Storing Fruits and Vegetables: పండ్లు మరియు కూరగాయలు నిల్వ చేయుట గల ప్రాముఖ్యత పండ్లు మరియు కూరగాయలు త్వరగా చెడిపోవు స్వభావం కలదు. కావున వాటిని ఎక్కువ రోజులు వాడుకోవడానికి నిల్వ చేయడం అవసరం. పండ్లు చాలా వరకు ప్రత్యేకించి ఒకొక్క సీజన్ లో వస్తాయి. వీటిని ఇతర కాలాలలో లభింప చేయుటకు నిల్వ అవసరం. పండ్లను పండించిన మరియు పండని ప్రదేశాలలో లభింప చేయడానికి నిల్వ చేయాలి.
మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ లేనప్పుడు వాటిని నిల్వ చేసుకొని మంచి డిమాండ్ ఉన్న సమయంలో అమ్ముకోవడం వలన అధిక లాభం పొందవచ్చు.
విలువైన ప్రక్రియ పదార్ధాలను ( by products ) గా రూపొందించి వాటిని ఎగుమతి చేసి విదేశీలకు మారక ద్రవ్యాన్ని పొందవచ్చు. దేశ ప్రజలు ఆహారం పోషక విలువలను పెంచుటకు పండ్లను నిల్వ చేయడం అవసరం. పండ్లు మరియు కూరగాయలు నిల్వ చేయు ప్రక్రియ అభివృద్ధి చెందకపోవడానికి కారణాలు
పండ్ల నిల్వ చేయుటలో సరైన పరిజ్ఞానం లోపించుట.
నిల్వ చేయుటకు వీలైన పండ్లు మరియు కూరగాయలు లభించకపోవడం.
నిల్వ చేయు ప్రక్రియ ఖర్చుతో కూడుకున్న పని. పండ్లను నిల్వ చేయడం లో ఆధునిక పద్ధతులు ప్రభుత్వం ఇచ్చే వివిధ సబ్సిడీలపై రైతులకు అవగాహనా లేకపోవడం. సరియైన రవాణా సౌకర్యాలు మరియు మార్కెటింగ్ లేకపోవడం
అవసరమైన పండ్లు మరియు కూరగాయ రకాలు అన్ని కూడా వాతావరణానికి అనుగుణంగా లేకపోవడం, సంవత్సరం అంత నిల్వ తయారీ పరిశ్రమలకు అందుబాటులో లేకపోవడం.
Also Read: Mixed Vegetables Cultivation: మిశ్రమ కూరగాయల సాగు.!
పండ్లు చెడిపోవటకు గల కారణాలు
పండ్లను కోయుట, ప్యాకింగ్,మరియు రవాణాలు అజాగ్రత్త వల్ల పండ్లు చెడిపోయే ప్రమాదం ఉంది.
హెచ్చు ఉష్ణోగ్రతల వల్ల.
అధిక శ్వాస క్రియ వల్ల.
వివిధ ఎంజైమ్ ల వల్ల.
బూజు బాక్టీరియా మరియు ఈస్ట్ ల వల్ల పండ్లు చెడిపోవును.
ఎంజైమ్ లు కాటాలిస్ట్ పనిచేయుచు పండు పక్వానికి వచ్చుటకు తోడ్పడటమే కాక కొన్ని సార్లు పండ్ల రంగును
మార్చడం ద్వారా పండ్ల నాణ్యతను కోల్పోయేట్లు చేస్తాయి.
నివారణ పద్ధతులు
పండ్లను తేమ ప్రదేశాలలో ఉంచిన యెడల వాటిపైన బూజు ఏర్పడి పండ్లు చెడిపోవుటకును వేడి నీటితో ట్రీట్ చేయడం ద్వారా మరియు శిలీంద్ర బావిస్టన్ 0.1 వాడుట ద్వారా నివారణ చేయవచ్చు.
ఈస్ట్ ద్వారా చెడిపోవడాన్ని కూడా వేడి చేయడం ద్వారా అరికట్టవచ్చు. సాధారణంగా 60-65% తీపి పదార్ధం ఈస్ట్ ద్వారా వృద్ధి చెందును.
Also Read: Leafy Vegetables Cultivation : ఆకుకూరల సాగుకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న గ్రామం