Grapes Orchard: ద్రాక్ష సమశీతోష్ణపు మండలపు పంట కాని ఉష్ణమండలంలో పెంచడానికి అనుకూలమైంది. ప్రపంచంలో 50% ఫల ఉత్పత్తి ద్రాక్ష నుండి వస్తుంది. మన రాష్ట్రంలో సుమారు 8000 వేల ఎకరాల్లో సాగు చేయబడుతూ 96 వేల టన్నుల పండ్ల ఉత్పత్తి జరుగుతుంది. మన రాష్ట్రంలో రంగారెడ్డి, హైద్రాబాద్, అనంతపూర్, మహాబూబ్ నగర్, చిత్తూర్, కర్నూల్, జిల్లాలో ద్రాక్ష విస్తారంగా సాగు చేస్తున్నారు. అనంతపూర్ ప్రాంతంలో అనుకూల వాతావరణ పరిస్థితులు ఉండటం వల్ల రైతులు సంవత్సరానికి 2 పంటలు సాగు చేస్తున్నారు. మొదటి పంట నవంబర్ లేదా డిసెంబర్ మాసాలలో, రెండవ పంట మే మాసంలో కోతకు వస్తుంది. అనంతపూర్ మినహా మిగిలిన ప్రాంతాల్లో ద్రాక్షపంట ఫిబ్రవరి లేదా ఏప్రిల్ మాసాలలో కోతకు వస్తుంది.
మన దేశంలో ద్రాక్షను ఎక్కువగా పండుగా తినడానికి ఇష్టపడతారు. పాశ్చాత్య దేశాలలో ఎక్కువగా పానీయాలు తయారుచేయుటకు ఉపయోగిస్తారు. ద్రాక్షతో జామ్, రెసిన్స్, ఎండు ద్రాక్షలను కూడా తయారు చేయవచ్చు. దీనిలో లవణాలు విటమిన్లు ఎక్కువ శాతంలో లభిస్తాయి.
పొడి వాతావరణములో ద్రాక్ష సాగుకు అనుకూలమైనది. 15-40 సెం.గ్రే ఉష్ణోగ్రత, 50-55 సెం.మీల వర్షపాతం ప్రాంతాలలో సాగు చేయవచ్చు. పూత, కాయ ఏర్పడునప్పుడు మబ్బుతో కూడిన వాతావరణం గాలిలో ఎక్కువ తేమ ఉన్న సాగుకు అనుకూలం కాదు. ఈ పరిస్థితిలో తెగుళ్ళ తొందరగా వ్యాపిస్తుంది.
తేలికపాటి నీటి పారుదల, లోతైన నేలలు శ్రేష్టం. నేల పి హెచ్ 6.5-7.5 వరకు గల నేలల్లో చాలా పెరుగును. నల్లరేగడి నేలలు పనికి రావు. తెలంగాణ ప్రాంతంలోని చల్కానేలలు, ఎర్రనేలలు, పంట సాగుకు అనువైనవి.
Also Read: Mango Orchards: మామిడి తోట ప్రతి సంవత్సరం కాయలు రావడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ?
ద్రాక్ష పండు రకాలు:
1. ధాంసాన్ సీన్లెన్:
ఈ రకం దృడంగా కొంచెం ఏపుగా పెరుగుతాయి. ద్రాక్ష గుత్తిలో కాయలు దగ్గరగా చిన్నవిగా ఉండును. పండులో గింజలుండవు. మంచి నాణ్యత కల్గి ఉంటుంది.
2. అనాబ్ – ఇ- షాహి :
ఈ రకం ఎక్కువ ఏపుగా పెరిగి అధిక దిగుబడి ఇస్తుంది. ద్రాక్ష గుత్తి చాలా పెద్దగా ఉండును. పండ్లు బాగా కండతో నిండి ఉండును. కాయలలో 2-3 విత్తనాలుండును. T.S.S 10-17% ఉండును. పండ్లు ఆలస్యంగా పక్వానికి వస్తాయి.
నాటు విధానం:
నాటవలసిన భూమిని బాగా చదును చేసుకోవాలి. కొమ్మలు నాటుటకు ముందు, రాతి స్తంభాలను పాతి గాల్వినైజ్ ఇనుప తీగను ఉపయోగించి పందిరి వేయవలెను. ద్రాక్ష రకాన్ని బట్టి నేలను బట్టి, ద్రాక్ష తీగను ఈ విధానాన్ని అనుసరించి మొక్కల మధ్యదూరం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో అనబి-ఇ షాహి రకానికి 4-5×4.5 మీటర్ల ఎడం రకానికి 3X3 మీటర్లు ఎడంలో నాటుటకు నెలరోజుల ము,దు 60-90 సెం.మీ గోతులను త్రవ్వి గాలికి ఆరనివ్వాలి. తదుపరి గోతిలో పై మట్టి 20 కేజీల చివికిన ఎరువు 500 గ్రాముల సూపర్పాస్పేట్ 1 కేజీ నీమ్ కేక్ వేసి గుంతను నింపాలి. తర్వాత వేర్లు ఏర్పడిన కొమ్మలకు దెబ్బ తగలకుండా గోతిలో నాటుకోవాలి. వీటిని అక్టోబర్-నవంబర్ మాసాలలో నాటుకుంటే మంచి దిగుబడి వస్తుంది.
బాగా ఎదిగిన ద్రాక్ష తోటలకు హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎర్రనేలల్లో సంవత్సరానికి 30-40 తడులు అవసరం. ద్రాక్ష తోటలకు శీతాకాలంలో 1000 లీటర్ల నీరు వేసవి కాలంలో 2000 లీటర్ల నీరు ఒక మొక్కకు అవసరం.
ద్రాక్ష పండ్లు తీగపైనే పక్వముకి వచ్చిన వెంటనే కోయాలి. పండ్లు కోసిన తర్వాత దాని పక్వ దశలో ఏమార్పు రాదు. సాధారణంగా ద్రాక్ష గుత్తిలోని చివరి పండు మెత్తగా తీయగా ఉంటే గుత్తి కోతకు వచ్చినట్లు గుర్తించాలి. తెల్లని ద్రాక్ష బాగా తయారైనపుడు అంబర్ రంగులోనికి మారుతుంది. అలాగే రంగు ద్రాక్షలాగా రంగువచ్చి పైన బూడిదవంటి పొడితో సమానంగా కప్పబడినట్లు కనబడుతుంది. బాగా తయారైన పండ్ల యొక్క గింజలు ముదురు మట్టి రంగులోకి మారతాయి. పండ్లలో మొత్తం కరిగే ఘనపదార్థాలు కూడా పండు పరిపక్వాన్ని సూచిస్తాయి. బ్రిక్సెరీడింగ్ అనాబ్-ఇ-షాహి 15-16 డిగ్రీలు, థాంప్సన్ సీన్లెస్ 21-22 డిగ్రీలు రాగానే కోయవచ్చు.దిగుబడి సాగు చేయవల్సిన రకం నేల, ఇతర పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మన రాష్ట్రంలో అనబి-కా-షాహ్ 10-15 టన్నులు ఒక ఎకరానికి , థామ్సన్ సీన్లెస్ 6-8 టన్నులు ఒక ఏకరానికి దిగుబడి వస్తున్నాయి.
Also Read: Banana Varieties Cultivation: భారతదేశంలో అరటి పండులో ఇన్ని రకాలు సాగులో ఉన్నాయి.!