ఆంధ్రప్రదేశ్ఉద్యానశోభతెలంగాణవ్యవసాయ పంటలు

కాసులకల్పతరువు–కనకాంబరం

0

 

  • కనకాంబరంలో వాణిజ్యపరంగా సాగు చేయబడుతున్న జాతి “క్రాస్సాండ్రా ఇన్ఫండిబులిఫార్మిస్”( CrossandraInfundibuliformis). దక్షిణ భారతదేశంలో కనకాంబరాన్ని వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో 2,917 హెక్టార్లలో, 10,827 టన్నుల దిగుబడితో సాగులో ఉంది.
  • ఈ జాతి మొక్కలు 30-90 సెం.మీ. ఎత్తు పెరిగి నారింజ రంగు పూలను పూస్తాయి. ఈ జాతి మొక్కల్లో వెన్ను (పూలకాడ) ఒక దానిపై ఒకటి అనుకొని ఉండి. అధిక దిగుబడులనిస్తాయి. ఈ ఒక్క జాతేకాక ‘ క్రోసాండ్రా ‘ ముదురు పసుపు రంగు పువ్వులను, ‘క్రాసాండ్రా సిలోటిక’ ఎరుపు రంగు పూలను పూసే జాతులు. కనకాంబరం అన్ని కాలాల్లో పూలు పూసే బహువార్షిక పూల పంట. కావున రైతు సోదరులు మేలైన రకాలని, రంగులను ఎన్నుకొని, మొక్కలు నాటుకొని రెండు – మూడు సంవత్సరాల వరకు మంచి దిగుబడులుపొందవచ్చు.

      కనకాంబరంలోరకాలు:

  • కనకాంబరంలో నారింజ, గులాబి, ఎరుపు, పసుపురంగు రకాలేకాక రెండు రంగులు కలగలిపి నీలి, తెలుపు రకాలు కూడా సాగులోవున్నాయి. ‘ఆరెంజ్ కోస్తాంధ్ర’ రకం నారింజ రంగు పూలను, ‘జెల్లికోసాంద్ర’ ముదురు నారింజ రంగు పూలను, ‘టిటియాఎల్లో’ రకం పసుపు రంగు పూలను, నెబ కాలిస్ రెడ్ రకం ఎరుపు రంగు పూలను, లక్ష్మి రకం నారింజ రంగు పూలను పూస్తాయి. డా. ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ రకం అధిక నిల్వ స్వభావం కలిపి ఎక్కువ దూరం రవాణాకు అనుకూలమైన ముదురు ఎరుపు రంగురకం. అంతే కాకుండా ముదురు ఎరుపు రంగు పూలను ఇచ్చే ‘మారుపుల్అరసి’, అధిక దిగుబడినిచ్చే రకం. ఇలాంటి రకాలు సాగుచేయటం వలన సంవత్సరం పొడవునా పూలను పొందవచ్చు. ఇటీవల కాలంలో శాఖీయంగా ప్రవర్ధనంచెందే కొన్ని రకాలనును ఐ. ఐ.హెచ్. ఆర్ బెంగుళూరు వారు విడుదల చేశారు. వాటిలో ప్రముఖ్యమైనవి అర్క అంబారా, అర్క కనక, అర్క శ్రేయ, అర్క శ్రావ్య , అర్క చెన్న.

      సాగుకుఅనుకూలమైనవాతావరణపరిస్థితులుమరియునేలలు:

  • ఉష్ణ మండలపు పంట. వాతావరణంలో హెచ్చు, తగ్గులను బాగా తట్టుకుంటుంది. 30° సెల్సియస్ ఉష్ణోగ్రత అనుకూలం.మనరాష్ట్రంలోఅధికతేమ, వేడికల్గినప్రాంతాలుకనకాంబరంసాగుచేయుటకుఅనుకూలం. ముఖ్యంగాకోస్తాజిల్లాలుసాగుచేయుటకుఅనువైనవి. నీటిలభ్యతఉన్నప్రాంతాల్లోకూడాదీనినివిజయవంతంగాసాగుచేసుకోవచ్చు. అన్నిరకాలనేలల్లోసాగుచేయవచ్చు. సారవంతమైనఒండ్రునేలలుఅనుకూలం.క్షారగుణంగలనేలలుఅనుకూలంకావు. నెమటోడ్స్ ఉన్ననేలలోసాగుచేయరాదు.
  • సారవంతమైనఅధికసేంద్రియపదార్థంగలఎర్రనేలలోఉదజనిసూచిక 6 నుండి 7 మధ్యనేలలుసాగుచేయుటకుఅనుకూలం. అధికఆప్లు,క్షారలక్షణాలుకల్గిననేలల్లోమరియునులిపురుగుతాకిడిఅధికంగాఉన్ననేలల్లోఈపూలసాగుచేస్తేనాణ్యమైనదిగుబడులురైతులుపొందలేరు.

      ప్రవర్తనo:

  • విత్తనం మరియు కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. ఎకరాకు సుమారు 2 కిలోల విత్తనం అవసరం.
  • అధికదిగుబడినిచ్చేరకాన్నివిత్తనంద్వారాప్రవర్ధనంచేస్తారు. విత్తనాన్ని మే-జూన్ నెలల్లో విత్తి ఆగష్టు-సెప్టెంబరు మాసాల్లో నాటుకోవాలి. మొక్కలను 30×30 సెం.మీ. ఎడంలో నాటుకోవాలి.
  • పువ్వులుపూసిన 55-60 రోజులతర్వాతవిత్తనాలుపక్వదశకువస్తాయి. కావునఅటువంటిపూలనుపూలవెన్నులనుండితీసుకొనికిలోవిత్తనాలకు 2 గ్రా. కాప్టాన్ లేదా బావిస్టిన్ పొడికలిపినారుమడిలోవిత్తుకోవాలి.

      ప్రధానపొలంతయారీమరియునాటుకునేవిధానం:

  • విత్తనాలను 1 మీ. వెడల్పు 15 సెం.మీ. ఎత్తుగలనారుమడినితయారుచేసికొనివరుసల్లోవిత్తుకోవాలి. నారుమడిలోమొక్కలపెరుగుదలగమనించి, రెండువారాలకొకసారికాపర్ఆక్సీక్లోరైడ్ మందును 3 గ్రా. లీటరునీటికికలిపిపిచికారి3 చేయటంలేదామడిలోపోయటంచేయాలి. 4-5 ఆకులుతొడిగినతరువాతవెంటనే 50-60 రోజులువయస్సులమొక్కలనుపొలంలోనాటుకోవచ్చు.

      ఎరువులుమరియునీటియాజమాన్యం:

  • అంతేకాకుండావిత్తనాలను5×15 సెం.మీ. 100 గేజ్ మందం గల పాలిబ్యాగ్లోకూడావిత్తుకోవచ్చు. పశువులఎరుపు, ఎర్రమట్టిని 1:3 భాగాలుకలుపుకొనిపాలిబ్యాగ్లోనింపుకొనివిత్తనములనుప్రతిబ్యాగ్లోరెండువిత్తనాలనువిత్తిమొక్కలనుప్రవర్ధనంచేసుకోవచ్చు. ఇలాచేయటంవలననాణ్యమైన, బలమైనమొక్కలనుపొందవచ్చు.
  • ‘డిల్లికోసాంద్ర’ రకాన్నికత్తిరింపులుద్వారాప్రవర్ధనంచేస్తారు. మార్చినుండిజూన్ మాసంలో 5-8 సెం.మీ. గలకొమ్మకత్తిరింపులనుసరిసమానంగాతయారుచేసినఇసుకమరియుమట్టిమిశ్రమంలోనాటివేర్లనుపొందవచ్చు. అధికవేర్లువచ్చుటకుకొమ్మలను 3 గ్రా. ఇండోల్ బ్యూట్రిక్ ఆమ్లంనులీటరునీటికికలిపినమిశ్రమంలో 2-3నిమిషాలుఉంచినాటుకుంటేఎక్కువవేర్లురావటానికిఆస్కారంఉంటుంది.
  • మొక్కలనునాటుకొనుటకుపొలాన్ని 4,5 సార్లుబాగాకలియదున్నాలి. ఎకరాకు 10-15 టన్నులపశువులఎరువుఆఖరిదుక్కిలోవేసికలియదున్నాలి. పశువులఎరువుతోబాటు 20-30 కిలోలయూరియా, 100 కిలోలసింగిల్ సూపర్ ఫాస్పేట్ మరియు 50 కిలోలమ్యూరేట్ఆఫ్ పొటాష్ ను చివరిదుక్కిలోవేయాలి. పైపాటుగాయూరియానురెండుదఫాలుగామొక్కలునాటినమూడునెలలకుమరియుఆరునెలలకు 20 కిలోలచొప్పునవేయాలి.
  • కనకాంబరంలోఇనుముధాతులోపంఎక్కువకనబడుతుంది. కనుకదీనినివారణకు 5 గ్రా. ఫెర్రస్ సల్ఫేట్ను 20 గ్రా. యూరియాతోకలిపిమొక్కలపైపిచికారిచేయాలి.
  • నీటియాజమాన్యం: కనకాంబరం నీటి ఎద్దడిని తట్టుకొంటుంది. అయినప్పటికి వాణిజ్య సరళిలో సాగుచేస్తే అవసరాన్ని బట్టి 10-15 రోజుల వ్యవధిలో నీటి తడులు యివ్వాలి. డ్రిప్ పద్ధతి ద్వారా నీటి యాజమాన్యం చేయవచ్చు.
  • అవసరాన్నిబట్టితడులుఇవ్వాలి. వాతావరణపరిస్థితులకుఅనుగుణంగావారానికిఒకసారినీరుఅందించాలి. ఎదుగుతున్నతొలిదశలోకలుపుమొక్కలనిర్మూలనజాగ్రత్తగాచేపట్టాలి.

