Summer Banana Garden: రైతులు పూర్వ కాలంలో సంవత్సరానికి ఒక పంట పండించే వాళ్ళు. కానీ ఇప్పుడు రైతులు సంవత్సరానికి మూడు పంటలు పండిస్తున్నారు. పెరుగుతున్న జనాభా ఆహార అవసరాల కోసం రైతులు కనీసం మూడు నుంచి నాలుగు పంటలు పండించాల్సి వస్తుంది. అలాగే రైతులు అరటి తోటలని జూన్ లేదా జులై నెలలో నెట్టుకునే వాళ్ళు.
వేసవి కాలంలో తోటలు మొదలు పెట్టడం సాధ్యం కాదు. వేసవి కాలంలో తోటలు మొదలు పెట్టిన కూడా ఎక్కువ వేడికి మొక్కలు బ్రతకవు . కానీ అనంతపూర్ జిల్లా రైతులు వేసవి కాలంలో కూడా అరటి తోటలు మొక్కలు నాటుకొని, మొక్కలకి వేడి నుంచి ఎలాంటి హాని లేకుండా పెంచుతున్నారు. అక్కడి రైతులు వేసవి కాలంలో తోటలు ఎలా పెడుతున్నారు అని అనుకుంటున్నారా…
రైతులు అరటి మొక్కలని తీసుకొని వచ్చి పొలంలో నాటుకున్నారు. కానీ వీటిని ఎండ, వేడి గాలి నుంచి కాపాడుకోవడానికి మల్చింగ్ పద్దతిని వాడుకున్నారు. మల్చింగ్ పద్దతిలో ప్లాస్టిక్ మల్చింగ్ వాడితే నెల నాణ్యత తగ్గుతుంది. ఈ మల్చింగ్ కొన్ని రోజులోనే చిరిపోయే, చిన్న చిన్న ముక్కలు పొలంలోనే మిగిలిపోతున్నాయి. మిగిలిన చిన్న ముక్కలు పొలం నుంచి తీయడం చాలా కష్టం.
Also Read: Snake Gourd Farming: రైతులను ధనవంతులను చేసే పొట్లకాయ సాగులో మెళుకువలు.!
ఈ మల్చింగ్ భూమిలో కలిసిపోవడానికి చాలా కాలం పడుతుంది. భూమిలో కలిసిపోయిన, మట్టిని కలుషతం చేస్తాయి. అందుకని ఈత ఆకులని ప్రతి అరటి మొక్క చుట్టు పెట్టి , మొక్క పూతిగా మూసుకొని పోయేలా భూమిలో ఈత ఆకులని పెడతారు. ఈ అరటి చెట్లకి డ్రిప్ ద్వారా నీళ్లు అందించడం ద్వారా ఎండకి నీళ్లు ఆవిరి శాతాన్ని కూడా తగ్గిస్తుంది.
మొక్క చుట్టూ ఇలా ఈత ఆకులు పెట్టడం వల్ల మొక్క చుట్టూ పడే నీళ్లు ఎక్కువ కాలం ఉంటుంది, నేల తేమగా ఉండి చెట్టు బలంగా అవ్వుతుంది. ఇలా ఈత ఆకులూ పెట్టడం వల్ల కూడా మొక్కలని ఎండ, వేడి నుంచి కాపాడుకోవచ్చు. చెట్టు పక్కన కలుపు మొక్కలు కూడా తక్కువగా పెరుగుతాయి. దీని ద్వారా మొక్కలు తొందరగా పెరిగి, మంచి దిగుబడి వస్తుంది, పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది.
Also Read: Nilgiri Farming: పక్కా ప్రణాళికతో నీలగిరి సాగు – ఆదాయం బహుబాగు..