధ మొక్కలను సక్రమైనా పద్దతిలో నిర్ణీత ప్రదేశంలో పెంచడాన్ని అలంకరణ తోటలు అంటారు.అలంకరణ తోటలు, పార్కుల వల్ల ఎక్కువ జనాభా గల పట్టణాలలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించుటకు విలగును. అంతే కాకుండా పట్టణాలు చూడటానికి అందంగాను మరియు కాలుష్యం నుండి రక్షింపబడుతుంది.
కంచే: ఇది తోటలో పూర్తి చివరగా ఉండే ఫీచర్ కంచె మాములుగా గోడ లేదా పైరుతో ఏర్పరుస్తారు. ఇలా కాకుండా బాగా పెరిగే మొక్కలతో నీటి ఎద్దడి ని తట్టుకోని త్వరగా ప్రవర్ధనం జరుపుకునేవిగా ఉండాలి. ఉదా : కాజురైన, రేయిన్ ట్రీ,ఆశోక, గానుగ…..
హడ్జ్: తోటలను వివిధ భాగాలుగా విభజించుటకు గాను మరియు సందర్శకులను నేరుగా వివిధ భాగాలుగా దారి ఇరుపక్కకు పెంచే మొక్కలను హెడ్జ్ అంటారు. వీటిని సాధారణంగా 3-4 అడుగుల ఎత్తు వరకు కత్తిరిస్తారు. ఉదా : ఆకాలిఫ, భోగన్ విలియం, మందారం, బిళ్ళగన్నేరు….
ఎడ్జ్: ఇందులో ఎడ్జ్ మాదిరిగా మొక్కలను వరుసలో పెంచుతారు.కాని మొక్కలను ఒక అడుగు ఎత్తులో కత్తిరిస్తారు.వీటిని సాధారణంగా పూల మడి చుట్టూ లేదా లాన్ చుట్టూ పెంచుతారు.ఉదా :పెలియా, డ్యూరంతా ,……
బాటలు: ప్రతి గార్డెన్ లో ఈ బాటలు అనేవి వంకరలుగా కాకుండా సక్రమంగా ఎధైన -ఫిచర్ ను చూసేదిగా ఉండాలి. దీనిని తోట కన్నా కొద్దిగా ఎత్తులో ఇటుకలతో కాని లేదా బండ తో గాని అలంకరణంగా ఉండాలి.
Also Read: Terrace Gardening: టెర్రస్ గార్డెన్ మొదలు పెట్టడం ఎలా
లాన్: ప్రతి గార్డెన్ లో కొద్దిగానైన లాన్ ను పెంచడం ఎంతైన అవసరం. దీనిని గడ్డి తో పెంచుతారు.ఇది మనం పెంచే తోటల్లో ప్రతి ఫిచర్ కూడా ల్యాండ్ గా ఉంటుంది. ఈ లాన్ ను పెంచేటప్పుడు ఒక రాకపు గడ్డితోనే పెంచాలి. గడ్డి ఎక్కువగా పెరగనివ్వకుండా లాన్ మూవర్ తో కత్తిరించాలి. సాధారణంగా లాన్ ను పెంచడానికి డూప్ గడ్డిని పెంచుతారు.ఇదే కాక జాపనీస్ కొరియన్ గడ్డిని పెంచి టాల్ పాస్ తయారు చేస్తారు.
పూల మడి: తోటల పూల మడి పెంపకంలో ఎక్కువగా ఏకవార్షికాలను చిన్న చిన్న మాడులు తయారు చేసి పెంచుతారు.ప్రతి మడిలో ఒకే రకమైన పూల మొక్కలను పెంచడం వలన ఆకర్షణ పెరుగుతుంది.పూల మొక్కలను దగ్గర దగ్గరగా నాటడం వలన అడుగున ఉన్న నేల కనిపించక పూలు మాత్రమే కనిపిస్తూ తోటకు అందాన్ని ఇస్తాయి.
టోపియారీ: కత్తిరింపులను తట్టుకొని బాగా ఏదిగి మొక్కలను ఆకర్షణీయంగా వివిధ అకృతి లో కత్తిరించి పెంచడాన్ని టోపియారీ అంటారు.
ఉదా –
అర్చ్: పాకెమొక్కలను తోట యందు ప్రత్యేకంగా వెదురు కట్టెలతో లేదా ఇనుప ఊసలతో లేదా రాతి తో గాని నిర్మాణాన్ని పాకించి కత్తిరించడాన్ని అర్చ్ అంటారు.
పాటరీ: అందమైన పూల మొక్కలను కుండీలో పెంచి తోటలలో అలంకరించే ఫిచర్ ను పాటరీ అంటారు.
Also Read: Flower Price: ఉద్యాన ఉత్పత్తులకు మంచి డిమాండ్