ఉద్యానశోభ

Lemongrass Cultivation: లెమన్ గ్రాస్ పెంచండి ఆదాయం పెంచుకోండి.!

2
Lemongrass
Lemongrass

Lemongrass Cultivation: లెమన్ గ్రాస్ అంటే నిమ్మగడ్డి. లెమన్ గ్రాస్ అనేది నిమ్మ చెట్లకి ఎలాంటి సంబంధం లేదు. అనేక ప్రయోజనాలు ఉన్న ఈ నిమ్మగడ్డి మంచి సువాసన, అందం, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ నిమ్మగడ్డి ఎలాంటి వాతావరణంలో అయిన పెరుగుతుంది. ఈ నిమ్మగడ్డి వంటలో కూడా వాడుతారు. ప్రకృతిసిద్ధగా పెరిగే పంటలో లెమన్ గ్రాస్ ఒకటి. నిమ్మగడ్డిని మొదటిలో భూటాన్‌లో పండించే వాళ్ళు, దీనిలో అనేక ఉపయోగాలు చూసి ఇపుడు మన దగ్గర కూడా పండిస్తున్నారు.

లెమన్ గ్రాస్ సన్నగా, 3 నుంచి 4 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఫిబ్రవరి నుంచి జూలై నెలలో లెమన్‌ గ్రాస్ పంట వేస్తారు. ఈ పంట ఒక సంవత్సరంలో 2 నుంచి 3 కోతలు వరకు పండించుకోవచ్చు. పంట వేసిన నాలుగు నెలల తర్వాత పంట కోస్తారు. పంటకు వచ్చిందని తెలుసుకోనికి దానిని కట్‌ చేసి వాసన చూడాలి. వాసన మంచిగా వస్తే పంట బాగా వస్తుంది. లెమన్ గ్రాస్ రుచి చాలా ఘాటుగా ఉంటుంది.

లెమన్‌ గ్రాస్‌ పంటతో చాలా లాభాలు ఉంటాయి. ఒక మొక్క ధర రెండు రూపాయలు, ఒక ఎకరంలో 5వేల మొక్కలు నాటవచ్చు. ఒక ఎకరంకి 15 వేల ఖర్చు అవుతుంది. ఒకసారి నాటితే 6 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటాయి. ఒక సంవత్సరం పెట్టుబడి పెడితే మళ్ళి పెట్టుబడి పెట్టె అవసరం ఉండదు. ఒక ఎకరాకు ఏటా రూ.50వేల వరకు ఆదాయం వస్తుంది.

Also Read: Flying Robot: కూలీలు లేకుండా పండ్లను కోయడం ఎలా ?

Lemongrass Cultivation

Lemongrass Cultivation

లెమన్ గ్రాస్ నుంచి ఆయిల్‌, కాస్మొటిక్స్‌, సోప్స్‌, ఆయిల్స్‌, మెడిసిన్స్‌, పర్ఫ్యూమ్స్‌, రూమ్‌ ఫ్రెష్‌నర్స్‌, డియోడరెంట్‌ తయారు చేస్తారు. లెమన్ గ్రాస్ ఆయిల్‌కు మార్కెట్‌లో చాల డిమాండ్ ఉంది కిలోకు రూ.1500 ఉంటుంది. లెమన్ గ్రాస్ లో సీ, డీ, ఈ విటమిన్లు ఉండటంతో రోగ నిరోధక శక్తి పెరగడంలో సహాయపడుతుంది.లెమన్ గ్రాస్ ఔషధాలు తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ మొక్క నొప్పి, వాపు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీనిలో అనేక యాంటీ ఆక్సిడెంట్స్‌  ఉంటాయి. ఈ మొక్కలను ఆర్థరైటీస్‌ వ్యాధికి ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఒత్తిడి, ఆందోళనకు గురైనప్పుడు లెమన్‌ గ్రాస్‌ టీ తాగితే ఒత్తిడిని తగ్గిస్తుంది. దీని వాసన పీల్చడం వల్ల మనస్సుకు ప్రశాంతత అనిపిస్తుంది. నిమ్మ గడ్డి అజీర్ణం, మలబద్ధకం, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. నిమ్మగడ్డి బ్యాక్టీరియా, వైరస్‌, శిలీంధ్రాల శ్రేణికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. చర్మవ్యాధులకు కూడా లెమన్‌ గ్రాస్‌ ఉపయోగిస్తారు.

లెమన్‌ గ్రాస్‌ను పంట పొలాల్లో, ఇంటి దగ్గర, కొండ ప్రాంతాల్లో, పండించవచ్చు. రసాయనాలు, ఎరువులు ఉపయోగించాల్సిన అవసరం లేదు. పశువులు, కోతుల బెడద ఉండదు. పంటను కీటకాలు, పురుగులు ఆశించవు. ఒక్కసారి నాటితే ఆరేండ్ల వరకు పెట్టుబడి అవసరం లేదు. ఎరువులు, రసాయనాలు వాడకుండా ఈ మొక్కను పెంచడం వల్ల భూమి సారం పెరుగుతుంది. పంట చేతికొచ్చాక.. దగ్గరలోనే మిషన్లు పెట్టి ఆయిల్‌ తీయొచ్చు.

Also Read: Harvesting Turmeric: పసుపు బంగారం పండాలంటే ఇదే సమయం..

Leave Your Comments

Flying Robot: కూలీలు లేకుండా పండ్లను కోయడం ఎలా ?

Previous article

Minister Niranjan Reddy: వ్యవసాయానికే తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యం – మంత్రి నిరంజన్ రెడ్డి

Next article

You may also like