Chilli Nursery Management: తెలుగు రాష్ట్రాల్లో పండించే వాణిజ్య పంటలలో మిరప చాలా ముఖ్యమైనది. అయితే మిరపలో పెరుగుతున్న చీడపీడలు, గిట్టుబాటుకానీ ధరలతో రైతుకు సాగు భారంగా మారుతుంది.. మిరప నారు పోసింది మొదలు కోత వరకు రసాయనాల బెడద ఎక్కువగా ఉంటుది.. కాబట్టి రైతులంతా సమగ్ర సస్యరక్షణ పద్దతులను అచరణలో పెట్టాలి. ఇప్పుడు కురుస్తున్న వర్షాలు విత్తనం వేయడానికి అనుకూలిస్తున్నాయి. ఇప్పటికే నారు పోసిన రైతులు నాట్లు పోసేందుకు సిద్దమవుతున్నారు.
మిరప ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఎగుమతి అవకాశాలు చాలా ఉన్నాయి. ఆహారానికి రంగు రుచి ఇవ్వడమే కాకుండా మిరపలో విటమిన్లు, ఔషధ లక్షణాలున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతంలో మిరపను సాగు చేస్తున్నారు. మన దేశంలో మిరప ప్రధాన వాణిజ్య పంట . దేశవ్యాప్తంగా 8 లక్షల హెక్టార్లలో సాగవుతుంది. ఆరున్నర లక్షల టన్నుల దిగుబడి వస్తోంది, విస్తీర్ణం, ఉత్పత్తి, వినియోగంలో ప్రపంచంలోనే మనదేశం మొదటి స్థానంలో ఉంది. ఉత్పాదకతలో హెక్టారుకు 1. 9 టన్నుల దిగుబడితో ద్వితియ స్థానంలో ఉంది. మిరపతో ఉప ఉత్పత్తులు కూడా తయారు చేస్తున్నారు.
Also Read: Raising Rabbits at Home: ఇంట్లోనే కుందేళ్ల పెంపకంతో లాభాలు

Chilli Nursery Management
దేశంలో అన్ని రాష్ట్రాల్లో సాగు చేస్తున్నప్పటికీ, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా సాగవుతుంది. ఇలాంటి మిరప వర్షాధారంగా సాగు చేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు లాం ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు. దేశంలోని అన్ని ప్రాంతంలో మిరపను సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మిరప 1 లక్ష 34 వేల 960 ఎకరాలలో రైతులు సాగు చేస్తుండగా 7 లక్షల 39 వేల 620 టన్నుల దిగుబడి వస్తుంది.
తెలంగాణలో 79వేల హెక్టార్లలో సాగు చేస్తుండగా , 2.8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని తీస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పంటను సాగు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వర్షాధారంగా మిరపను సాగుచేసే రైతులు జూలై, ఆగస్టు నెలల్లో నారు పోసుకోవచ్చు . ఎకరాకు 650 గ్రాముల విత్తనం సరిపోతుంది. అయితే నారుమడుల పెంపకంలో సమగ్ర యాజమాన్య చర్యలు చేపడితే నాణ్యమైన నారు పెరిగి మంచి దిగుబడులు వస్తాయంటున్నారు లాం ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు. నీటి వసతి ఉండి సారవంతమైన నేలల్లో నారును పెంచుకుంటే నాణ్యమైన నారు పెరిగేందుకు దోహద పడుతుంది. మనం ఏదైనా ఎంచుకునే విత్తనం, నారులోనే ఉంటుది. రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్దతిలో వ్యవసాయం చేయాలి.. అప్పుడే మనకు ఆధిక దిగుబడులను సాధించి లాభాలను కళ్లజూస్తాము..
Also Read: Tomato Price: కోటీశ్వరులు అవుతున్న టమాట రైతులు.!