Coconut and Cocoa Crops in September:వర్షాధారంపై ఉన్న తోటలలో రెండవ దఫా ఎరువులను కొబ్బరిచెట్టు చుట్టూ 2 మీ. దూరం, 25 సెం.మీ. లోతు పళ్ళాలు చేసుకొని సిఫారసు చేసిన రసాయన ఎరువులను సగం మోతాదు అనగా 1/2 కిలో యూరియా, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 1 1/2 కిలో మ్యూరేట్‌ఆఫ్ పొటాష్ ఒక చెట్టుకు చొప్పున వేయవలెను. కొబ్బరిని ఆశించు ఎర్రముక్కు పురుగు, సర్పిలాకార మరియు బొండార్ తెల్లదోమ, మొవ్వుకుళ్ళు Ê నల్లమచ్చ తెగులు ఉనికిని పరిశీలిస్తూ ఉండాలి.
ఎర్రముక్కు పురుగు యాజమాన్యం :
- చెట్టుకు ఎటువంటి గాయం చేయరాదు.
- సకాలంలో ఈ పురుగు ఉనికిని గమనించి ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్.ఎల్ 1 మి.లీ / 1 లీటరు నీటికి కలిపి మొవ్వు భాగంలో పోయాలి.
- ఎర్రముక్కు తల్లి పురుగులను గుంపుగా ఆకర్షించు కృత్రిమ ఎరను బక్కెట్లో ఉంచి, తోటలో 1 1/2 మీటర్ల ఎత్తులో అమర్చిన, ఎర్రముక్కు తల్లి పురుగులు ఆకర్షితమై, బక్కెట్ లోపల గల విషాహారంలో పడి చనిపోతాయి.
సర్పిలాకార, బొండార్ తెల్లదోమ యాజమాన్యం:
- సెప్టెంబర్ మాసం నుండి తెల్లదోమ ఉనికి కొబ్బరిపై గమనించవచ్చు. ముఖ్యంగా పొట్టిరకాలు మరియు హైబ్రీడ్ వంగడాలపై పురుగు స్థాయి త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రెండు రకాలు కలిగిన తోటలలో రైతులు తెల్లదోమ స్థాయి గమనించుకోవాలి.
- నివారణ కొరకు మిత్రపురుగు ఎపర్టోక్రైసా విడుదల మరియు జీవనియంత్రకాల పిచికారీ చేసుకోవాలి.
మొవ్వుకుళ్ళు తెగులు యాజమాన్యం :మొవ్వుభాగం తడిచేలా కాపర్ ఆక్సీక్లోరైడ్ మందు (3 గ్రా./ లీటరు నీటిలో కలిపి) పిచికారీ చేయాలి. కాయకుళ్ళు సోకిన గెలను తొలగించి, ఇతర గెలలు, మొవ్వుభాగం తడిచేలా కాపర్ ఆక్సీక్లోరైడ్ మందు (3 గ్రా./ లీటరు నీటిలో కలిపి) పిచికారీ చేయాలి.
జీవనియంత్రణ పద్ధతి :కొబ్బరి మొక్క మొవ్వు భాగంలో సుడోమోనాస్ ప్లోరిసెన్స్ టాల్క్ పొడిని వేయాలి. మొక్క వయసు బట్టి సంవత్సరంలోపు మొక్కకు 5 గ్రాములు, ఒక సంవత్సరం మొక్కకు 10 గ్రాములు, అదే విధంగా 2, 3, 4, 5 మరియు 5 సంవత్సరముల కంటే ఎక్కువ వయసు గల మొక్కలకు 75, 100, 150, 200 గ్రాముల టాల్క్ పొడిని వేయాలి.
కాయకుళ్ళు సోకిన గెలను తొలిగించి, ఇతర గెలలు, మొవ్వుభాగం తడిచేలా సుడోమోనాస్ ప్లోరిసెన్స్ ద్రావణాన్ని (5 గ్రా. / లీటరు నీటికి) పిచికారీ చేయాలి.
నల్లమచ్చ తెగులు యాజమాన్యం :కొబ్బరి చెట్టు కాండంపై ఎటువంటి గాయం కలిగించరాదు. ఈ తెగులు లక్షణాలు కాండంపై కనిపించిన వెంటనే, ఆ భాగంపై ట్రైకోడెర్మా విరిడి శిలీంధ్రపు పొడిని పేస్ట్‌గా తయారుచేసి పూయవలెను (50 గ్రాముల పొడికి 25 మి.లీ. నీటిని కలిపిన పేస్ట్ తయారగును).
కోకో : - కోకో పంటలో కొమ్మ కత్తిరింపులను చేపట్టాలి.
- కత్తిరింపులు చేసిన వెంటనే 1 శాతం బోర్డో మిశ్రమం లేదా 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి లేదా కొమ్మలకు పూత పూయాలి.
- అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు కత్తిరింపులు చేయకూడదు.
- ఎట్టి పరిస్థితులలో జార్కెట్‌లోని ఫాన్ కొమ్మలను కత్తిరించకూడదు.
. కత్తిరింపులు చేసినప్పుడు కొమ్మలు పగలకుండ మరియు బెరడు ఊడకుండా జాగ్రత్త వహించాలి. - నేల స్వభావాన్ని బట్టి, కొమ్మ కత్తిరింపులు చేపట్టిన తరువాత ఎరువులను క్రమం తప్పకుండా మొక్క మొదలు నుండి 3 అడుగుల దూరంలో సన్నని గాడిలో ఎరువులు వేసి, మట్టితో కప్పి, నీటిని పారించాలి.
కోకోలో పురుగులు, తెగుళ్ళు :
- కోకోలో నల్లకాయ, గజ్జి తెగులు ఉనికిని తోటలలో గమనించుకోవాలి. దీని నివారణకు 1 శాతం బోర్డో మిశ్రమం లేదా 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటరు నీటికి కలిపి కాయలపై పిచికారీ చేయాలి.
- కోకోలో బెరడు తొలిచే పురుగు మొదలై ఉంటుంది. కనుక కోకో జార్కెట్లను విసర్జించిన పదార్ధాలతో ఏర్పడిన గోధుమ రంగు విసర్జాలను నిశితంగా పరిశీలించి, దీని నివారణ కొరకు లామ్డా సైలాత్రిన్ మందు 1 మి.లీ. / లీటరు నీటికికి కలిపి సిరెంజ్ ద్వారా జార్కెట్స్ దగ్గర ఉండే పురుగు ప్రవేశ ద్వారంలో ఇన్‌జెక్ట్ చేయాలి.
Also Read:Coconut Planting: కొబ్బరిలో నారు పెంచుట మరియు మొక్కలు నాటుటలో మెళుకువలు.!
Also Watch: