Flower Farming: రోజురోజుకు పూల వాడకం పెరుగుతోంది. కొత్త కొత్త రకాల పూలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఎన్ని రకాల పూలు వచ్చినా. వాణిజ్యపరంగా సాగులో ఉండేవి మాత్రం పరిమిత సంఖ్యలోనే ఉంటున్నాయి. మన వాతావరణంలో గులాబీలు, బంతిపూలు, మల్లె, కార్నేషన్, జెర్బెర మొదలైన పూలుకాగా ఈశాన్య రాష్ట్రాల్లో అర్కిడ్ పూలను సాగుచేస్తు న్నారు. అదే యురోపియన్, అమెరికా వంటి దేశాల్లో అయితే తులిప్స్ను ప్రధాన పూలపంటగా సాగుచేస్తారు. అన్ని పూలమొక్కలకు కాకున్నా కొన్ని పూలమొక్కలకు ఫోర్సింగ్ విధానాలు ఉన్నాయి. ఒక్కో మొక్కకు ఒక్కో ప్రత్యేక విధానం అమలులో ఉంది.
అందమైన రంగుతో పరిమళాలు వెదజల్లే గులాబీలు అంటే ఇష్టపడని వారు ఉండరు. మిగతా పూలతో పోల్చితే గులాబీలకు ఉన్న ప్రత్యేకత వేరు. గులాబీ పూలను అన్ని శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. మనదగ్గరున్న వేరే పూలతో పోల్చితే వీటిధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. వీటి వినియోగం ప్రేమి కులరోజు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయా నికి రైతులు పూలను మార్కెట్కు తేగలిగితే మంచి లాభాలు వస్తాయి.
గులాబీ:
గులాబీలో ఫోర్సింగ్ విధానాన్ని కొమ్మలను కత్తిరిం చడం(పూనింగ్) ద్వారా చేస్తారు. గులాబీ పూలు కొత్త చిగుర్లపై పూస్తాయి. వర్షాకాలం తర్వాత అక్టోబర్-నవం బర్ మాసాల్లో రైతులు కత్తిరిస్తారు. ఇక్కడే రైతులు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. గులాబీ పూలకొమ్మలు కత్తిరించుకున్న 45 రోజుల తర్వాత పూస్తుంది. కాబట్టి మనకు పూలు అవసరమనుకున్న 45- 50 రోజుల ముందు కనుక కొమ్మలను కత్తిరించుకుంటే అనుకున్న సమయానికి పూలు పొందవచ్చు. అంటే ప్రేమి కుల రోజున పూలు కావాలంటే డిసెంబర్ చివరివారంలో కొమ్మలను కత్తిరించుకోవాలి. మంచి నాణ్యత గల పూలు కావాలంటే ఎక్కువ సంఖ్యలో కాకుండా తగిన సంఖ్యలో పూమొగ్గలను ఉంచుకొని మిగతా వాటిని తుంచితే సరిపో తుంది. కొమ్మలు కత్తిరించిన తర్వాత మొక్కకు కావాల్సిన మోతాదులో పోషకాలు అందించి నీరు పెడితే పూలు బాగా వస్తాయి.
బంతిపూలు:
మనరాష్ట్రంలో పండిస్తున్న పూలలో బంతిపూలు ప్రథమ స్థా నంలో ఉంటాయి. బంతిపూలను ఏడాది పొడవునా పండించ 1 వచ్చు. వీటివల్ల గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి ఉపాధి లభి – స్తుంది. మనరాష్ట్రంలో బంతిపూలకు మంచి ఆదరణ ఉంది. బతు కమ్మ, దసరా, దీపావళి, సంక్రాంతి మొదలైన పండగలకు వీటి ద వాడకం ఎక్కువగా ఉంటుంది.బంతిలో ఫోర్సింగ్ విధానం విత్తనాలు నాటుకునే తేదీలను సర్దుబాటు చేసుకోవడం ద్వారా జరుగుతుంది.
