Ridge Gourd Farming: కూరగాయల సాగు, ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ నెంబర్ వన్. మన రైతులు ఎప్పటికప్పుడు అధునాతన పద్దతులు, సంకరజాతి విత్తనాలు ఉపయోగిస్తూ కూరగాయల సాగులో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. పూర్వ బీర సాగు చేసిన రైతులు నేలపై పాటించేవారు. ఆ విధానంలో పెద్దగా దిగుబడులు వచ్చేవి కావు. నేడు కొందరు రైతులు అడ్డ పందిరి విధానంలో బీర సాగు చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట సమీపంలో మండపిల్లి గ్రామ రైతు పార్వతీశం బీర సాగులో అపార అనుభవం గడించారు. ఏటా మూడు పంటల బీర సాగు చేస్తూ ఆదర్శ రైతుగా నిలిచారు.
అడ్డు పందిరి విధానంలో అధిక దిగుబడులు
నెల రోజులు పాకిన మొక్కలను అడ్డు పందికి పాకిస్తారు. ముందుగా అవు కర్రలు వాటిని అల్లుతూ లంగరు వైరు చుట్టి వాటికి బీర మొక్కలను పాకిస్తున్నారు. తీవ్రమైన గాలులు వచ్చినా అడ్డు పందిరి పడిపోకుండా కట్ట కర్రలు ఉపయోగిస్తున్నారు. లంగరు తీగ కేజీ రూ.300 ఉంటుంది. 25 సెంట్ల భూమికి 5 కేజీలు అవసరం అవుతుంది. అంటే 25 సెంట్లకు రూ. 1500 ఖర్చవుతోంది. లావు తాడు మరో 5 కేజీలు అవసరం ఉంటుంది. నెల రోజులు నేలపైన పాకిన
మొక్కలను లంగరు వైరుకు పాకిస్తున్నారు. దీని వల్ల దిగుబడులు బాగా పెరుగుతున్నాయి. కాయ కోయడం కూడా చాలా తేలిక. 75 రోజులకే బీర లో మంచి దిగుబడులు తీయవచ్చని పార్వతీశం తెలిపారు. పంట వేసిన రెండున్నర నెలల నుంచి ఆ తరవాత మూడు నెలల వరకు దిగుబడి వస్తుంది. ఇలా 105 రోజుల పాటు రోజు విడిచి రోజు బీర కాయల దిగుబడులు వస్తున్నట్టు రైతు పార్వతీసం వారి అనుభవాలను పంచుకున్నారు.
Also Read: Minister Niranjan Reddy: రైతుల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్నాం – మంత్రి నిరంజన్ రెడ్డి
విత్తనం ఎలా సేకరించాలి
ఈస్ట్ కోస్ట్ కంపెనీకి చెందిన రామా అనే వెరైటీ బీరను సాగు చేసి ఎకరాకు రూ.2 లక్షల ఆదాయం తీస్తున్నారు. 25 సెంట్లలో రోజు మార్చి రోజు వంద కేజీల దిగుబడి వచ్చిందని రైతు తెలిపారు. కిలో రూ.40కి విక్రయించారు. 25 సెంట్లలో 30 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. ఇలా సగటున కిలో రూ.30 ధర అనుకున్నా 25 సెంట్లలో రూ.90 వేల ఆదాయం సంపాదిస్తున్నారు.
సొరసాగులో రైతు దిట్ట
సొర, బెండ సాగుతో ఏటా రూ.2 లక్షలు సంపాదిస్తున్నారు.కేవలం 90 సెంట్ల భూమిలో మూడు రకాల కూరగాయలు సాగు చేస్తూ సంవత్సరం పొడవునా దిగుబడులు సాధిస్తున్నారు. ఏటా మూడు పంటలు, మూడు రకాల కూరగాయల సాగుతో ప్రతి రోజూ ఆదాయం వస్తోందని రైతు పార్వతీశం చెబుతున్నారు. పొలం వద్దకే వచ్చి వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకెళుతున్నారని ఆయన చెప్పారు.