      సస్యరక్క్షణచర్యలు:

  • కనకాంబరంలోనులిపురుగులబెడదఎక్కువగాఉంటుంది. నులిపురుగులుసోకినమొక్కలవేర్లపైగోధుమరంగునుండినల్లమచ్చలుఏర్పడతాయి. వేర్లపైనకణితలుకూడాకనిపిస్తాయి. ఆకులుపాలిపోయిపత్రహరితాన్నికోల్పోతాయి. మొక్కపెరుగుదలతగ్గిపోయిప్రక్కకొమ్మలుఏర్పడవు. చివరగాఆకులుఅన్నీరాలిపోతాయి. ఇటువంటిలక్షణాలుకనపడితే 1 గ్రా. ఫోరేట్గుళికలనుప్రతిమొక్కమొదలులోవేసిమొక్కలనుకాపాడుకోవచ్చు.
  • తెల్లపురుగులవలనఆకులపైనమసిరోగంవస్తుంది. కావునదీనినివారణకుమలాథియాన్ 2 గ్రా. లేదాడైమిథోయేట్ 2 గ్రా. లీటరునీటికికలిపిపిచికారిచేయాలి.
  • పేనుబంక:పిల్ల మరియు తల్లి పురుగులు మొక్క లేత భాగాలను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తాయి. వీటి కనిం అధికమైతే మొక్కలు ఎదగవు. నివారణకు మిథైల్టెమటాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
  • తెగుళ్ళు:కనకాంబరంలో ఎండుతెగులు ముఖ్యమైనది. ఎండు తెగులు ఆశించిన మొక్క ఆకుల అంచులు రంగుకు మారుతాయి. వేర్లు మరియు మొక్క కాండం మొదలు కుళ్ళటం వలన మొక్క ఆకస్మికంగా చనిపోటు కాండాన్ని చీల్చి చూస్తే లోపల గోధుమ రంగుకు మారి వుంటుంది. దీని నివారణకు పరిశుద్ధమైన సాగు పద్ధతం పాటించాలి. మురుగు నీరు తీసివేయాలి. నెమటోడుల నివారణకు సొలరైజేషన్ చేయాలి. భూమిలో మే ఫ్యురడాన్ గుళికలు వేయాలి. భూమిని లీటరు నీటికి 2 గ్రా. బినోమిల్ లేదా 3 గ్రా. మాంకోజెబ్ కలిపిన ద్రావణం తడపాలి. నారు మొక్కలను 2 గ్రా, బినోమిల్ లేదా 1 గ్రా. కార్బండిజమ్ మందు ద్రావణంలో ముంచి నాటుకోవాలి.
  • ఆకుమచ్చతెగులుకూడాఎక్కువగావస్తుంది. కావునరైతులుఆకుమచ్చతెగులుసోకినమొక్కలుగమనించినవెంటనే 2 గ్రా. కార్బండజిమ్ఒకలీటరునీటికికలిపిపిచికారిచేయాలి.
  • పంటకోత మరియు దిగుబడి:
  • పైనతెలిపినసరైనయాజమాన్యపద్ధతులుపాటించడంవల్లమొక్కలునాటిన 2-3 నెలలకుపూతప్రారంభమైసంవత్సరంపొడవునాపూలుపూస్తాయి. జూన్ నుండి జనవరినెలవరకుఎక్కువదిగుబడిఉంటుంది. కనకాంబరంపూలుఒకక్రమంలోవెన్ను క్రింద భాగంనుండివిచ్చుకొంటాయి. పువ్వుపూర్తిగావిచ్చుకోవడానికిరెడురోజులుపడుతుంది. కావునరోజుమార్చిరోజుఉదయంలేదాసాయంత్రంసమయాల్లోపూలుకోయాలి. వెన్నుపొడవునుబట్టిఅందులోఅన్నిపూలువిచ్చుకోవడానికి 15-25 రోజులుపడుతుంది. కనకాంబరంపూలుచాలాతేలికగాఉంటాయి. కాబట్టిఒకకిలోకు 15000 పువ్వులుతూగుతాయి.
  • కనకాంబరంబహువార్షికపంటఅయినాఒకసంవత్సరంవరకుమాత్రమే. అధికదిగుబడులువస్తాయి. వాణిజ్యపరంగాసాగుచేయాలనుకొనేరైతులుప్రతిసంవత్సరంకొత్తపంటనువేసుకొనిఅధికదిగుబడులుపొందవచ్చు. ఎకరాకుసంవత్సరంపొడవున 1500-2000 కిలోలపూలదిగుబడిపొందవచ్చు.

 

Leave Your Comments

అమినోఆమ్లాలు- ప్రకృతివ్యవసాయపద్ధతులు.

Previous article

తీగజాతికూరగాయాలపంటలనుఆశించే పండు ఈగ నివారణ

Next article

You may also like