Korra Cultivation: చిరుధాన్యమైన కొర్ర ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా సాగవుతున్న పంట. కొర్ర మెట్ట వ్యవసాయానికి, ఆరుతడి కింద సాగుకు ఎంతో అనుకూలం. కొర్రలో మధ్యస్థ, స్వల్పకాలిక రకాలైన శ్రీలక్ష్మీ, నరసింహరాయ, కృష్ణదే వరాయ, SIA 3085, SIA 316, సూర్యనంది ప్రసాద్ రకాలు ప్రస్తుతం రైతులకు అందు బాటులో ఉన్నాయి. ఈ రకాలన్నీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం. నంద్యాల నుంచి విడుదలై దేశమంతా వ్యాపిం చాయి. అత్యల్పకాలిక కొర్ర రకం SIA 3222 28-32 రోజుల్లో పూతకు వచ్చి కేవలం 58-62 రోజుల్లో పక్వతకు వస్తుంది.
స్వల్పకాలిక పంట: ఎలాంటి పిలకలు లేకుండా ఏకకాండం ఉండటం వల్ల యాంత్రీకరణకు అనువైన రకం. గింజ దిగుబడి సుమారుగా ఎకరానికి 6-8 క్వింటాళ్లు వస్తుంది. చొప్ప కూడా ఎకరాకు రెండున్నర టన్నుల వరకు వస్తుంది. తక్కువ కాలంలో, తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు కూడా కచ్చితమైన గింజ, చొప్పను ఇచ్చు రకం. అతి స్వల్పకాలంలో పంటను వస్తుంది గనుక ఈ రకాన్ని పంటల సరళిలో వినియోగించుకోవచ్చు. నల్లరేగడి భూముల్లో లాభ దాయక పంటయిన శనగ కర్నూల్ జిల్లాలో దాదాపుగా 2 లక్షల హెక్టార్లలో సాగులో ఉంది. అక్టోబరులో విత్తనం వేసి మూడు నెలలకు పంటను కోస్తారు. ఈ కొర్ర రకాన్ని వర్షాధారంగా ఖరీఫ్ లో సాగు చేసుకొని అదనంగా గింజ, చొప్ప దిగుబడి, అదనపు ఆదాయం పొందే అవకాశముంది.
వేసవిలో సాగుకు: వేసవి కాలంలో తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు కూడా ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు. కేవలం 30 రోజులు కాపాడుకోగలిగితే పంట దిగుబడి వస్తుంది. ఈ రకాన్ని ఏడాదిలో ఎప్పుడైనా వేసుకోవచ్చు. తక్కువ నీటి లభ్య తతో (300 మి.మీ) పంటను తీయవచ్చు. ఎకరాకు 3 కిలోల విత్తనం అవ సరం. విత్తనాలను వరుసల మధ్య 22.5 సెం.మీ., మొక్కల మధ్య 7.5 సెం.మీ. దూరంలో గొర్రుతో విత్తుకోవాలి. ఎకరాకు 2 లక్షల 37 వేల మొక్కలు ఉండాలి. ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు వేసి ఆఖరి దుక్కిలో కలియదున్నాలి. ఎకరాకు 8 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం విత్తేటప్పుడు వేయాలి. నాటిన 3-4 వారాల తర్వాత అంతరకృషి చేసి, తడి ఇచ్చి పైపాటుగా మరో 8 కిలోల నత్రజనిని వేసుకోవడం వల్ల పంట చక్కగా పెరుగుతోంది. విత్తిన రెండు వారాల్లోపు ఒత్తుగా ఉన్న మొక్కలను తీసివే యాలి. కలుపు నివారణ, అంతరకృషిలో భాగంగా 15-20 రోజుల్లో పంటలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. కొర్ర రకాలు అన్నీ దాదాపు 28- 32 రోజుల్లో పూత దశకు వస్తాయి. ఆ సమయంలో పంట బెట్టకు లోనుకా కుండా చూసుకోవాలి. గింజ పాలుపోసుకొనే దశను దాటి 58-62 రోజుల్లో పరిపక్వతకు వచ్చి కోతకు సిద్ధమవుతుంది. వరికోత యంత్రాలతో జల్లెడ మార్చుకొని పంటను కోయవచ్చు లేదా కూలీలతో పంటకోసి పొలంలో గింజలు ఆరాక నూర్పిడి యంత్రాల సాయంతో గింజలను వేరుచేసుకోవచ్చు. గింజల్లో తేమశాతం 10-12 ఉన్నప్పుడే దీర్ఘకాలం నిల్వ ఉంచుకోవచ్చు.
Also Read: Finger Millet Importance: రాగి ప్రాముఖ్యత.!
సస్యరక్షణ: సస్యరక్షణ అనేది కొర్ర పంటలో చాలా తక్కువ. పురుగులు, తెగుళ్ళు తక్కువగా ఆశిస్తాయి. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయాలను మేధావులు సిఫారసు చేస్తున్నారు. చిరుధాన్య పంటల సాగు ఎంతో అనుకూలం. సంప్రదాయ పద్ద తుల్లో క్రిమికీటకాలను ఆరికట్టుకొని రైతులు సాగు ఖర్చును తగ్గించుకుంటూ నేల, నీరు, గాలి నాణ్యతను పరిరక్షించుకోవాలి.
అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు ఉన్నప్పుడు పలు రకాల పురుగులు, తెగుళ్లు ఆశిస్తాయి. నివారణకు సిఫారసు చేసిన జాగ్రత్తలు తీసుకోవాలి. పురుగులు, తెగుళ్ల మందులను అవసరం మేరకు చివరి ప్రయత్నంగా వాడాలి. సస్యరక్షణతో మంచి ఫలితాలు పొందాలంటే ఒక ఎకరాకు 200 లీటర్ల నీటితో సిఫార్సు చేసిన క్రిమినాశక / శిలీంద్రనాశక మందులను కలి పిన ద్రావణాన్ని పిచికారి చేయాలి.
గులాబి రంగు పురుగు: లార్వాలు మొవ్వును తొలచి తినడం వల్ల మొవ్వు చని పోతుంది. పూతదశలో ఆశిస్తే వెన్నులు తెల్ల కంకులుగా మారుతాయి. లీటరు నీటికి 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ కలిపి పిచికారి చేసి నివారించుకోవాలి.
చెదలు: భూమిలో ఉన్న కొర్ర వేర్లను చెదలు ఆశించటం వల్ల మొక్కలు వాడి చనిపోతాయి. వీటి నివారణకు చివరి దుక్కిలో ఫాలిడాల్ 2 శాతం పొడిమం దును ఎకరాకు 10 – 12 కిలోల వంతున మట్టిలో బాగా కలిసేలా వేసి పంటను కాపాడుకోవాలి.
కాండం తొలచు పురుగు: ఈ పురుగు కాండాన్ని తొలచటం వల్ల మొక్కలు సరిగా ఎదగక చనిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ కలిపి రెండుసార్లు 20-30 రోజుల మధ్య పిచికారి చేయాలి.
Also Read: Pesara and Millet Crop: పెసర, మినుము పంటను ఆశించే వివిధ రకాల పురుగులు వాటి యాజమాన్యం.!
Also Watch: