Cultivation of Carrot: క్యారేట్ ను మన దేశంలో అన్ని రాష్ట్రాలలో పండిస్తారు.ఇది వేరుకూరగాయ దీన్ని ఉత్తర భారతదేశం లో పశువులకు మేతగా
వాడతారు. నల్లని క్యారెట్ నుండి కంజి అనే ద్రావకము
తయారు చేస్తారు.ఇది జిర్ణ శక్తిని పెంచే గుణము కలిగి
ఉంటుంది. వీటిలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది.
వాతావరణం
దీని సాగుకు చల్లని వాతావరణం అవసరం.క్యారేట్ పెరుగుదల
మరియు రంగు ఉష్టగ్రత మీద ఆధారపడి ఉంటుంది.15-20 సేం.
గ్రే. వద్ద రంగు అభివృద్ధి చెందుతుంది.
నేలలు
మురుగు నీరు వసతి గాల గరప నేలలు శ్రేష్టం. హెచ్చు ఆమ్లా నేల
యందు క్యారెట్ ఉత్పత్తి సరిగా జరగదు.
రకాలు-
యురాపిన్ రకాలు : క్యారెట్ చిన్నవిగా ఉంటాయి.కోత ఆలస్యం
అయిన గట్టిగ మారి తినడానికి పనికి రావు.కరొటీన్ ఎక్కువగా
ఉంటుంది.
ఆసియాటిక్ రకాలు : అంతోసయానిన్ వలన ఎరుపు రంగులో
ఉంటుంది.పొడవుగా నునుపుగా ఉంటాయి.ఇవి భూమిలో నేల
రోజుల వరకు చెడిపోవు.
బోల్టింగ్
మొక్కలు త్వరగా పుష్పిస్తాయి. కావున వేరు పెరుగుదల
ఆగిపోతుంది.
విత్తు కాలం
5-6 కిలోల విత్తనం / ఎకరాకు
విత్తు దూరం
30×35 సేం. మీ. మొలకెత్తిన పిదాప దగ్గరగా ఉన్న మొక్కలను
తీసివేసి ఒక మొక్క మాత్రమే ఉంచుట వలన వేర్లు బాగా
ఏర్పడతాయి.
ఎరువులు
20-30 టన్నుల పశువుల ఎరువు ఆఖరి దుక్కిలో వేయాలి.60
కిలోల నత్రజని 50 కిలోల భాస్వరం 100 కిలోల పోటాష్
ఎరువులను విత్తే ముందు వేయాలి.
అంతర కృషి, నీరు కట్టుట పొలంలో కలుపు లేకుండా జాగ్రత్త వహించుట ముఖ్యము క్యారేట్ల సరైన పెరుగుదలకు భూమిలో సరిపడినంత తేమ
ఉండాలి.అవసరాన్ని బట్టి 5-6 రోజులకొకసారి నీరు పెట్టాలి.
కోత విత్తిన 45 రోజుల్లో కోతకు సిద్ధం అవుతుంది.పొలంకు నీరు ఇచ్చి
పరతో గాని లేదా మొక్కలు పికి క్యారేట్ లను తీస్తారు.
దిగుబడి
హెక్టారుకు 20- 30 టన్నులు
నిల్వ
0 సేం. గ్రే. -4.5 సేం. గ్రే.మరియు 98% వద్ద దాదాపు 3-5
నేలలు నిల్వ చేయవచ్చు.
విత్తనోత్పత్తి
ఇన్ సిటు పద్దతి : బాగా వృద్ధి చెంది వేర్లు ఏర్పడిన మొక్కలను
పొలంలో అలాగే పుష్పించడానికి వదిలివేస్తారు. ఈ విధం అయిన
విత్తనాలు చాలా తక్కువ ఖరీదు కలిగి ఉంటాయి.
నాటు పద్దతి,: వేర్లు బాగా వృద్ధి చెందిన పిదప ఎంపిక చేసిన
మొక్కలను పికి వేరే దగ్గర నాటుతారు.ఇలా సేకరించినా
విత్తనాలు నాణ్యత కలిగి ఉంటాయి.హెక్టారుకు 5-6 క్వి విత్తనాన్ని
సేకరించవచ్చు.
Must Watch:
Leave Your Comments