Lily Cultivation: లిల్లీ మురిపిస్తుంది. సువాసన లాభాలతో రైతుల మనస్సును మైమరిపిస్తోంది. పెద్దగా చీడపీడల బెడద లేకపోవడంతో సంప్రదాయ పంటలను వదిలిపెట్టి ఉద్యాన పంటలను ఎంచుకుంటున్నారు యువరైతులు. ముఖ్యంగా చీడపీడల లేని లిల్లీ సాగును ఎంచుకుంటున్నారు. దీంతో కొంతమంది రైతులు లిల్లీ పంటతో మంచి దిగుబడులను సాధిస్తు మార్కెట్లో లాభాలను అర్జిస్తున్నారు. అసలు లిల్లీ పంటకు ఎలాంటి నేలలు అవసరం, దానికి ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలనే వివరాలు మనం ఇప్పుడు ఏరువాకలో తెలుసుకుందాం
రోజు వారి ఆదాయాన్ని పొందవచ్చు
లిల్లీ పంటను ఒకసారి నాటితే.. మూడేళ్ల వరకు పూల ద్వారా రోజు వారి ఆదాయాన్ని పోందవచ్చు.. ఈపంటకు ఇతర ఉద్యాన పంటల లాగా నర్సీరిలపై ఆధారపడే అవసరం లేదు.. ఎందుకంటే ఈపంట సాగుకు అవసరమైన దుంపలను తోటి రైతుల నుంచి సేకరించుకునే సౌలభ్యం ఉంది. మూడేళ్ల వయసున్న తోటల నుంచి సేకరించిన దుంపలను నాటేందుకు వినియోగించాలి. ఈపంటను అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు అయితే తేలికపాటి ఇసుక నేలలు, ఒండ్రు నేలల, ఎర్ర గరప నేలలు, వీటి సాగుకు చక్కటి అనుకూలంగా ఉంటాయి. పంట వేసిన పొలంలో నీరు నిల్వ ఉండకుండా మురుగు నీటి వసతి కల్పించాలి. లేకుంటే అనేక రకాల వ్యాధులు వ్యాపించి దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది.
Also Read: Millets Health Benefits: చిరుధాన్యాలు ఆరోగ్యానికి మేలు చేసే ప్రయోజనాలు.!
60వేల నుంచి 70వేల దిగుబడి
సంవత్సరం పొడవునా ఆదాయాన్ని అందించే లిల్లీ పూల సాగు రైతులకు మంచి లాభాల బాట పట్టిస్తోంది. . పరిమళాలు వెదజల్లే లిల్లీ పూలను అలంకరణలోను, బొకేలు, సుగంధ తైలాలు ఉత్పత్తిలోనూ అధికంగా వినియోగిస్తారు. దాంతో లిల్లీ పూలు వాణిజ్యపరంగా ప్రపంచ మార్కెట్లో సైతం అన్ని కాలాల్లో నిలకడైన ధర లభిస్తుండడం వల్ల చాలా మంది రైతులు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. లిల్లీ పూలు సమశీతోష్ణ స్థితి కలిగిన వాతావరణ పరిస్థితుల్లో పెరిగి అధిక దిగుబడులను ఇస్తాయి. ఎకరానికి 60వేల నుంచి 70వేల దిగుబడి వస్తుంది. లిల్లీ పూలను తామర పురుగులు, పేనుబంక, మొగ్గ తొలుచు పురుగు, నెమటోడులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంది.. కాబట్టి ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
లిల్లీ పూలసాగు రైతులకు మరింత చేరువ
గతంలో కంటే ఇప్పుడు పెట్టుబడులు బాగా పెరిగిపోయాయి. మారుతున్న పరిస్దితులు కాలానుగునంగా హెచ్చుతగ్గులు ఆవుతున్నాయి. కనీస మద్దతు ధర లేక రైతులు విలవిల లాడుతున్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా రాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నాకు. ఇక కౌలురైతులు పరిస్ధితి మరీ దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్ధితులో లిల్లీ పూలసాగు రైతులకు మరింత చేరువగా ఉంటుది. ఒక్కసారి నాటితే మూడు సంవత్సరాల పాటు దిగుబడులు పోందవచ్చు. పెట్టిన పెట్టుబడులు కంటే ఎక్కువ లాభాలను అర్జించవచ్చు.. పూలకు మార్కెటు అన్ని వేళ్లలా ఉంటుది. మరీ ఇంకెందుకు అలస్యం మరీ స్టాట్ చేద్దామా..
Also Read: Organic Farming: వలస కూలీల జీవితాల్లో ‘జ్యోతి’