Antirrhinum Cultivation: అంటిరైనమ్ పూలు వివిధ రంగులలో ఉంటాయి, కొంత జాగ్రత్తగా చలి కాలంలో కాపాడుకుంటే సంవత్సరం అంతా పూలు పూయడం వల్ల బహు వార్షిక మొక్కగా పరిగణించ వచ్చును. అంటిరైనమ్ బలమైన కాడ కల్గి పొడవుగా పెరిగే మొక్క, మరియు స్పైక్ పొడవుగా ఉండడటం వల్ల కట్ ఫ్లవర్‌గా ఉపయోగిస్తారు. ఇంటి ముందు అలంకరణ కోసం కుండీలలో కూడా పెంచవచ్చు. ఈ పూవులు నొక్కగానే డ్రాగన్ నోరు ఎలా తెరుచుకుంటుందో అలా వదలగానే మళ్ళీ మూసుకునే ప్రత్యేక లక్షణాలు ఈ పూవులో కలదు అందుకే ఈ పూవులను డ్రాగన్ ఫ్లవర్ లేదా స్నాప్ డ్రాగన్ అనే పేర్లతో పిలుస్తారు. ఈ పూలు 15 రకాల పైన రంగులలో ఉంటాయి. సింధూరం, కాషాయం, లేత ఎరుపు, నీలం, పసుపు మరియు ఇంకా వివిధ రంగుల్లో ఉంటాయి. స్నాప్ డ్రాగన్ పూలు పొడువుగా, మధ్యస్థంగా మరియు పొట్టిగా 3 రకాలు ఉంటాయి.
పొడవుగా పెరిగేవి : ఈ మొక్కలు 24 – 28 ఎత్తు వరకు పెరుగుతాయి. ఈ పూల కాడలు ఎక్కువుగా గార్డెన్ ముందు వరుసలలో బోర్డర్ మరియు కట్ ఫ్లవర్స్‌గా ఉపయోగిస్తారు.
మధ్యస్థ రకాలు : ఈ మొక్కలు 12 -24 వరకు పొడువు పెరుగుతాయి. ఇవి బెడ్డింగ్స్, కట్ ఫ్లవర్స్ మరియు మిశ్రము బోర్డర్స్ గా ఉపయోగిస్తారు.
పొట్టి రకాలు : ఈ మొక్కలు 6 – 12 వరకు పెరుగుతాయి. ఈ పూలను బోర్డర్ ముందు వరుసలలో విండో బాక్స్ మరియు కంటైనర్స్‌గా ఉపయోగిస్తారు.
వాతావరణం : స్నాప్ డ్రాగన్ వివిధ వాతావరణం పరిస్థితులలో సాగుచేయవచ్చు. కానీ పగటి ఉష్ణో గ్రత 15 – 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే పూల నాణ్యత బావుంటుంది.
నేలలు : అంటిరైనమ్ సాగుకు ఉదజని సూచిక 6-5-7 మధ్య గల నేలలు అనుకూలం.
విత్తడం : సాధారణంగా ఈ మొక్కలను విత్తనం ద్వారా వ్యాప్తి చేస్తారు. ఒక కిలో విత్తనానికి 0.3 గ్రా. కాప్టాన్ లేదా థైరామ్‌తో విత్తన శుద్ధి చేయాలి. ఫిబ్రవరి – మార్చ్ నెలలు విత్తడానికి అనుకూలం. సుమారుగా ఒక మీటర్‌కు 3,000 నారు మొక్కలు అవసరమవుతాయి. విత్తనాలను మెత్తటి ఇసుకలో కలిపి విత్తుకుంటే సులభంగా ఉంటుంది.
నాటే దూరం : ఆరోగ్యకరమైన మరియు ఏక రీతిలో ఉండే నారు మొక్కలు ఎంచుకోవాలి. నాటే దూరం రకాన్ని బట్టి 20 I 20 సెం.మీ లేదా 30I30 సెం.మీ ఉండేలా నాటుకోవాలి.
ఎరువుల యజమాన్యం : స్నాప్ డ్రాగన్‌కు ఇతర పూల మొక్కలతో పోలిస్తే పోషకాలు తక్కువుగా అవసరమవుతాయి. ఆఖరి దుక్కి లో 10 టన్నుల ఎరువు, 20 కి నత్రజని, 30 పొటాష్‌ను ఇచ్చే ఎరువులను వేయాలి. ఒక వేళ అధికంగా పోషకాలను ఇస్తే ఆకులు పసుపు రంగులోకి మారిపోయి చిన్న పూల కాడలు రావడమే కాకుండా పూల దిగబడి తగ్గుతుంది.
నీటి యజమాన్యం : నేల స్వభావం మరియు వాతావరణం పై నీటి అవసరం ఆధారపడి ఉంటుంది. శీతాకాలం అయితే 15 రోజులకి ఒకసారి నీటిని అందించాలి.
Also Read: Amchur Powder (Dry Mango Powder): ‘‘ఆంచూర్’’తో పోషకాలు ఉపయోగాలు.!
స్టేకింగ్ : 15 – 30 సెం.మీ పొడువు గల కర్రల తో కట్టడం వల్ల పూల కాడలు వంగి పోకుండా నిటారుగా పెరిగి మంచి నాణ్యత పొందవచ్చు.
కలుపు నివారణ : మల్చింగ్ చేయడం మరియు మనుషుల చేత కలుపు నివారించవచ్చు.
తలలు తుంచడం : కుండీలలో, బాక్సులో పెరిగే మొక్కలకు తలలు తీయడం వల్ల పూలు గుబురుగా పెరిగి ఎక్కువుగా కనిపిస్తాయి. లేత మొక్కలు 4 – 5 ఎత్తు రాగానే తలలు తుంచి వేయాలి.
పూల కోత : 7 – 10 జతలు ఆకుల వచ్చాక పూలు పూయడం ప్రారంభమవుతుంది. పూలు ఎప్పుడు కోయాలంటే కాడ క్రింద భాగం నుండి 30% పూలు విచ్చుకోవటమే కాక కాడ క్రింద పైన ఉన్న పూల రంగు మారుతుంది. స్థానిక అమ్మకాలకు 1 / 2 నుండి 2 / 3 పూల కాడలు పుష్పించాలి. అదే విధంగా దూర ప్రాంతాలకు అయితే పూల కాడలు పై పూమొగ్గలు వచ్చాక అవి వికసించక ముందే పూల కాడలు కోయాలి.
దిగుబడి :
ఎకరాకు 70,000 – 80,000 కాడలను పొందవచ్చు. స్నాప్ డ్రాగన్ పూలను , పూలకాడలు మరియు బెడ్డింగ్‌గా రెండు రకాలుగా పొందవచ్చును. మొదటి గ్రేడ్ పూల కాడలైతే ఒక మొక్కకి 8 -12 పూలకాడలు, రెండవ గ్రేడ్ అయితే 15 – 20 పూల కాడలు పొందవచ్చు. సింగల్ కట్ అయితే 12 -60 పొడవు గల కట్ ఫ్లవర్‌ని, మల్టీ కట్ అయితే 12 – 26 పొడవు గల కట్ ఫ్లవర్స్ వస్తాయి. మార్కెట్‌లో ఒక బంచ్‌లో 10 వరకు పూల కాడలను పెట్టి ఒక బండిల్ ను రూ .100 /- వరకు అమ్ముతారు కాబట్టి సరాసరి ఒక కట్ పూలకాడకు రూ .10/- వస్తాయి. ఎకరాకు రైతుకు సుమారుగా 7,00,000 /- నుండి 8, 00,000 /- వరకు వస్తుంది. రైతుకు నేల తయారీ, విత్తన ఖర్చు, ఎరువులు, నీటి యజమాన్యం, కూలీలకు, స్టేకింగ్, కలుపు నివారణ, కోత, బంచింగ్, ప్యాకింగ్, రవాణా అంత కలిపి సుమారుగా 3, 50, 000 /- వరకు ఖర్చు వస్తుంది. మిగిలిన మొత్తంను రైతు నికర ఆదాయంగా పొందవచ్చు. కాబట్టి అంటిరైనమ్ సాగు చేసి రైతులు మంచి లాభాలు పొందవచు.
ప్యాకింగ్ : గ్రేడిరగ్ చేసిన పూల కాడను, బండిల్ చేసి (10 కాడలను ) పాలిధీన్ కవర్స్‌లో చుట్టి కార్డ్బోర్డ్ బాక్స్‌లో పెట్టి మార్కెట్‌కు తరలిస్తారు.
Also Read: Mango Plantations: మామిడి తోటలలో సస్యరక్షణ చర్యలు.!