Also Read: Farmer Success Story: జామ సాగుతో అధిక ఆదాయం పొందుతున్న రైతు.!
సాధారణంగా బంతిపూలు పొలంలో నాటుకున్న రెండునెలలకు పూతకు వస్తాయి. అందుకని పూలు కావాల్సిన సమయాన్ని దృష్టిలో ఉంచుకొని దానికి రెండునెలల ముందు మొక్కలను పొలంలో నాటుకుంటే మంచి లాభం పొందవచ్చు. ఉదాహరణకు సంక్రాంతి పండగకు పూలు అవసరం అనుకుంటే నవంబరు మధ్యలో బంతి విత్తనాలను అక్టోబరులో విత్తుకొని, నవంబరు నెల మధ్యలో నారును పొలంలో నాటుకోవాలి. తద్వారా మనం సంక్రాంతి పండగకు బంతి పూలను పొందవచ్చు. పొలంలో నాటుకున్న 35 రోజులకు పించింగ్ పద్ధతిని పాటిస్తే మొక్కలు గుబురుగా పెరిగి ఎక్కువ పూలనిస్తాయి.
చామంతి:
చామంతులు కాలానుగుణంగా పెరిగే మొక్కలు. వీటి పూతకాలం కాంతి పరివర్తనకాలంతో ముడిపడి ఉంటుంది. ముందు అనుకున్నట్లుగానే ఈ మొక్కలు పూతదశకు చేరుకోవా లంటే వాటికి 8-9 గంటల పగటి సమయం, 15-16 గంటల రాత్రి సమయం ఉండే రోజులు అవసరం. మనరాష్ట్రంలో రైతులు వీటిని జూన్-జులైలో నాటుకోవడం వల్ల ఆ లోటు లేకుండా పూతకు వస్తాయి. మనరాష్ట్రంలో వీటి సాగును ఇక్కడితో వదిలే స్తారు. కాని పక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో వీటిలో పోర్సింగ్ విధానం పాటించి ఏడాది పొడవునా సాగుచేస్తున్నారు. అది కొంచెం ఖర్చుతో కూడుకున్నపని అయినా మంచి లాభం ఉంటుంది. చామంతి పూలలో ఫోర్సింగ్ విధానంతో మనకు కావాల్సినట్లుగా కాంతి పరివర్తన కాలాన్ని నియంత్రించుకోవచ్చు. చామంతి పూలను ఫోర్స్ చేయాలంటే చాలా జాగ్రత్త అవసరం. అక్కడ పాటిస్తున్న విధానం తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. వీటి సాగుకోసం మొక్కలను కుండీల్లో పెంచుతారు. అలాగే నల్లటి టార్పాలిన్తో కప్పిన పాలిహౌస్ వంటి నిర్మాణం చేసుకుంటారు. అందులో ఏమాత్రం వెలుతురు లేకుండా మొత్తం చీకటి ఉండేలా. చూసుకుంటారు. అందులో వెలుతురు కోసం టంగ్ స్టన్ బల్బులు లేదా ప్రతిదీప్తి దీపాలు అమర్చుకుంటారు. మొక్కల వెలుతురుకు ఇవే దీపాలు ఆధారం. చామంతి మొక్కలు ఫోటో సెన్సిటివ్ మొక్కలు. వీటి శాఖలు మొక్క ఎదుగుదల సమయంలో ఎక్కువ పగలు, తక్కువ రాత్రి సమయం ఉండే రోజులు, పూతదశలో తక్కువ పగటి సమయం, ఎక్కువ రాత్రి సమయం ఉండాలి. ఈ ప్రమాణాలు లేకుంటే మొక్కలు శాశ్వతంగా పూతకు రావు. దీన్ని ఆధారం చేసుకొని మొక్కలను సాగుచేస్తారు.
Also Read: Marigold Cultivation: బంతి సాగులో -విజయా గాధ.!
Must Watch: