Tomato Cultivation: గత కొన్ని రోజులుగా మార్కెట్లో టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం చికన్ కంటే కూడా మార్కెట్లో టమాటాకు ఎక్కువ రేటు పలుకుతుంది. ఒక్కప్పుడు రేటు లేక ఇబ్బంది పడ్డ రైతులు ఇప్పుడు ఆనందంలో మునిగి తేలుతున్నారు.. అసలు ఏదైనా బిజనస్ చేయాలి అనుకుంటే టమాటా సాగుతో మంచి వ్యాపారం చేయవచ్చు. ప్రసుత్తం టమాటా సాగు చేస్తున్న వారు అధిక దిగుబడులను సాధిస్తూ మంచి లాభాలను పొందుతున్నారు.
నిజానికి ఒక్కప్పుడు టమాటాకు రేటు లేక రోడ్ల మీద పారిబోసిన సందర్బాలు ఉన్నాయి. మార్కెట్లో వదిలివేసిన రోజులు కూడా ఉన్నాయి. పెట్టుబడులు రాక అప్పులు పాలు అయిన వాళ్లు ఉన్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు టమాటా పంట వేసిన రైతులకు డబ్బులే డబ్బులు. ఎందుకంటే టమాటాకు అంత డిమాండ్ ఉంది మరీ. మార్కెట్‌లో డిమాండ్‌ను గుర్తించి టమాటా సాగు చేసి రైతులు సక్సెస్ అయ్యారు.
Also Read: Tomato Crop Cultivation: ఏ కాలంలో వేస్తే టమాటా పంటలో మంచి లాభాలు వస్తాయి.!
టమాటాతో లక్షాధికారి
నేడు ఒక వ్యక్తి అభివృద్ది చెందాలంటే కేవలం కంపెనీలు మాత్రమే ప్రారంభించడం కాదు. డబ్బులు ఉంటే వ్యాపారాలు చేయడం అనేది ఏకైక మార్గం కాదు. ఆధునిక పద్దతులలో వ్యవసాయం చేసి కూడా డబ్బులు సంపాదించవచ్చు. దీనికో కొంత మంది విరూపిస్తున్నారు కూడా. ఇప్పుడు మనం టమాటాలో కోటిశ్వర్లను ప్రత్యక్షంగా చూస్తున్నాము. మనకు ఏ అవసరం ఏప్పుడు ఉంటుదో మనకు తెలియదు. కానీ టమాటాలు మాత్రం మనకు అవసరం ఉంటాయి.
టమాటా లేని కూరలను మనం ఊహించుకోలేము. టామాటా కూరలకు, పచ్చలకు మాత్రమే కాకుండా సాస్, పిజ్జా వంటి వాటిలో కూడా విరివిగా వాడుతున్నారు.. కావున టమాటాను సరైన పద్దతిలో పండిస్తే మంచి దిగుబడులను పొందవచ్చు. గ్రామీణ ప్రాంతాలలో కూడా టమాటా పంటను సాగుచేస్తూ 1200 క్వింటాళ్ల దాక దిగుబడులు తీస్తున్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
సాగును సంవత్సరానికి రెండు సార్లు వేసుకోవచ్చు
టమాటా సాగును సంవత్సరానికి రెండు సార్లు వేసుకోవచ్చు. జూలై, ఆగస్టు నుంచి ఫిబ్రవరి మార్చి వరకు, నవంబర్- డిశంబర్ మొదలై జున్- జూలై వరకు ఉంటుది.. ఒక హెక్టారు భూమిలో 15,000 మొక్కలను పెంచుకోవచ్చు. మూడు నెలల వ్యవధిలో దిగుబడులు చేతికి వస్తాయి. దిగుబడి తగ్గిన డిమాండ్ ఎక్కువగానే ఉంటుది.. అలాంటి సమయంలో కూడా మనం దిగుబడులను పొందవచ్చు. ప్రసుత్తం మనదేశంలో టమాటా కేజీ ధర రూ 120 పలుకుతుంది..దీంతో రైతులు ఆధిక లాభాలను పొందుతున్నారు. కాబట్టి టమాటా సాగుటో కూడా మంచి లాభాలు పొందే ఆవకాశం లేకపోలేదు.
Also Read: Rooftop Tomato Farming: ఇంటి పైకప్పు పై టమాట సాగు.!